తర కార్ల తయారీ కంపెనీల మాదిరిగానే స్కోడా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లు వాహన మార్కెట్ ను రూల్ చేసే అవకాశం ఉండటంతో ఆ విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాదు.. ఎక్కువ కిలో మీటర్ల పరిధిని ఇచ్చేలా తమ తదుపరి కార్ల మీద పరీక్షలు జరుపుతోంది. ఆల్-ఎలక్ట్రిక్ స్కోడా ఆక్టావియా సెడాన్‌పై కాన్సంట్రేషన్ పెట్టిన కంపెనీ.. స్కోడా ఎన్యాక్ వంటి ఇతర మోడళ్లను మరింతగా అభివృద్ధి చేస్తోంది. మరోవైపు Ocativa మిడ్-లైఫ్ 2024లో లాంచింగ్ కు రెడీ అవుతోంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ సెడాన్  ఏ తేదీన లాంచ్ అవుతుందో మాత్రం కచ్చితంగా వెల్లడించలేదు. ఈ కారు ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.


2032 వరకు 70 శాతం ఎలక్ట్రిక్ కార్లు


2030 నాటికి  స్కోడా నుంచి 70%  వరకు ఎలక్ట్రిక్  వాహనాలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఏడు సీట్ల ఎలక్ట్రిక్ ఆక్టావియా SUV (ఇటీవల ఆవిష్కరించిన విజన్ 7S కాన్సెప్ట్ ద్వారా ప్రివ్యూ చేశారు), సిటీ EV, క్రాస్‌ఓవర్ 2026లో మార్కెట్లోకి వచ్చే సమయానికి  ప్రస్తుత తరం స్కోడా ఫాబియా స్థానంలో ఒక మినీ-SUVవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


స్కోడా కార్లకు SSP ఆర్కిటెక్చర్


వోక్స్‌వ్యాగన్ గ్రూప్ కు సంబంధించి SSP ఆర్కిటెక్చర్ 2025లో పరిచయం అయ్యే అవకాశం ఉంది.  వోక్స్‌వ్యాగన్ ID 3,  వోక్స్‌వ్యాగన్ ID 4తో సహా ప్రముఖ వాహనాల కోసం ఇప్పుడు ఉపయోగిస్తున్న MEB డిజైన్‌ను స్కోడా కార్లు పొందే అవకాశం ఉంది.  SUV-రకం లుక్ పై దృష్టి సారించే స్కోడా కొత్తగా ప్రకటించిన 'మోడరన్ సాలిడ్' డిజైన్ లాంగ్వేజ్ ఓవర్‌ హాల్‌కు అనుగుణంగా, ఎలక్ట్రిక్ ఆక్టావియా ప్రస్తుత మోడల్ కంటే మరింత స్టైలిష్ లుక్ ను కలిగి ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 


Also Read: ఇండియాలో టాప్ 5 ఫాస్టెస్ట్ హ్యాచ్‌బ్యాక్‌ కార్లు ఇవే!


ఎక్కువ పరిధిని ఇచ్చే పవర్ ఫుల్ బ్యాటరీలు


ఆక్టేవియా EV స్కోడా కు సంబంధించిన సరికొత్త 89kWh బ్యాటరీ యొక్క మరింత అధునాతన వెర్షన్‌ ను పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఇది 2024లో లేదంటే 2025లో అందుబాటులోకి రానుంది. WLTP శ్రేణి 595km కంటే ఎక్కువ పరిధిని ఇవ్వనున్నట్లు సమాచారం. 200kW వరకు ఛార్జింగ్ రేటును కలిగి ఉంటుంది. ప్రస్తుత మెయిన్ స్ట్రీమ్ బ్యాటరీల్లో VW గ్రూఫునకు చెందినవి ప్రముఖంగా ఉన్నాయి. ఈ బ్యాటరీ సాధారణ కారు యొక్క రెండు ముందు మోటార్లు, ఏదైనా శక్తివంతమైన vRS వైవిధ్యాల యొక్క నాలుగు మోటార్లు అమలు చేయగలగాల్సి ఉంటుంది. మొత్తంగా రానున్న రోజుల్లో స్కోడా కార్లు ఒక్క చార్జ్ తో  5 వందల పైచిలుకు కిలో మీటర్ల రేంజి పొందే అవకాశం ఉంది. మార్కెట్లోనూ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశం ఉంది.


Also Read: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?