భారతీయ వాహన తయారీ దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ సరికొత్త కమర్షియల్ వాహనాలను విడుదల చేసింది. ఇప్పటికే పలు రకాల కమర్షియల్ వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టి మంచి ప్రజాదరణ దక్కించుకున్న టాటా మోటార్స్.. దేశంలోనే తొలిసారిగా  CNG పవర్ తో కూడిన మీడియం, హెవీ కమర్షియల్ వెహికల్స్ రిలీజ్ చేసింది.  


CNG ఆధారిత మినీ, హెవీ కమర్షియల్ వెహికల్స్


టాటా మోటార్స్  ప్రైమా, సిగ్మా, అల్ట్రా అనే కమర్షియల్ ట్రక్స్ ను అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్మీడియట్,  లైట్ కమర్షియల్ వెహికల్ టిప్పర్లు, ట్రక్కుల్లో కొత్త సిరీస్ ను సైతం పరిచయం చేసింది.  దేశంలోనే తొలిసారిగా CNG ఆధారిత మినీ, హెవీ కమర్షియల్ వెహికల్స్ ని 28 టన్నులు,  19 టన్నుల కెపాసిటీతో విడుదల చేసింది. ఇవన్నీ మల్టీ పర్సన్ పనులకు ఉపయోగపడటంతో పాటు ఎక్కువ కాలం మన్నికనిస్తాయి. టాటా మోటార్స్  కొత్త ట్రక్కులు ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపొందాయి. ఈ CNG మోడల్‌ ట్రక్కులు పలు రకాల వీల్‌బేస్,  లోడ్ డెక్ పొడవు కలిగి ఉంటాయి. క్యాబిన్ కస్టమైజేషన్ కోసం కౌల్ ఆప్సన్ కూడా అందించబడుతుంది. ఈ మోడల్స్ 5.7 లీటర్ సెక్యూటిల్ గ్యాస్ ఇంజక్షన్ ఇంజిన్ పొందుతాయి.  180 బిహెచ్‌పి పవర్ తో పాటు 650 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. 1,000 కిలో మీటర్ల ప్రయాణాన్ని అందిస్తుంది.   


CNG  వెహికల్స్ ఫీచర్లు ఇవే..


టాటా ప్రైమా ట్రక్ అధునాతన డ్రైవర్ యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్స్ లో భాగంగా  కొలిషన్ మిటిగేషన్ సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి లేటెస్ట్ ఫీచర్స్ ను కలిగి ఉంది. మౌంటెడ్ కంట్రోల్స్,   బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ ను పొందుతుంది. వీటిలో 7 అంగుళాల టచ్‌ స్క్రీన్,  కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లాంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి.  


7 ఇంటర్మీడియట్,  లైట్ కమర్షియల్ వెహికల్స్ విడుదల


ఇక టాటా మోటార్స్ ఇంటర్మీడియట్,  లైట్ కమర్షియల్ వెహికల్స్ విభాగంలో మొత్తం 7 వాహనాలు విడుదలయ్యాయి. అవి LPK 610, LPT 709g XD, SK 710, అల్ట్రా T.12g, అల్ట్రా K.14, LPT 1512g తో పాటు అల్ట్రా T.16 Cx వాహనాలు. ఇందులో LPK 610 వాహనాలు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ తో పాటు సమర్థవంతమైన బ్రేకింగ్ సిస్టంను కలిగి ఉన్నాయి. అదే సమయంలో LPT 709g XD వాహనాలు 5 స్కోయర్ ఫీట్ తో వస్తున్నాయి. ఇవి 10 శాతం అధిక ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి.  SK 710 టిప్పర్   SFC ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా రూపొందిచబడింది. కమర్షియల్  వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అల్ట్రా T.12g ట్రక్కు 3.8-లీటర్ SGI టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో వస్తుంది. అల్ట్రా K.14 ట్రక్కు ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్‌తో పాటు అత్యధిక గ్రేడ్ ఎబిలిటీ పొంది ఉంది.  LPT 1512g అత్యధిక CNG సామర్థ్యంతో పాటు 10% మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందించేలా రూపొందించబడింది.   అల్ట్రా T.16 Cx ట్రక్కు 3.3-లీటర్ ఇంజన్ కలిగి మంచి పనితీరును అందిస్తుంది. సౌకర్యవంతమైన అల్ట్రా క్యాబిన్‌ తో వస్తుంది. ఈ వాహనాలన్నీ ఇప్పటి అవసరాలకు చాలా అనుకూలంగా ఉన్నాయి. కంపెనీ విడుదల చేసిన ఈ ఏడు డీజిల్ ట్రక్కులు ఆప్టిమైజ్డ్ డ్రైవ్‌లైన్‌లు, విస్కస్ రియర్ యాక్సెల్ ఆయిల్, ఇ-విస్కోస్ రేడియేటర్ ఫ్యాన్, గేర్‌షిఫ్ట్ అడ్వైజర్ తో పాటు  రోలింగ్ రెసిస్టెన్స్ టైర్‌ వంటి వాటిని పొందుతాయి.