Tata Altroz Price, Down Payment, Car Loan EMI Details: టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్.. అద్భుతమైన కొత్త డిజైన్‌తో, తన సీగ్మెంట్లో ‘గ్లామర్‌ స్టార్ట్‌’ లుక్స్‌ సాధించింది. కారు ముందు భాగంలో ఉన్న స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్స్, ఐబ్రో ఆకారపు DRLs, అప్‌డేట్‌ చేసిన గ్రిల్, మొత్తం కార్‌ ఫేస్‌కు మరో లెవల్‌ స్టైల్‌ జోడించాయి. కారు లోపల పెద్ద 10.25 అంగుళాల డ్యూయల్ స్క్రీన్‌లతో కూడిన ఇంటీరియర్‌ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ ఫీల్‌ అందిస్తుంది. ఫ్లష్ హ్యాండిల్స్‌ దీనికి అదనపు ఆకర్షణ. కారు వెనుక వైపు LED లైట్‌బార్‌తో కనెక్ట్ అయిన ఆకర్షణీయమైన టెయిల్‌ల్యాంప్స్, రాత్రిపూట విజన్‌ను ఫ్యూచరిస్టిక్‌గా మారుస్తున్నాయి. ఫీచర్ల పరంగా, టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఒక స్టైలిష్, టెక్నో-స్మార్ట్, సేఫ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో, టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌లో పెట్రోల్ బేస్ వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.89 లక్షలు. దీనిని హైదరాబాద్‌లో కొనుగోలు చేస్తే, దాదాపు రూ. 99,000 రిజిస్ట్రేషన్ ఛార్జీ & దాదాపు రూ. 36,000 బీమా, ఇతర ఖర్చులు చెల్లించాలి. అవన్నీ యాడ్‌ చేసిన తర్వాత, టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ ఆన్-రోడ్ ధర రూ. 8.24 లక్షలకు చేరుకుంటుంది.

రూ.2 లక్షల డౌన్ పేమెంట్ తర్వాత ఎంత రుణం అవసరం?ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ను మీ ఇంటికి తీసుకువెళ్లడానికి మీరు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి కార్‌ లోన్ రూపంలో తీసుకోవాలి. అంటే, మీరు రూ. 6.24 లక్షల రుణం తీసుకోవాలి. బ్యాంక్ ఈ రుణాన్ని మీకు 9% వడ్డీ రేటుకు ఇచ్చిందని అనుకుందాం. ఇప్పుడు, నెలనెలా ఎంత EMI కట్టాలో ఆప్షన్స్‌ చూద్దాం.

7 సంవత్సరాల (84 నెలలు) కాలానికి రుణం తీసుకుంటే, మీ నెలవారీ EMI రూ. 10,038 అవుతుంది.

6 సంవత్సరాల (72 నెలలు) కాలానికి రుణం తీసుకుంటే, మీ నెలవారీ EMI రూ. 11,246 అవుతుంది.

5 సంవత్సరాల (60 నెలలు) కాలానికి రుణం తీసుకుంటే, మీ నెలవారీ EMI రూ. 12,951 అవుతుంది.

4 సంవత్సరాల (48 నెలలు) కాలానికి రుణం తీసుకుంటే, మీ నెలవారీ EMI రూ. 15,525 అవుతుంది.

మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీకి ఏ EMI ప్లాన్ ఉత్తమం?మీ బడ్జెట్ పరిమితంగా ఉండి, 2 లక్షల డౌన్ పేమెంట్‌ చేస్తే... నెలకు రూ. 10,038 చొప్పున 7 సంవత్సరాల EMI ఆప్షన్‌ ఎంచుకోవడం బెటర్‌. మీరు నెలకు మరో 3 వేలు కూడా పెట్టగలిగితే, 5 సంవత్సరాల EMI ఆప్షన్‌ ఎంచుకోవచ్చు.

టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌కు ప్రత్నామ్నాయ కార్లుస్టైల్, స్పేస్ & సేఫ్టీ కలయికను ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ అందిస్తుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఉన్న కార్లతో ఇది నేరుగా పోటీ పడుతుంది. ఈ లిస్ట్‌లో.. Maruti Suzuki Baleno, Toyota Glanza & Hyundai i20 ఉన్నాయి. ధర పరంగా, ఇది కొన్ని కాంపాక్ట్ SUVలతో కూడా పోటీ పడుతుంది.