Diwali Discount On Cars: దీపావళి 2025 సందర్భంగా చాలా ఆటోమొబైల్ కంపెనీలు తమ కస్టమర్లను ఆకర్షించడానికి డిస్కౌంట్లు, భారీ  ఆఫర్లను అందిస్తున్నాయి. ఈసారి కూడా పెద్ద కంపెనీలు సెడాన్ కార్లపై అద్భుతమైన ఫెస్టివల్ డిస్కౌంట్లను ప్రకటించాయి. ముఖ్యంగా Volkswagen Virtus కారు, Skoda Slavia వంటి ప్రీమియం కార్లపై రూ. 1.50 లక్షల నుంచి రూ. 2.25 లక్షల వరకు బెనిఫిట్ అవుతుంది.  

Continues below advertisement

టాటా టిగోర్ (Tata Tigor)

టాటా మోటార్స్ ఈ ఫెస్టివల్ సీజన్‌లో తమ పాపులర్ సెడాన్ టిగోర్‌పై రూ. 30,000 వరకు ప్రయోజనం అందిస్తోంది. దీని ధర రూ. 5.49 లక్షల నుండి రూ. 8.74 లక్షల మధ్య మోడల్ ను బట్టి ఉంటుంది. ఈ కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఇది 86hp శక్తినిస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఛాయిస్ రెండూ ఉన్నాయి.

Hyundai Aura

Hyundai Aura పై కస్టమర్‌లకు దీపావళి పండుగ సందర్భంగా రూ. 43,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో 83hp కలిగిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది. కొన్ని వేరియంట్‌లలో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ CNG కిట్ ఎంపిక కూడా ఉంటుంది. దీని ధర రూ. 5.98 లక్షల నుండి రూ. 8.42 లక్షల వరకు ఉంది. 

Continues below advertisement

మారుతి సుజుకీ (Maruti Suzuki Ciaz)

Maruti Suzuki Ciaz ఇప్పుడు ఉత్పత్తి చేయడం లేదు. కానీ కొంతమంది డీలర్ల వద్ద ఇప్పటికీ ఈ కార్ అందుబాటులో ఉంది. ఈ దీపావళి సందర్భంగా Ciaz పై కస్టమర్‌లకు రూ. 45,000 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 105hp ఎనర్జీని జనరేట్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండింటిలోనూ లభిస్తుంది. ధర రూ. 9.09 లక్షల నుండి రూ. 11.88 లక్షల మధ్య ఉంది.

హోండా అమేజ్ (Honda Amaze)

ఈసారి కూడా Honda Amaze కారు అద్భుతమైన ఆఫర్‌తో మార్కెట్‌లో విక్రయాలు చేస్తుంది. కంపెనీ కొత్త Amaze పై రూ. 68,000 వరకు ఆఫర్ ఇచ్చింది. పాత సెకండ్-జనరేషన్ మోడల్‌పై రూ. 98,000 వరకు ఆదా చేసుకోవచ్చు. 2 వెర్షన్లలోనూ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 90hp శక్తినిస్తుంది. పాత Amaze ధర రూ. 6.98 లక్షల నుంచి రూ. 7.80 లక్షల వరకు ఉంది. అయితే కొత్త Amaze రూ. 7.41 లక్షల నుండి రూ. 9.99 లక్షల వరకు అందుబాటులో ఉంటుంది. 

Volkswagen Virtus

 ఈ పండుగ సీజన్‌లో కస్టమర్‌లకు Volkswagen Virtus మీద రూ. 1.50 లక్షల వరకు ప్రయోజనం అందిస్తోంది. ఇందులో రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి. 115hp కలిగిన 1.0 లీటర్, 150hp కలిగిన 1.5 లీటర్ ఇంజిన్. 2 ఇంజిన్‌లతో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా ఉంది. 1.0-లీటర్ ఇంజిన్‌లో 6-స్పీడ్ ఆటోమేటిక్, 1.5-లీటర్ ఇంజిన్‌లో 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఛాయిస్ ఇచ్చారు. దీని ధర రూ. 11.16 లక్షల నుంచి రూ. 18.73 లక్షల వరకు ఉంది.

స్కోడా కారు (Skoda Slavia)

Skoda Slavia కారుపై కంపెనీ రూ. 2.25 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఇందులో Virtus లాగానే 1.0 లీటర్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి. కానీ 1.5 లీటర్ ఇంజిన్‌తో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వస్తుంది. స్కోడా స్లేవియా ధర రూ. 9.99 లక్షల నుండి రూ. 17.69 లక్షల మధ్య ఉంది. మెరుగైన బిల్డ్ క్వాలిటీ, అద్భుతమైన డిజైన్ కస్టమర్లకు ఆకర్షిస్తోంది.