Skoda Kodiaq RS Road Test: పెర్ఫార్మెన్స్ కార్లంటే ఇష్టపడే వారికి స్కోడా నుంచి మరో ప్రత్యేక SUV అందుబాటులోకి వచ్చింది. "స్కోడా కొడియాక్ ఆర్ఎస్" పేరుకు తగ్గట్టుగానే పవర్, హ్యాండ్లింగ్, లగ్జరీ & ఫ్యామిలీ ప్రాక్టికాలిటీని ఒకే వాహనంలో అందించే ప్రయత్నం చేసింది. సాధారణ కొడియాక్‌తో పోలిస్తే ఈ RS వెర్షన్‌లో ఇంజిన్ నుంచి సస్పెన్షన్ వరకు అనేక మార్పులు చేసింది. దీంతో పెద్ద 7-సీటర్ SUV అయినప్పటికీ స్పోర్ట్స్ కారు తరహా డ్రైవింగ్ అనుభూతిని అందిస్తోందని ఆటో నిపుణులు చెబుతున్నారు.

Continues below advertisement

కొడియాక్ RSలో 2.0 లీటర్ EA888 టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దారు. సాధారణ మోడల్‌లో 204 hp పవర్ ఉండగా, ఆర్ఎస్‌లో అది 265 hpకు పెరిగింది. టార్క్ కూడా 320 Nm నుంచి 400 Nmకు చేరింది. దీంతో లాంచ్ కంట్రోల్ ఉపయోగించినప్పుడు ఈ SUV కేవలం 6.83 సెకన్లలోనే 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. పెద్ద 7-సీటర్ SUVకు ఇది ఆకట్టుకునే పనితీరు అని చెప్పాలి.

ఈ ఇంజిన్‌కు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. గేర్ మార్పులు చాలా వేగంగా జరుగుతాయి. డ్రైవర్ యాక్సిలేటర్ ఇచ్చిన వెంటనే స్పందించే విధంగా ట్యూనింగ్ చేశారు. ప్యాడిల్ షిఫ్టర్లు కూడా అందుబాటులో ఉండటంతో స్పోర్టీ డ్రైవింగ్‌ను మరింత ఆస్వాదించవచ్చు. ఇంజిన్ 6,500 rpm వరకు ఎంతో సాఫీగా పనిచేస్తూ శక్తివంతమైన పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. డ్యూయల్ ఎగ్జాస్ట్ నుంచి వచ్చే స్పోర్టీ ఇంజిన్ సౌండ్ డ్రైవింగ్ అనుభూతిని మరింత ప్రత్యేకంగా మారుస్తుంది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ 2026 - న్యూ డిజైన్, పెద్ద టచ్‌స్క్రీన్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ధర తక్కువ!

హ్యాండ్లింగ్‌, భద్రతపై ప్రత్యేక శ్రద్ధRS వెర్షన్‌లో కేవలం ఇంజిన్ మాత్రమే కాదు, హ్యాండ్లింగ్‌పై కూడా స్కోడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. 20 అంగుళాల అలాయ్ వీల్స్, ప్రోగ్రెసివ్ స్టీరింగ్, DCC అడాప్టివ్ సస్పెన్షన్ వంటి ఫీచర్లను అందించింది. DCCలో మొత్తం 15 స్థాయిల సస్పెన్షన్ సెట్టింగ్స్ ఉండటంతో డ్రైవర్ తనకు నచ్చిన విధంగా కంఫర్ట్ లేదా స్పోర్ట్ మోడ్‌ను ఎంచుకోవచ్చు. వేగంగా మలుపులు తిరిగే సమయంలో కూడా SUV చాలా స్థిరంగా ఉంటుంది. AWD వ్యవస్థ రోడ్డుపై అద్భుతమైన గ్రిప్‌ను అందిస్తూ డ్రైవర్‌కు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.

భద్రత విషయంలో కూడా కొడియాక్ ఆర్ఎస్ అత్యాధునిక ఫీచర్లతో వచ్చింది. ఇందులో ADAS సూట్ అందుబాటులో ఉంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్ వంటి ఆధునిక భద్రత సాంకేతికతలు ఉన్నాయి. అదనంగా 9 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్స్ రాత్రి సమయంలో అద్భుతమైన వెలుతురు అందిస్తాయి.

ఇది కూడా చదవండి: స్పీడ్ మీటర్ 200 కిలోమీటర్లు చూపిస్తున్నా, కారు మాత్రం 120- 140 ఎందుకు వెళ్తుంది ?

ఎక్స్‌టీరియర్‌ & ఇంటీరియర్‌బయటి డిజైన్‌లో RS ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త స్పోర్టీ బంపర్లు, 20 అంగుళాల అలాయ్ వీల్స్, బ్లాక్ ఫినిష్ ఎలిమెంట్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ & ఆర్ఎస్ బ్యాడ్జింగ్ ఈ SUVకు ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తాయి. వెల్వెట్ రెడ్ కలర్‌లో ఈ SUV మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఇంటీరియర్ కూడా లగ్జరీ & స్పోర్టీనెస్ కలయికగా ఉంటుంది. బ్లాక్ థీమ్‌తో పాటు ఎరుపు రంగు స్టిచింగ్, ఆర్ఎస్ ఎంబాసింగ్ ఉన్న స్పోర్ట్ సీట్లు, మెటల్ ఫినిష్ డ్యాష్‌బోర్డ్ ఈ SUVకి ప్రీమియం ఫీలింగ్‌ను ఇస్తాయి. ముందు సీట్లకు వెంటిలేషన్, అడ్జస్టబుల్ థై సపోర్ట్ కూడా ఉన్నాయి. 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్ కోసం ప్రత్యేక రొటరీ కంట్రోలర్లు ఇవ్వడం వినియోగదారులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.

సీటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌రెండో వరుసలో ముగ్గురు పెద్దలు కూడా సౌకర్యంగా కూర్చునేంత స్థలం ఉంది. రిక్లైనింగ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రత్యేక క్లైమేట్ కంట్రోల్ జోన్, ట్యాబ్లెట్ హోల్డర్లు వంటి సౌకర్యాలు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. మూడో వరుస పెద్దలకు కొంత ఇరుకుగా ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. మూడో వరుసను మడిచేస్తే 786 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది.

ధరస్కోడా కొడియాక్ RS పూర్తిగా దిగుమతి చేసుకున్న మోడల్ కావడంతో దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.60 లక్షల నుంచి రూ.65 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది సాధారణ కొడియాక్ ఎల్ అండ్ కే కంటే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అధికంగా ఉండొచ్చు. అయినప్పటికీ భారత్‌కు కేటాయించిన 50 యూనిట్లు ఇప్పటికే పూర్తిగా బుక్ అయిపోయాయని స్కోడా తెలిపింది. పెర్ఫార్మెన్స్, లగ్జరీ & ప్రాక్టికాలిటీని ఒకే SUVలో కోరుకునే వారికి కొడియాక్ ఆర్ఎస్ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.