Suzuki Gixxer 250 Features: స్ట్రీట్ నేకడ్ లుక్ కోరుకునే వాళ్లు ఎక్కువగా ఇష్టపడే మోడల్ - సుజుకి జిక్సర్ 250. రైడింగ్ కంఫర్ట్, నమ్మకమైన ఇంజిన్, మంచి మైలేజ్, స్పోర్టీ హ్యాండ్లింగ్... ఈ నాలుగు కారణాలతో ఇది యువ రైడర్లలో బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో రోజువారీ ప్రయాణం చేసే వారికి ఇది ప్రాక్టికల్ ఛాయిస్‌గా ఉంటుంది. కానీ ఈ బైక్ కొనడానికి ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే, తప్పులు లేకుండా నిర్ణయం తీసుకోవచ్చు.
సుజుకి జిక్సర్ 250 గురించి 6 క్లియర్‌కట్ పాయింట్స్
1. 249cc శక్తిమంతమైన ఇంజిన్ - ఎంత పవర్ ఇస్తుంది?జిక్సర్ 250లో 249cc సింగిల్-సిలిండర్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 26.5hp పవర్ & 22.2Nm టార్క్ ఇస్తుంది. సిటీ కమ్యూట్‌లోనూ, హైవే రైడ్‌లోనూ తక్కువ గేర్ మార్పులతో స్మూత్‌గా నడుస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ స్పందన కూడా క్లియర్‌గా ఉంటుంది. ప్రత్యేకంగా హైదరాబాద్ రోడ్ల మీద సిటీ ట్రాఫిక్‌లో రైడ్ చేసినా ఇంజిన్ వేడి ఎక్కువగా అనిపించదు.
2. E20 కంప్లయింట్ - ఫ్యూచర్‌లోనూ టెన్షన్ లేదుసుజుకి అధికారిక సమాచారం ప్రకారం, జిక్సర్ 250 పూర్తిగా E20 ఫ్యూయల్‌కి కంప్లయింట్. అంటే, వచ్చే సంవత్సరాల్లో పెట్రోల్‌లో ఎథనాల్ శాతం పెరిగినా ఇంజిన్ మీద ఎలాంటి నెగటివ్ ప్రభావం ఉండదు. ఇది భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న మంచి నిర్ణయం.
3. Flex-Fuel వెర్షన్ ఉందా?లేదు. జిక్సర్ SF 250లో లాగా E85 ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్ జిక్సర్ 250కి లేదు. ఇది కేవలం స్టాండర్డ్ E20 వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో E85 ఫ్యూయల్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది రైడర్లకు E20 వెర్షన్ సరిపోతుంది.
4. LED లైటింగ్ - ఫుల్ LED సెటప్ ఉందా?జిక్సర్ 250లో హెడ్‌ల్యాంప్స్ LED, టెయిల్ లైట్ కూడా LED. కానీ ఇండికేటర్లు మాత్రం ఇంకా బల్బ్ సిస్టమ్‌లోనే ఉన్నాయి. అంటే పూర్తి LED కాదు. అయినా కూడా LED హెడ్‌ల్యాంప్స్ నైట్ టైమ్‌లో మంచి విజిబిలిటీ ఇస్తాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లేదా విజయవాడ బైపాస్ రోడ్డుల్లో దీనిని మీరు స్పష్టంగా ఫీల్ కావచ్చు.
5. బ్లూటూత్ కనెక్టివిటీ - ఫీచర్లలో మంచి అదనపు ప్లస్జిక్సర్ 250లో ఉన్న LCD డాష్‌ను బ్లూటూత్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. Suzuki Ride Connect యాప్ ద్వారా మీ మొబైల్ కనెక్ట్ చేస్తే...
- టర్న్-బై-టర్న్ నావిగేషన్
- కాల్ అలర్ట్స్
- మెసేజ్ అలర్ట్స్
- యూజ్‌ఫుల్ రైడింగ్ ఇన్ఫో
స్క్రీన్‌పై ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇలాంటి ఫీచర్లు ఉండటం నిజంగా మంచి అడ్వాంటేజ్.
6. ధర - అందుబాటులో ఉన్న వెర్షన్లుసుజుకి జిక్సర్ 250 ధర ప్రస్తుతం రూ. 1.83–1.84 లక్షలు (ఎక్స్-షోరూమ్, తెలుగు రాష్ట్రాలు). ఆన్-రోడ్ ధర సాధారణంగా రూ. 2.10–2.15 లక్షల మధ్య ఉంటుంది, ఇది వేరియంట్, RTO & ఇన్సూరెన్స్ ఆధారంగా కొద్దిగా మారుతుంది.
ముగింపు - ఎవరు కొనాలి?ఆఫీస్‌కు వెళ్లేవాళ్లకు, వీకెండ్ హైవే రైడ్‌లు ఇష్టపడేవారికి, తక్కువ మెయింటెనెన్స్ కావాలనుకునే వారికి సుజుకీ జిక్సర్ 250 ఒక అద్భుతమైన ప్యాకేజ్. పవర్ బాలెన్స్, కంఫర్ట్, స్టైలింగ్ అన్నీ కలిపి ఇది యువ రైడర్లకు ఒక గుడ్ ఆప్షన్ అనడంలో సందేహం లేదు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.