Tata Altroz Facelift Finance Plan: టాటా మోటార్స్, అప్‌డేటెడ్‌ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను వారం క్రితమే విడుదల చేసింది. సరిగ్గా చెప్పాలంటే, ఈ స్టైలిష్‌ వెర్షన్‌ 23 మే 2025న మార్కెట్‌లో లాంచ్‌ అయింది. ఈ బండి ఎక్స్‌టీరియర్‌ లుక్స్‌ను చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది టాటా మోటార్స్‌. ఇంటీరియర్‌ ఫీచర్లలోనూ మరింత ప్రీమియం ఫీల్‌ను జోడించింది. మీరు, ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ డీజిల్ బేస్‌ వేరియంట్‌ను (Tata Altroz Facelift Pure Diesel 5MT) కొనుగోలు చేయాలంటే, బ్యాంక్‌ లేదా ఫైనాన్స్‌ కంపెనీ మీకు లోన్‌ ఇస్తుంది. మీరు కేవలం రూ. 2 లక్షలు డౌన్ పేమెంచ్‌ చేస్తే చాలు. మిగిలిన డబ్బును సులభంగా EMIల్లో చెల్లించవచ్చు.

టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు న్యూ, స్పోర్టి & బోల్డ్ ఎక్స్‌టీరియర్ లుక్స్‌లో వచ్చింది. ముందు భాగంలోకి సరికొత్త బంపర్ & షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌ వచ్చి చేరాయి. కారు వెనుక భాగంలో T-ఆకారపు LED టెయిల్‌లైట్స్‌ యాడ్‌ అయ్యాయి, ఇవి LED లైట్ బార్‌కు కనెక్టెడ్‌గా ఉన్నాయి. వెనుక భాగంలో 'ఆల్ట్రోజ్' బ్రాండింగ్ & డ్యూయల్-టోన్ బంపర్‌ ఈ బండిని మోర్‌ ప్రీమియం కార్‌ అనిపించేలా చేస్తోంది. కలర్స్‌ విషయానికి వస్తే.., టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌ డ్యూన్ గ్లో, అంబర్ గ్లో, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే & రాయల్ బ్లూ వంటి 5 కొత్త రంగులలో అందుబాటులో ఉంది, మీకు ఇష్టమైన రంగు కారును సెలెక్ట్‌ చేసుకోవచ్చు.

తెలుగు ప్రజలు ఎంత ధర చెల్లించాలి?టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ డీజిల్ బేస్‌ మోడల్‌ ఎక్స్-షోరూమ్ ధర (Tata Altroz Facelift ex-showroom price) రూ. 8.99 లక్షలు. తెలుగు రాష్ట్రాల్లో దీని ఆన్‌రోడ్‌ ధర దాదాపు రూ. 10.82 లక్షలు. ఇందులో.. ఎక్స్‌-షోరూమ్‌ ధర, బండి రిజిస్ట్రేషన్ రూ. 1,33,860 & బీమా రూ. 47,109, ఇతర ఖర్చులు రూ. 2,000 కలిసి ఉన్నాయి. మీరు ఈ కారు కోసం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో చేస్తే, రూ. 8.82 లక్షలు ఫైనాన్స్ తీసుకోవాలి.

ఫైనాన్స్‌ ప్లాన్‌బ్యాంక్‌ లేదా ఫైనాన్స్‌ కంపెనీ రూ. 8.82 లక్షలు రుణాన్ని 9% వార్షిక వడ్డీ రేటుతో మంజూరు చేసిందనుకుందాం. రుణాన్ని తిరిగి తీర్చడానికి మీరు ఎంచుకునే టెన్యూర్‌ను బట్టి నెలవారీ EMI మారుతుంది.

7 సంవత్సరాల టెన్యూర్‌ పెట్టుకుంటే మీ నెలవారీ EMI రూ. 14,191 అవుతుంది. మొత్తం వడ్డీ రూ. 3,10,008 అవుతుంది & బ్యాంక్‌కు చెల్లించే మొత్తం రూ. 11,92,008 అవుతుంది.

6 సంవత్సరాల టెన్యూర్‌ పెట్టుకుంటే మీ నెలవారీ EMI రూ. 15,899 అవుతుంది. మొత్తం వడ్డీ రూ. 2,62,694 అవుతుంది & బ్యాంక్‌కు చెల్లించే మొత్తం రూ. 11,44,694 అవుతుంది.

5 సంవత్సరాల టెన్యూర్‌ పెట్టుకుంటే మీ నెలవారీ EMI రూ. 18,309 అవుతుంది. మొత్తం వడ్డీ రూ. 2,16,532 అవుతుంది & బ్యాంక్‌కు చెల్లించే మొత్తం రూ. 10,98,532 అవుతుంది.

4 సంవత్సరాల టెన్యూర్‌ పెట్టుకుంటే మీ నెలవారీ EMI రూ. 21,949 అవుతుంది. మొత్తం వడ్డీ రూ. 1,71,533 అవుతుంది & బ్యాంక్‌కు చెల్లించే మొత్తం రూ. 10,53,533 అవుతుంది.

బ్యాంక్‌ వడ్డీ రేటు మీ క్రెడిట్‌ స్కోర్‌, బ్యాంక్‌ విధానాలపై ఆధారపడి ఉంటుంది. టెన్యూర్‌ తగ్గే కొద్దీ నెలవారీ EMI పెరిగినప్పటికీ, బ్యాంక్‌కు చెల్లించాల్సిన వడ్డీ మొత్తం తగ్గుతుంది. మీ వెసులుబాటును బట్టి, ఇందులో ఒక EMI ఆప్షన్‌ ఎంచుకోవచ్చు.

ఏ కార్లకు పోటీగా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చింది?మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా & హ్యుందాయ్ i20 వంటి స్పోర్టీ & ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లకు పోటీగా టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్‌లోకి వచ్చింది. ఇంకా.. నిస్సాన్ మాగ్నైట్ & రెనాల్ట్ కిగర్ వంటి కాంపాక్ట్ SUVలతోనూ ధర పరంగా పోటీ పడుతుంది.