కొత్త కారు కొనేటప్పుడు చాలామంది దాని ఇంజన్, మైలేజ్, ఫీచర్ల గురించే ఆలోచిస్తారు. కానీ దాదాపు ప్రతి కారులో కనిపించే ఒక విషయం వెనుక ఉన్న అసలు కారణం మాత్రం చాలామందికి తెలియదు. సాధారణ కార్లలో కూడా స్పీడోమీటర్‌పై 180 నుండి 220 కిలోమీటర్ల వరకు స్పీడ్ రాసి ఉంటుంది, కానీ నిజానికి ఆ కారు అంత స్పీడ్‌ను అందుకోలేదు.

Continues below advertisement

దాదాపు అన్ని కార్ల గరిష్ట వేగం (Car Maximum Speed) గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అయితే కంపెనీలు స్పీడోమీటర్‌పై స్పీడ్ అంత ఎక్కువ ఎందుకు చూపిస్తాయి? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? అని ఎప్పుడైనా ఆలోచించారా ? కారు స్పీడ్ మీటర్‌లో 200 కిలోమీటర్లు చూపించినప్పటికీ, కారు మాత్రం 120- 140 కిలోమీటర్ల వేగంతోనే వెళ్తుంది. లేకపోతే 160 వరకు స్పీడ్‌తోనే ఎందుకు వెళ్తుందో వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

ప్రతి కారుకి వేర్వేరు స్పీడోమీటర్ కుదరదుఆటోమొబైల్ కంపెనీలు మార్కెట్లోకి తెచ్చే ప్రతి కారు మోడల్‌కు విడివిడిగా స్పీడోమీటర్లను తయారు చేయవు. అలా చేస్తే కార్ల తయారీ ఖర్చు మరింత పెరిగిపోతుంది. అందుకే కార్ల కంపెనీలు ఒకే రకమైన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లేదా స్పీడోమీటర్ డిజైన్‌ను వేర్వేరు కారు మోడల్స్, వేరియంట్లలో వాడుతుంటాయి. ఈ కారణంగానే తక్కువ పవర్ ఉన్న బేసిక్ కార్లలోనూ,  ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉన్న స్పోర్ట్స్ కార్లలో వాడే స్పీడ్ మీటర్ స్కేలే కనిపిస్తుంది.

Continues below advertisement

గ్లోబల్ మార్కెట్ అవసరాలుచాలా కంపెనీలు తమ కార్లను కేవలం ఒక్క దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు చేస్తుంటాయి. ఉదాహరణకు జర్మనీ లాంటి దేశాల్లో కొన్ని హైవేలపై స్పీడ్ లిమిట్ అంటూ ఉండదు. దాంతో అక్కడ చాలా ఎక్కువ వేగంతో కార్లు డ్రైవ్ చేస్తారు. అందువల్ల ప్రపంచంలోని వివిధ దేశాల మార్కెట్లకు, అక్కడి రూల్స్‌కు సరిపోయేలా కంపెనీలు ఒకే రకమైన స్పీడోమీటర్లను డిజైన్ చేస్తాయి.

ఎక్కువ స్పీడ్ కనిపిస్తే కారు పవర్‌ఫుల్‌కారు స్పీడోమీటర్‌పై పెద్ద నంబర్లు చూపించడం అనేది ఒక రకమైన మార్కెటింగ్ స్ట్రాటజీ మీటర్‌పై 200 లేదా 220 కిలోమీటర్ల స్పీడ్ మీటర్ చూడగానే కస్టమర్లకు ఆ కారు చాలా పవర్‌ఫుల్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ కారు జీవితంలో ఎప్పుడూ అంత స్పీడ్‌తో వెళ్లకపోయినా.. కారు పర్ఫార్మెన్స్ గురించి కస్టమర్లలో ఒక పాజిటివ్ అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి ఈ డిజైన్ హెల్ప్ అవుతుంది.

కావాలనే ఎక్కువ స్పీడ్మీరు కారు నడుపుతున్నప్పుడు స్పీడ్‌ను జీపీఎస్ (GPS) లేదా గూగుల్ మ్యాప్స్ యాప్‌తో పోల్చి చూశారా? రెండింటికీ కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా కారు స్పీడోమీటర్, వెళ్తున్న అసలు వేగం కంటే కొంచెం ఎక్కువ స్పీడ్‌నే చూపిస్తుంది. ఇది కారులో లోపం వల్ల జరగదు, కంపెనీలు కావాలనే అలా డిజైన్ చేస్తాయి. యూరప్‌లో కొన్ని దేశాల్లో ఒక రూల్ ఉంది.. స్పీడోమీటర్ ఎప్పుడూ కూడా కారు వెళ్తున్న నిజమైన వేగం కంటే తక్కువ స్పీడ్‌ చూపించకూడదు. కాస్త ఎక్కువ చూపించినా పర్లేదు కానీ తక్కువ మాత్రం చూపించరాదు. కారు నిజానికి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటే, మీటర్ 103 లేదా 104 చూపించవచ్చు కానీ 100 కంటే తక్కువ చూపించరాదు.

కారు స్పీడోమీటర్‌లో ఇలా ఎందుకు చేస్తారు?డ్రైవర్లు తెలియకుండానే స్పీడ్ లిమిట్‌ను దాటిపోకుండా ఉండాలని ఆటోమేకర్స్ స్పీడోమీటర్‌ను కొంచెం ఎక్కువ స్పీడ్ చూపించేలా క్యాలిబ్రేట్ చేస్తారు. దీనివల్ల ఓవర్ స్పీడింగ్ సమస్య తగ్గుతుంది. ఫలితంగా ట్రాఫిక్ చలాన్లు, ప్రమాదాల నుండి సైతం తప్పించుకోవచ్చు. ఒకవేళ స్పీడోమీటర్ కారు వెళ్తున్న అసలు స్పీడ్ కంటే తక్కువ చూపించి, కారు అంతకంటే వేగంగా వెళ్తుంటే రోడ్ సేఫ్టీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.