Suzuki Electric Scooter e-Access 2025 Launching: ప్రెట్రోల్‌ & డీజిల్‌ ధర కంటే చాలా చవగ్గా ప్రయాణించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు ఇప్పుడు డిమాండ్‌ పెరుగుతోంది. టూవీలర్‌ కంపెనీలు కూడా మెరుగైన రేంజ్‌, ఫీచర్లతో కొత్త వెర్షన్‌లను లాంచ్‌ చేస్తూ, ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై ప్రజల నమ్మకాన్ని పెంచుతున్నాయి. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా కూడా, తన పాపులర్‌ మోడల్‌ 'యాక్సెస్‌'కు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ‍‌(Suzuki e-Access) విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ స్కూటర్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాదు, ఈ బండి గరిష్టంగా 71 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు.

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, Suzuki e-Access స్కూటర్‌ వచ్చే నెలలో (జూన్ 2025) లాంచ్ కావచ్చు. అంటే, ఈ సూపర్‌ రేంజ్‌ స్కూటర్‌ మరికొన్ని రోజుల్లో మన ముందుకు వస్తుంది. సుజుకీ కంపెనీ, దీనిని మొదట ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది. పెట్రోల్‌ పరుగులు తీసే సుజుకీ యాక్సెస్‌ ఇప్పటికే మార్కెట్‌లో మాంచి ఊపు మీద ఉంది. దీని ఎలక్ట్రిక్ వెర్షన్‌ కూడా ప్రజల్లో పాపులర్‌ కావచ్చని భావిస్తున్నారు.

ఇ-యాక్సెస్‌ డిజైన్ ఎలా ఉంది?సాంప్రదాయ స్కూటర్లతో పోలిస్తే, సుజుకి ఇ-యాక్సెస్ డిజైన్ కొద్దిగా భిన్నంగా & ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ టూవీలర్‌లో రేక్డ్ ఫ్రంట్ ఆప్రాన్, క్రీజ్ లైన్‌తో హెడ్‌లైట్ కౌల్, ఫ్లాట్ సైడ్ ప్యానెళ్లు, ప్రత్యేక ఇండికేటర్ ప్లేస్‌మెంట్‌తో ప్రత్యేకమైన టెయిల్ సెక్షన్ వంటి ఫీచర్లు (Suzuki e-Access Features) ఉన్నాయి. ఈ లుక్ యువతను, ముఖ్యంగా సిటీ రైడర్లను అమితంగా ఆకట్టుకుంటుంది.           

బ్యాటరీ & రేంజ్‌సుజుకీ ఇ-యాక్సెస్‌లో 3.07 kWh LFP బ్యాటరీని ‍(Suzuki e-Access Battery) ఏర్పాటు చేశారు, ఇది 95 కి.మీ.ల IDC రేంజ్‌ను ‍‌(Suzuki e-Access Range) ఇస్తుంది. 0 నుంచి 80% వరకు ఛార్జ్ కావడానికి 4 గంటల 30 నిమిషాలు ‍‌(Suzuki e-Access Battery Charging Time) పడుతుంది. దీనిని ఈజీగా, సాధారణ హోమ్ ఛార్జర్‌ను ఉపయోగించి ఇంట్లోనే ఛార్జ్ చేయవచ్చు. ఈ బండికి సాధారణ నిర్వహణ సరిపోతుంది, డబ్బు కూడా ఆదా అవుతుంది.   

ఇంజిన్‌ & పెర్ఫార్మెన్స్‌సుజుకీ ఇ-యాక్సెస్‌ 4.1 kW స్వింగ్ ఆర్మ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో పవర్‌ తీసుకుంటుంది. గంటకు 71 కి.మీ. గరిష్ట వేగాన్ని (Suzuki e-Access Speed) అందుకోగలదు. ఈ పనితీరు సిటీ ట్రాఫిక్‌లో సరిపోతుంది. పైగా... ఎటువంటి శబ్ధం లేకుండా మృదువైన సవారీ అనుభూతిని అందిస్తుంది.    

ఏ బండ్లకు పోటీగా రంగంలోకి దిగుతోంది?మన దేశంలో, సుజుకి ఇ-యాక్సెస్ ప్రధానంగా TVS iQube,  Honda Activa Electric & Ather Rizta వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడుతుంది. TVS iQube టెక్నాలజీ & రేంజ్‌కు ప్రసిద్ధి చెందింది. హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌ నమ్మకమైన బండిగా పేరు తెచ్చుకుంది. Ather Rizta ఒక కొత్త కానీ హై-టెక్ ఆప్షన్‌. సుజుకి ఇ-యాక్సెస్ ఈ మూడింటినీ ఢీకొట్టడానికి వస్తోంది.  

సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా, ఇ-యాక్సెస్‌ స్కూటర్‌ ధరను ఇంకా ప్రకటించలేదు.