Affordable SUVs With 6 Airbags And Best Features: తక్కువ బడ్జెట్ ఉన్నవాళ్లు SUV కొనడం ఇకపై ఒక కల కాదు. మీ జీతం రూ. 35,000 నుంచి రూ. 40,000 వరకు ఉన్నా చాలు, బెస్ట్‌ SUVని కొనుక్కొచ్చి సొసైటీలో మీ స్టేటస్‌ పెంచుకోవచ్చు.

ప్రస్తుతం, భారతదేశంలో తక్కువ ధరకు లభిస్తున్న 5 SUVల వివరాలు ఈ స్టోరీలో ఉన్నాయి. వీటిని మీరు రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ వాహనాలన్నీ స్టైల్‌, మైలేజ్, స్పేస్‌ & సేఫ్టీ పరంగా సెగ్మెంట్‌ బెస్ట్‌ అనదగినవి.

1. టాటా పంచ్ (Tata Punch)ఈ లిస్ట్‌లో ఫస్ట్‌ చెప్పాల్సిన పేరు టాటా పంచ్. భారతీయ రోడ్లపై అత్యంత పొదుపైన & సురక్షితమైన SUVలలో ఒకటిగా ఇది నిలిచింది. టాటా పంచ్‌ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6 లక్షలు. ఇది 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో దూసుకుపోతుంది & CNG ఆప్షన్‌లో కూడా లభిస్తుంది. CNG వేరియంట్‌ కోసం క్లెయిమ్ చేసిన మైలేజ్ కిలోగ్రాముకు 26.99 కి.మీ. అంటే, ఇది అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కార్‌. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు & ISOFIX చైల్డ్ సీట్ యాంకర్ వంటి కీలక ఫీచర్లు దీనిలో ఉన్నాయి. 5-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్‌తో ఉన్న ఈ SUV, తొలిసారి కార్‌ కొనుగోలు చేసేవారికి గొప్ప ఎంపిక అవుతుంది. దీని టాప్ వేరియంట్ రూ. 9.57 లక్షలకు లభిస్తుంది.

2. నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite)తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లు అందించే SUV నిస్సాన్ మాగ్నైట్‌. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.14 లక్షలు. ఇది రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో (1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ & 1.0-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్) లాంచ్‌ అయింది. ఈ SUV క్లెయిమ్డ్‌ మైలేజ్ లీటరుకు 19.9 కిలోమీటర్లు. మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, 7-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, VDC, ESC & TPMS వంటి ఫీచర్లు ఇందులో అందించారు.

3. మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)మారుతి సుజుకి ఫ్రాంక్స్ అత్యంత ఆధునిక & తక్కువ ధర SUV. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.54 లక్షలు. ఇది 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ & 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో వచ్చింది. CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది, దీని మైలేజ్ కిలోగ్రాముకు 28.51 కిలోమీటర్లు. ఫీచర్ల విషయానికి వస్తే... కార్‌ క్యాబిన్‌లో 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD & 360 డిగ్రీ కెమెరా వంటివి అమర్చారు. మెరుగైన మైలేజీతో పాటు ఆధునిక సాంకేతికతను కోరుకునే కస్టమర్లకు ఈ SUV ఉత్తమ ఎంపిక కావచ్చు.

4. స్కోడా కైలాక్ (Skoda Kylaq)స్కోడా బ్రాండ్‌ నుంచి కైలాక్ SUV ఇటీవలే భారతీయ మార్కెట్లోకి విడుదలైంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.25 లక్షలు. ఇది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో లాంచ్‌ అయింది, లీటర్‌కు 19.68 km వరకు మైలేజీ ఇవ్వగలదు. ఈ SUVలో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, 8-అంగుళాల డిజిటల్ క్లస్టర్, సింగిల్-పాన్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 6 ఎయిర్‌బ్యాగులు, TPMS వంటి 25 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్స్ & పర్‌ఫెక్ట్‌ ఫీచర్లను కోరుకునే కొనుగోలుదారులకు ఈ SUV అనుకూలంగా ఉంటుంది.

5. కియా సైరోస్ (Kia Syros)కియా సైరోస్ ఇండియన్‌ రోడ్లపైకి కొత్తగా టైర్‌ పెట్టింది, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.50 లక్షలు. ఇది రెండు ఇంజిన్ ఎంపికలతో విడుదల అయింది, అవి - 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ & 1.4 లీటర్ డీజిల్ ఇంజిన్. దీని క్లెయిమ్డ్‌ మైలేజ్ లీటర్‌కు 20.75 కి.మీ. ఈ SUV 12.3-అంగుళాల డ్యూయల్-స్క్రీన్ సెటప్, డ్యూయల్-జోన్ AC, 4-వే పవర్డ్ డ్రైవర్ సీట్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జర్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS & 360 డిగ్రీ కెమెరా వంటి హైటెక్ ఫీచర్లతో ఈ కార్‌ను ప్యాక్‌ చేశారు. మీరు ఫ్యూచర్‌ రెడీ & స్మార్ట్ SUVని కొనాలనుకుంటే కియా సైరోస్‌ను పరిశీలించవచ్చు.

ఈ అన్ని SUVల మీద తక్కువ డౌన్‌పేమెంట్‌తో బ్యాంక్‌/ఫైనాన్స్‌ కంపెనీ లోన్‌ వస్తుంది. రూ.40,000 జీతం/నెలవారీ ఆదాయం ఉన్న వ్యక్తులు 6 లేదా 7 సంవత్సరాల రుణ కాలవ్యవధితో లోన్‌ తీసుకుని సులభమైన వాయిదాల్లో తిరిగి చెల్లించవచ్చు.