ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ సోమవారం (డిసెంబర్ 22) విజయ్ మాల్యా పుట్టినరోజు పార్టీ వేడుకల్లో పాల్గొన్నాడు. ఆ వీడియోను షేర్ చేస్తూ, తనను, మాల్యాను భారతదేశంలోనే అతిపెద్ద పరారీలో ఉన్నవారిగా పేర్కొంటూ భారత్‌పై సెటైర్లు వేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వ్యవస్థాపక చైర్మన్ అయిన లలిత్ మోడీ, లండన్ నుండి వీడియో పోస్ట్ చేయగా సోషల్ మీడియాను షేక్ చేసింది. "మేము ఇద్దరం పరారీలో ఉన్నాం, భారతదేశంలోనే పరారీలో ఉన్న అతిపెద్ద వ్యక్తులం" అని చెప్పాడు.

Continues below advertisement

లలిత్ మోడీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో క్యాప్షన్‌లో, "ఇంటర్నెట్‌లో మళ్ళీ సంచలనం సృష్టించేలా ఏదైనా చేస్తాను. మీ కోసం ఏదైనా ప్రత్యేకంగా ఉంటుంది" అని రాసుకొచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో భిన్న స్పందన వస్తోంది. ఒక వ్యక్తి "ఆ ఇద్దరు భారత ప్రభుత్వాన్ని ఎంతగా ఎగతాళి చేశారు" అని కామెంట్ చేయగా, మరికొందరు దీనికి భారత అధికారులనే బాధ్యులుగా పేర్కొన్నారు.

మాల్యా విషయంలో బాంబే హైకోర్టు ఏమన్నది?ఇటీవల బాంబే హైకోర్టు విజయ్ మాల్యాను ఎప్పుడు భారతదేశానికి తిరిగి రావాలని భావిస్తున్నారని అడిగింది. ఈ సమయంలో ఆయన మొదట హైకోర్టు అధికార పరిధిలోకి రాకపోతే, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టానికి వ్యతిరేకంగా ఆయన పిటిషన్‌ను కోర్టు విచారించదని మాల్యా తరఫు న్యాయవాదికి తెలిపారు.

Continues below advertisement

2016 నుండి బ్రిటన్‌‌కు పారిపోయి అక్కడే నివసిస్తున్న విజయ్ మాల్యా బాంబే హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి అతన్ని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించిన ఉత్తర్వులను సవాలు చేయడం, మరొకటి 2018 చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై ప్రశ్నలు లేవనెత్తారు. జనవరి 2019లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసులను విచారించే ప్రత్యేక కోర్టు విజయ్ మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. వేల కోట్ల రుణాల చెల్లింపులలో వైఫల్యం,  మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా మార్చి 2016లో భారతదేశం నుంచి పారిపోయారు.

 

దేశం విడిచి పారిపోయిన లలిత్ మోడీమరోవైపు, లలిత్ మోడీ పన్ను ఎగవేత, మనీలాండరింగ్,యు IPLకి సంబంధించిన ప్రాక్సీ యాజమాన్యం ఆరోపణల మధ్య భారతదేశం నుండి పారిపోయాడు. 2009లో IPL ప్రసార హక్కుల కేటాయింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, దీనికి ప్రతిఫలంగా రూ. 125 కోట్లకు పైగా లంచం తీసుకున్నారని ED ఆరోపణలు చేసింది.