Tata Harrier Petrol Version Details: టాటా హారియర్ అంటే ఇప్పటివరకు చాలామందికి డీజిల్‌ ఇంజిన్‌ మాత్రమే గుర్తుకొచ్చేది. లాంచ్‌ నుంచి ఇప్పటివరకు ఈ కారు డీజిల్‌ ఆప్షన్‌కే పరిమితమయ్యాయి. కానీ, టాటా మోటార్స్‌ ఇప్పుడు పెట్రోల్‌ వెర్షన్‌ లోటును తీర్చింది. Tata Sierra లో పరిచయం చేసిన 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ హైపీరియన్‌ ఇంజిన్‌ను ఇప్పుడు హారియర్‌లోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాటు పెట్రోల్‌ మోడల్‌కు కొత్త టాప్‌ వేరియంట్‌ కూడా ఇచ్చింది. ధరలు ఇంకా వెల్లడించలేదు కానీ, ఆసక్తి మాత్రం బాగా పెంచింది.

Continues below advertisement

టాటా హారియర్ పెట్రోల్‌ డ్రైవ్‌ అనుభవం ఆధారంగా దాని బలాలు, బలహీనతలు ఏంటో తెలుసుకుందాం.

ప్లస్‌ పాయింట్లు

Continues below advertisement

స్మూత్‌, ఎఫర్ట్‌లెస్‌ పెర్ఫార్మెన్స్‌టాటా హారియర్ పెట్రోల్‌లోని 1.5 లీటర్‌ డైరెక్ట్‌ ఇంజెక్షన్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 170hp పవర్‌, 280Nm టార్క్‌ ఇస్తుంది. సియెర్రాతో పోలిస్తే ఇది 10hp, 25Nm ఎక్కువ. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, 1,000rpm నుంచే 160Nm టార్క్‌ అందుబాటులో ఉంటుంది. అందువల్ల ట్రాఫిక్‌లో నడిపేటప్పుడు గేర్‌ మార్చాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. టర్బో ల్యాగ్‌ చాలా తక్కువగా అనిపిస్తుంది. స్పీడ్‌ బిల్డ్‌ అప్‌ చాలా సాఫీగా జరుగుతుంది.

ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ మంచి మ్యాచ్‌హారియర్ పెట్రోల్‌లో 6-స్పీడ్‌ మాన్యువల్‌, 6-స్పీడ్‌ ఐసిన్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌లు ఇస్తున్నారు. ఆటోమేటిక్‌ వెర్షన్‌ ఈ ఇంజిన్‌కు బాగా సెట్‌ అయింది. గేర్‌ షిఫ్ట్స్‌ చాలా స్మూత్‌గా ఉంటాయి. ప్యాడిల్‌ షిఫ్టర్స్‌ అవసరం అరుదుగా మాత్రమే అనిపిస్తుంది.

రైడ్‌ క్వాలిటీ, హైవే మేనర్స్‌డీజిల్‌ హారియర్‌లాగే, పెట్రోల్‌ మోడల్‌ కూడా డ్రైవ్‌ క్వాలిటీ విషయంలో చాలా బలంగా నిలుస్తుంది. ల్యాండ్‌ రోవర్‌ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ వల్ల, బ్యాడ్‌ రోడ్లపై కూడా బలమైన ఫీలింగ్‌ ఇస్తుంది. హైవేల్లో ట్రిపుల్‌ డిజిట్‌ స్పీడ్స్‌లోనూ కారు చాలా స్టేబుల్‌గా ఉంటుంది. డీజిల్‌తో పోలిస్తే సుమారు 80 కిలోలు తక్కువ బరువు ఉండటం వల్ల మలుపుల్లో కొంచెం చురుగ్గా అనిపిస్తుంది.

ఫీచర్లతో నిండిన లగ్జరీ ఫీలింగ్‌పెట్రోల్‌ టాప్‌ వేరియంట్‌ అయిన Fearless Ultraలో 14.53 అంగుళాల QLED టచ్‌స్క్రీన్‌, డాల్బీ అట్మాస్‌ ఆడియో లాంటి హై ఎండ్‌ ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్‌ రియర్‌వ్యూ మిర్రర్‌ కూడా ప్రత్యేక ఆకర్షణ. ఫ్రంట్‌, రియర్‌ కెమెరాలకు వాషర్స్‌ ఇవ్వడం ప్రాక్టికల్‌గా ఉపయోగపడుతుంది. లైట్‌ కలర్‌ ఇంటీరియర్‌ వల్ల కేబిన్‌ మరింత తాజాగానూ, ప్రీమియంగానూ అనిపిస్తుంది.

మైనస్‌ పాయింట్లు

ఎర్గోనామిక్‌ సమస్యలు ఇంకా ఉన్నాయిఇంటీరియర్‌ డిజైన్‌ డీజిల్‌ మోడల్‌లాగే ఉండటంతో కొన్ని సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి. వైర్‌లెస్‌ ఛార్జర్‌ పెట్టిన స్థానం సులభంగా అందుబాటులో ఉండదు. డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే లోపలికి వెళ్లి ఉండటంతో చిన్న అక్షరాలు చదవడం కష్టం.

బయట నుంచి పెట్రోల్‌ మోడల్‌ అనిపించదుకొత్త నైట్రో క్రిమ్సన్‌ కలర్‌ తప్ప, పెట్రోల్‌ హారియర్‌ను డీజిల్‌తో పోల్చి గుర్తించేలా బయట ఎలాంటి మార్పులు కనిపించవు. ప్రత్యేక పెట్రోల్‌ బ్యాడ్జింగ్‌ కూడా ఇవ్వలేదు.

చివరిగా

టాటా హారియర్ పెట్రోల్‌ స్మూత్‌ డ్రైవ్‌, మంచి కంఫర్ట్‌, లగ్జరీ ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, పెట్రోల్‌ SUV కోరుకునే వారికి ఇది బలమైన ఆప్షన్‌గా కనిపిస్తోంది. ధరలు వెల్లడయ్యాక, మార్కెట్‌లో దీని అసలు స్థానం ఏంటో స్పష్టమవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.