భారత్‌లో టాటా మోటార్స్ కార్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. టాటా కార్లు బెస్ట్ లుక్, దృఢత్వానికి పేరుగాంచాయి. టాటా మోటార్స్ తన కూపే-ఎస్‌యూవీ టాటా కర్వ్ ప్రజాదరణను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేసింది. టాటా మోటార్స్ కర్వ్ కొత్త అవతార్ 'టాటా కర్వ్ సిరీస్ ఎక్స్' (Tata Curvv series x)ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.
ఈ కార్ల ప్రారంభ ధరను కేవలం ₹9.99 లక్షలుగా నిర్ణయించారు. అంటే ఇప్పుడు కేవలం రూ.10 లక్షల ప్రారంభ బడ్జెట్‌లోనే కస్టమర్లకు ఈ ప్రీమియం లుక్ ఉన్న కూపే- ఎస్‌యూవీని కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త కారును పెట్రోల్, డీజిల్ ర2 ఇంజిన్ ఆప్షన్లతో పరిచయం చేసింది. ఇది బడ్జెట్ సెగ్మెంట్‌లో క్రెటా, సెల్టోస్ వంటి కార్లకు నేరుగా పోటీ ఇస్తుంది.
రూ. 9.99 లక్షల నుంచి ధరలు ప్రారంభం
టాటా కర్వ్ సిరీస్ ఎక్స్‌ను కంపెనీ 6 ప్రధాన ట్రిమ్‌లుగా విభజించింది. వీటిలో స్మార్ట్ ఎక్స్, ప్యూర్ ఎక్స్, ప్యూర్ ఎక్స్+, క్రియేటివ్ ఎక్స్+, ఎకామ్ప్లిష్డ్ ఎక్స్, ఎకామ్ప్లిష్డ్ ఎక్స్+ అని ఉన్నాయి. దీని ప్రారంభ స్మార్ట్ ఎక్స్ వేరియంట్ ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ అయిన ఎకామ్ప్లిష్డ్ ఎక్స్+ డార్క్ ఎడిషన్ ధర రూ.18.99 లక్షలుగా ఉంది. స్టైల్‌ను కోరుకునే కస్టమర్ల కోసం ఎంపిక చేసిన ట్రిమ్‌లలో ఆల్-బ్లాక్ థీమ్‌తో కూడిన డార్క్ ఎడిషన్ తెచ్చింది. ఇది కారుకు అత్యంత స్పోర్టీ, అగ్రెసివ్ లుక్ ఇస్తుంది.
ఈఎంఐ లెక్కల పూర్తి వివరాలు
బేస్ మోడల్ హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ధర రూ. 11,89,545గా ఉంది. లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చేస్తే.. మిగతా 10.89 లక్షలు కార్ లోన్ తీసుకోవాలి. 4 ఏళ్ల కాలానికిగానూ 9.8 శాతం వడ్డీతో ప్రతినెలా (48 నెలలు) రూ.27,529 చెల్లించాలి. 5 ఏళ్లపాటు లోన్ తీసుకుంటే 60 నెలలపాటు ప్రతినెల రూ.23,043 చెల్లించాలి. ఈఎంఐం బారం తగ్గించుకోవాలని 6 ఏళ్ల కాలానికి లోన్ తీసుకుంటే 9.8 శాతం వడ్డీతో ప్రతినెలా EMI రూ.20,075 చెల్లించాలి. అయితే మీరు చెల్లించే మొత్తం రూ. 14.45 లక్షల వరకు అవుతుందని గ్రహించాలి.
Also Read: 7 సీటర్ కోసం చూస్తున్నారా.. Volkswagen Tayron పై రూ.1.50 లక్షలు ఆదా, 9 ఎయిర్ బ్యాగ్స్
కేబిన్‌లో పలు మార్పులు
సిరీస్ ఎక్స్ ఇంటీరియర్, సీటింగ్ సౌకర్యంపై కంపెనీ బాగా వర్క్ చేసింది. దీని కేబిన్‌లో కొత్త కలర్ థీమ్స్, మరింత ప్రీమియం టచ్ ఉన్న మెటీరియల్ వాడారు. దీని ఫ్రంట్ సీట్ల బ్యాక్ పార్ట్‌ను కాస్త సన్నగా చేసి, రియర్ బెంచ్ పొజిషనింగ్‌ను మళ్లీ రీ-డిజైన్ చేసింది. కేబిన్‌లో జరిగిన ఈ మార్పుతో వెనుక కూర్చునే ప్యాసింజర్లకు అంతకుముందు కంటే చాలా మెరుగైన లెగ్‌రూమ్, నీ-రూమ్ లభిస్తాయి. వీటితో పాటు కేబిన్‌లో ఓయిస్టర్ వైట్ లెదరెట్ అప్‌హోల్‌స్టరీ, వెంటిలేటెడ్ సీట్లు ఫీచర్లు ఉన్నాయి. లాంగ్ జర్నీకి ఈ కారు సెట్ అవుతుంది.
ADAS వంటి లోడెడ్ ఫీచర్లు
టాటా కర్వ్ సిరీస్ ఎక్స్ పూర్తిగా లోడెడ్ గా ఉంది. దీని బేస్, మిడ్ వేరియంట్లలోనే 10.25 అంగుళాల హార్మన్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, క్రూయిజ్ కంట్రోల్, ఆపిల్ కార్‌ప్లే, పుష్-బటన్ స్టార్ట్ స్టాప్ వంటి ఫీచర్లు ఇచ్చారు. టాప్ వేరియంట్లలో పెద్దదైన 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పానోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ 3D కెమెరా, జేబీఎల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, జెస్టర్-కంట్రోల్డ్ పవర్డ్ టెయిల్‌గేట్, యాంబియంట్ మూడ్ లైటింగ్, లెవెల్-2 ADAS వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ టెక్నాలజీని అందించారు. రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, ESP ని స్టాండర్డ్‌గా చేర్చారు.
Also Read: 2026 Tata Punch EV: 468km రేంజ్ అని కంపెనీ చెప్పింది.. కానీ రియల్ వరల్డ్‌లో ఎంతదూరం వెళ్లిందంటే?
3 పవర్‌ఫుల్ ఇంజిన్లు
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, టాటా కర్వ్ సిరీస్ ఎక్స్‌లో కస్టమర్లకు ఇంజిన్ ఎంచుకోవడానికి 3 ఆప్షన్లు లభిస్తాయి. ఇందులో మొదటిది 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, రెండవది 1.2 లీటర్ హైపీరియన్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్, మూడోది 1.5 లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజిన్.
ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్ ఇచ్చారు. టాటా మోటార్స్ డీజిల్ ఇంజిన్‌తో కూడా DCA ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఆఫర్ చేసింది. ఈ సెగ్మెంట్‌లో దీనిని చాలా ప్రత్యేకమైన, శక్తివంతమైన ఆప్షన్ మారుస్తుంది.
