Tata Curvv EV Price in India: టాటా మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ కారు టాటా కర్వ్ ఈవీ కూప్ కాన్సెప్ట్ మోడల్‌ను ప్రదర్శించింది. ఈ టాటా కొత్త కారు డిజైన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. టాటా మార్కు డిజైన్‌తో దీన్ని రూపొందించారు. ఇది న్యూ జెన్ 2 ఆర్కిటెక్చర్‌పై పనిచేయనుంది. ఈ కొత్త టాటా కర్వ్ ఈవీ కూప్ కాన్సెప్ట్ కారు నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) కంటే పెద్దగా ఉండనుంది. దీని పొడవు దాదాపు 4.3 మీటర్లు ఉండనుంది. వీల్ బేస్ కూడా నెక్సాన్‌తో పోలిస్తే 50 మిల్లీమీటర్లు పెద్దగా ఉంది.


వీల్ బేస్ పెద్దగా ఉంది కాబట్టి బ్యాటరీ ప్యాక్ కూడా పెద్దగా ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల రేంజ్‌ను ఇది అందించే అవకాశం ఉంది. ఎంజీ జెడ్ఎస్ ఈవీ, హ్యుండాయ్ కోనా ఎలక్ట్రిక్‌లతో ఇది పోటీ పడనుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 2024లో ఈ కర్వ్ ఈవీ మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


టాటా మోటార్స్ ఇప్పటివరకు లాంచ్ చేసిన కార్లలో షార్ప్, స్టైలిష్ లుక్ దీని సొంతం. ఈ కారు ముందువైపు సన్నని డీఆర్ఎల్స్ అందించారు. దీంతోపాటు స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌లైట్ ట్రీట్‌మెంట్ కూడా ఇందులో చూడవచ్చు. టాటా ఇంపాక్ట్ 2.0 డిజైన్ మోడల్‌ను ఇందులో చూడవచ్చు. ఈ కారు సైజు కూడా భారీగా ఉండి ప్రీమియం ఫీల్‌ను అందిస్తుంది.


ఇక కారు వెనకవైపు విషయానికి వస్తే... వెనకవైపు లైట్లు ఈ కారుకు మరింత మోడర్న్ లుక్‌ను అందించనున్నాయి. టాటా కర్వ్ ఈవీ కూప్ ఒక కనెక్టెడ్ కారు కానుందని టాటా ఇప్పటికే వెల్లడించింది. ఇందులో లేటెస్ట్ బెల్స్, విజిల్స్ ఉండనున్నాయి. దీని కేబిన్ కూడా మినిమలిస్టిక్ డిజైన్‌తో ఆకట్టుకునేలా ఉంది. ప్రతి సీటుకు ప్రత్యేకమైన స్క్రీన్లు ఇందులో అందించారు. ఇవి ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్లుగా కూడా పనిచేయనున్నాయి. అయితే ఇవి కాన్సెప్ట్ వెర్షన్ ఫీచర్లే. ప్రొడక్ట్ వెర్షన్‌కు వచ్చేసరికి ఇందులో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. టాటా కర్వ్ ఈవీ ధరను కూడా కంపెనీ ఇంకా వెల్లడించలేదు.


టాటా నెక్సాన్ ఈవీకి పై వెర్షన్‌గా టాటా కర్వ్ ఈవీ ఉండనుంది. అంటే ధర కూడా నెక్సాన్ ఈవీ కంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. టాటా నెక్సాన్ ఈవీ మనదేశంలో పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సక్సెస్ స్పూర్తితోనే టాటా కర్వ్ ఈవీ కూప్‌ను కూడా రూపొందించింది. భవిష్యత్తులో కంపెనీ నుంచి మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.




Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?