Tata Curvv EV Top Features: నెలల తరబడి ఆసక్తిగా ఎదురుచూసిన టాటా కర్వ్‌ మార్కెట్‌లో విడుదల అయ్యింది. ఊహించినట్లుగానే ఈ కారు మొదట ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెట్టారు. Tata Curvv EV ప్రారంభ ధర రూ. 17.49 లక్షలు, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 21.99 లక్షలుగా ఉంది. ఇది క్రియేటివ్, అకాంప్లిష్డ్ మరియు ఎంపవర్డ్ అనే  మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 



బ్యాటరీ
టాటా Curvv EV రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తుంది. 45 kWh మిడిల్‌ రేంజ్‌ మరియు 55 kWh లాంగ్‌ రేంజ్‌గా ఉన్నాయి. ఈ కారుని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 585 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఇది 1.2C ఛార్జింగ్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. అంటే కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 150 కిమీల వరకు ప్రయాణించవచ్చు అన్నమాట.  

ఇంటీరియర్‌
కారు డాష్‌బోర్డ్‌లో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ మరియు టచ్ క్లైమేట్ కంట్రోల్‌ని కలిగి ఉంది. ఇంటీరియ్‌ భాగం వైట్‌, గ్రే కలర్‌ ఆప్షన్‌లో వస్తుంది. ఇందులో 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్‌ కూడా ఉంది. టాప్ వేరియంట్‌లో లెథెరెట్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు 320W JBL సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.

పర్ఫామెన్స్ & ఇంజిన్ ఆప్షన్స్‌
టాటా Curvv ICE వెర్షన్ రెండు పెట్రోల్ ఇంజిన్‌లు, ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది. వీటిలో కొత్త హైపెరియన్ GDi ఇంజిన్ 125 hp, 225 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ టర్బో పెట్రోల్ రెవోట్రాన్ ఇంజిన్ 120 hp మరియు 170 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక అప్‌డేటెడ్‌ 1.5-లీటర్ క్రయోటెక్ డీజిల్ యూనిట్ 115 hp మరియు 260 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్లు Nexon నుంచి తీసుకోబడ్డాయి. 

వేగం
Tata Curvv EVలోని 123 kWh ఎలక్ట్రిక్ మోటార్ ఆకట్టుకునే పనితీరును అందిస్తుంది. కేవలం 8.6 సెకన్లలో 0 నుండి 100 km/h వేగాన్ని అందుకుంటుంది. ఈ కర్వ్‌ ఈవీ గంటకు 160 km/h గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఇది నెక్సాన్ EVలో ప్రవేశపెట్టిన విధంగా V2V (వెహికల్-టు-వెహికల్), V2L (వెహికల్-టు-లోడ్) ఛార్జింగ్ ఆప్షన్స్‌తో వస్తుంది. 


డ్రైవింగ్‌ మోడ్స్‌ 
ఇది ఎకో, సిటీ మరియు స్పోర్ట్ డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. Tata Curvv EV 190 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో 18-అంగుళాల వీల్స్‌తో నడుస్తుంది. ఇది 450 mm లోతు వరకు నీటిలోనూ ప్రయాణించగలదు. అదనపు సౌకర్యం కోసం కారులో ఆరు- సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్లు మరియు వెనుక రెండు-పొజిషన్ రిక్లైన్ సీట్లు ఉన్నాయి. 


బూట్‌ స్పేస్‌ & సేఫ్టీ
Tata Curvv EV 500 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. వెనుక సీటు 60:40 రేషియోలో డివైడ్‌ చేయబడింది. వెనక రెండు సీట్లను ముడతబెడితే 973 లీటర్ల భారీ స్పేస్‌ లభిస్తుంది. సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు మరియు లెవల్ 2 ADAS టెక్నాలజీ ఉన్నాయి. 


ఇతర సాంకేతిక ఫీచర్లు
వెనక డోర్‌ని పవర్డ్‌ డోర్‌గా అందించింది. అంటే ఇది ఎలక్ట్రానిక్ కంట్రోల్‌లా పనిచేస్తుంది. కారు కింద భాగంలో కాలు చాపితే డోర్‌ ఆటోమేటిక్‌గా తెరుచుకునేలా దీన్ని డిజైన్ చేశారు. అలాగే ఇందులో తొలిసారిగా అకౌస్టిక్ వెహికిల్‌ అలర్ట్ సిస్టం అనే కొత్త టెక్నాలజీని తీసుకువచ్చారు. కారు గంటకు 20 కిలోమీటర్ల వేగం వద్ద ఎవరైనా పాదచారులు కారుకి దగ్గరగా వస్తే ప్రత్యేక సౌండ్‌ సిస్టమ్‌తో అలర్ట్‌ చేస్తుంది.