Skoda Kylaq on Down Payment and EMI: ఇటీవలే స్కోడా కైలాక్ భారతీయ మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పుడు కైలాక్ బుకింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ కారుకు సంబంధించిన డెలివరీలు 2025 జనవరి 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్ ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి మీరు ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి? ఈఎంఐ ఎలా లెక్కించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
స్కోడా కైలాక్ మినిమం డౌన్ పేమెంట్ ఎంత?
స్కోడా కైలాక్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.89 లక్షలుగా ఉంది. దాని టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 14.4 లక్షలుగా ఉంది. దీని ఆన్ రోడ్ ధర రూ. 8.8 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. మీరు రూ. లక్ష డౌన్ పేమెంట్ చెల్లించి స్కోడా కైలాక్ బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే రూ. 7.79 లక్షల కారు లోన్ తీసుకోవాలి. మీరు 10 శాతం వడ్డీ రేటుతో ఐదు సంవత్సరాల లోన్ పెట్టుకుంటే ప్రతి నెలా రూ. 16,568 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుందన్న మాట.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!
స్కోడా కైలాక్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ ఇంజిన్ ఇలా...
ఈ కారు 446 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది, ఇది ఫ్యామిలీ కారుగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో 8 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. స్కోడా కైలాక్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. కారులోని ఈ ఇంజన్ 115 హెచ్‌పీ పవర్, 178 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
ఈ కారు గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి 10.5 సెకన్లు పడుతుంది. స్కోడా కైలాక్‌తో పోటీపడే అనేక కార్లు ఇండియన్ మార్కెట్లో ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్‌లతో స్కోడా కైలాక్ నేరుగా పోటీ పడనుంది.
Also Read: సింగిల్ ట్యాంక్ ఫుల్‌తో 1000 కిలోమీటర్లు నడిచే టాప్ 5 కార్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?