Skoda Elroq New Electric Compact SUV Preview: ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ కార్లు, బండ్ల హవా నడుస్తుంది మార్కెట్ లో. ఈ నేపథ్యంలో వివిధ కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికిల్స్ పై ప్రత్యేక దృష్టి సారించాయి. పెట్రోల్ కార్లలో ఉండే ఫీచర్లను మించి ఎలక్ట్రిక్ కార్లను సరికొత్తగా, మోడ్రన్ డిజైన్ లతో మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. ఇక ఇప్పుడు స్కోడా సరికొత్తగా ఎల్రోక్(Elroq)తో మార్కెట్ తోకి రానుంది. మరి ఈ కారు ఫీచర్లు ఏంటి? బ్యాటరీ కెపాసిటీ ఏంటి? తదితర వివరాలను తెలుసుకుందాం.
స్కోడా తన ఎలక్ట్రిక్ suv ఎల్రోక్‌ను త్వరలోనే మార్కెట్ లోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో మోడల్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వివరాలను రిలీజ్ చేసింది. దాంతో పాటుగా కొన్ని ప్రివ్యూ ఫొటోలను కూడా షేర్ చేసింది. ఈ కారు.. వోక్స్ బ్యాగన్ గ్రూప్ ఎమ్ ఈబీ ఫ్లాట్ ఫాం ఆధారంగా రూపొందించారు. స్కోడా ఎల్రోక్ డిజైన్, ఫీచర్లు అందరినీ ఆకర్షించేలా వెరైటీగా ఇచ్చారు. బ్యానెట్ మీద స్కోడా అనే లెటరింగ్ తో వచ్చిన మొదటి మోడల్ ఎల్రోక్. ఇక డిజైన్ విషయానికొస్తే.. అన్ని ఈవీల్లాగానే స్లోప్ రూఫ్ ఇచ్చారు. ఈ కారుకి ఏరో డైనమికల్ ఆప్టిమైజ్డ్ వీల్స్, వీల్ గ్యాప్ రెడ్యూసర్, ఎయిర్ ఫ్లో కోసం ఎక్స్ టెండెడ్ వీల్ ఆర్క్ కూడా ఇచ్చారు.
స్కోడా ఎల్రోక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 560 కిలో మీటర్ల ప్రయాణించవచ్చు. అంటే హైదరాబాద్ నుంచి తిరుపతి (559 కిమీలు) వెళ్లిపోవచ్చు. అంతేకాకుండా 175 kW ఫాస్ట్ ఛార్జింగ్ ని కూడా ఇస్తున్నారు. 80 శాతం ఛార్జింగ్ కేవలం 28 నిమిషాల్లో పూర్తై పోతుంది. ఎల్రోక్ 50 వేరియంట్ లో 125 kW ఎలక్ట్రిక్ మోటారును 55 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. ఎల్రోక్ 60 విషయానికొస్తే.. మరింత శక్తివంతమైన 150 kW ఎలక్ట్రిక్ మోటార్, పెద్ద 63 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది.
ఇంటీయర్ ఇలా..
ఇక ఈ కారు ఇంటీరియర్ విషయానికొస్తే.. 5 ఇంచులు డిజిటల్ కాక్ పిట్, 13 ఇంచులు టచ్ స్క్రీన్ ఇచ్చారు. ఇక ఈ కారులో సీట్ల విషయానికొస్తే.. రెసిటైన్ ఫైబర్ తో డార్క్ మెలింగాతో ఇచ్చారు. డ్యాష్ బోర్డ్, సెంటర్ ఆర్మ్ రెస్ట్, కాళ్లు పెట్టుకునే చోట దాన్ని ఇచ్చారు. సేఫ్టీ విషయానికొస్తే.. మిగతా ఎస్ యూవీలతో పోలిస్తే దీంట్లో ఎక్కువగానే ఉన్నాయి. దీంట్లో 9 ఎయిర్ బ్యాగ్స్ ని అమర్చారు. అంతేకాకుండా రిమోట్ పార్కింగ్, రిమోట్ ట్రైన్డ్ పార్కింగ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు.
ఇండియాలో రిలీజ్ ఎప్పుడు?
స్కోడా ఎల్రోక్ ఇండియాలో ఈ ఏడాది చివర్లో రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఇండియన్స్ బడ్జెట్ కి వీలుగా తక్కువ కాస్ట్ లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే బడ్జెట్ లో సబ్ కంపాక్ట్ ఎస్ యూవీ తీసుకొచ్చిన స్కోడా ఈవీ కూడా తక్కువ బడ్జెట్ లో రిలీజ్ చేస్తుందని అంటున్నారు.
Also Read: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా రాబోతున్న బ్రిటిష్ బైక్, ఇండియాలో లాంచింగ్ ఎప్పుడంటే?