Tata Harrier On EMI: టాటా హారియర్ అనేది ఐదు సీట్ల ఎస్‌యూవీ కారు. ఈ టాటా కారు మార్కెట్లో డీజిల్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. మార్కెట్లో ఈ కారుకు సంబంధించిన 25 వేరియంట్లు ఉన్నాయి. టాటా హారియర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 14.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 25.89 లక్షల వరకు ఉంటుంది. ఈ టాటా కారును కొనడానికి, మీరు ఒకేసారి పూర్తి చెల్లింపు చేయవలసిన అవసరం లేదు. మీరు ఈ కారును కొనడానికి రుణం కూడా తీసుకోవచ్చు.

టాటా హారియర్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి?టాటా హారియర్ చవకైన వేరియంట్ స్మార్ట్ డీజిల్. ఈ హారియర్ మోడల్ ఆన్ రోడ్ ధర రూ. 17.90 లక్షల వరకు ఉంటుంది. దేశంలో రాష్ట్రాన్ని బట్టి ఈ ధరలో తేడా ఉండవచ్చు. ఈ కారు కొనడానికి మీకు రూ. 16.11 లక్షల రుణం లభిస్తుంది. రుణ మొత్తం మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణంపై వసూలు చేసే వడ్డీ ప్రకారం ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని వాయిదాగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?

  • టాటా హారియర్ కొనడానికి కారు ధరలో దాదాపు 10 శాతం డౌన్ పేమెంట్‌గా బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ఈ విధంగా రూ.1.79 లక్షలు ముందుగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
  • మరోవైపు మీరు ఈ రుణాన్ని నాలుగు సంవత్సరాల కాల వ్యవధితో 9 శాతం వడ్డీతో తీసుకుంటే ప్రతి నెలా దాదాపు 40 వేల రూపాయలు ఈఎంఐగా డిపాజిట్ చేయాలి.
  • మీరు కారు కొనడానికి ఐదు సంవత్సరాల కాలవ్యవధితో రుణం తీసుకుంటే ప్రతి నెలా రూ.33,500 ఈఎంఐ చెల్లించాలి.
  • టాటా హారియర్ కొనుగోలు కోసం మీరు ఆరు సంవత్సరాల కాలవ్యవధితో రుణం తీసుకుంటే మీరు 9 శాతం వడ్డీ రేటుతో ప్రతి నెలా రూ.29,000 ఈఎంఐ చెల్లించాలి.
  • మీరు ఏడు సంవత్సరాల కాలవ్యవధితో బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే దాదాపు ప్రతి నెలా రూ.25,900 ఈఎంఐ చెల్లించాలి.

    Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!