Simple Arrive family e-scooter: భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో పోటీ ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. యువత కోసం స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తున్న సింపుల్ ఎనర్జీ, ఇప్పుడు కుటుంబాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త మోడల్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. కంపెనీ తన తొలి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సెప్టెంబర్ 2, 2026న అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది.

Continues below advertisement

ఈ కొత్త స్కూటర్‌కు 'సింపుల్ అరైవ్' (Simple Arrive) అనే పేరును పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో రోడ్లపై టెస్టింగ్ సందర్భంగా ఈ స్కూటర్ కనిపించగా, ఇప్పుడు ఆవిష్కరణ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించడంతో విడుదలకు సమయం దగ్గరపడినట్లు స్పష్టమైంది.

ప్రస్తుతం సింపుల్ ఎనర్జీ విక్రయిస్తున్న సింపుల్ వన్ & సింపుల్ వన్S మోడళ్లు స్పోర్టీ డిజైన్‌తో యువతను ఆకట్టుకుంటున్నాయి. అయితే కొత్త అరైవ్ మాత్రం కుటుంబ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా భిన్నమైన డిజైన్‌తో రూపొందించినట్లు టెస్ట్ మోడల్ చిత్రాలు వెల్లడించాయి. పదునైన ఆకృతులకు బదులుగా గుండ్రని ఆకారంతో, సాంప్రదాయ స్కూటర్ రూపాన్ని ఈ మోడల్‌లో అందించే అవకాశం ఉంది.

Continues below advertisement

ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ డిజైన్‌టెస్టింగ్ సమయంలో కనిపించిన వివరాల ప్రకారం ఈ స్కూటర్‌లో పొడవైన ఫ్లాట్ సింగిల్ పీస్ సీటు ఉండనుంది. కుటుంబ సభ్యులు సౌకర్యంగా ప్రయాణించేందుకు ఈ డిజైన్ ఉపయోగపడుతుంది. వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లు, సెంటర్ స్టాండ్ కూడా ఇందులో ఉండనున్నాయి.

ఇది కూడా చదవండి: 2026 మారుతి బ్రెజ్జా రెడీగా ఉంది - కొత్త టర్బో ఇంజిన్, ADAS, వెంటిలేటెడ్ సీట్లతో అదిరిపోయే ఎంట్రీ!

బ్రేకింగ్ వ్యవస్థలో ముందు భాగంలో డిస్క్ బ్రేక్ & వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌ను అందించనున్నట్లు టెస్ట్ మోడల్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం సింపుల్ వన్ శ్రేణిలో రెండు చక్రాలకూ డిస్క్ బ్రేక్‌లు ఉన్నప్పటికీ, కొత్త అరైవ్‌లో ఖర్చును తగ్గిస్తూ రోజువారీ వినియోగానికి అనువైన సెటప్‌ను కంపెనీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఫీచర్లుఈ స్కూటర్‌లో ముందు భాగంలో చిన్న స్టోరేజ్ కంపార్ట్‌మెంట్, ఆధునిక TFT డిస్‌ప్లే కూడా ఉండనున్నాయి. హెడ్‌లైట్‌ను ఫ్రంట్ ఏప్రాన్‌పై అమర్చడంతో పాటు దాని పైన చిన్న విండ్ డిఫ్లెక్టర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు టెస్ట్ మోడల్ చిత్రాలు సూచిస్తున్నాయి.

ఇక సాంకేతికంగా కూడా ఈ స్కూటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. హెవీ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అవసరం లేకుండా ఎలక్ట్రిక్ మోటార్లను వాణిజ్యపరంగా తయారు చేసిన తొలి భారతీయ OEMగా సింపుల్ ఎనర్జీ ఇటీవల ప్రకటించింది. ఇదే అత్యాధునిక మోటార్ టెక్నాలజీని కొత్త అరైవ్ స్కూటర్‌లో కూడా ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తయారీ వ్యయం తగ్గడంతో పాటు సరఫరా వ్యవస్థపై ఆధారపడటం కూడా తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: బజాజ్ ఫెస్టివ్‌ ప్లాన్‌ - కొత్త పల్సర్ 125, పల్సర్ 150తో పాటు 10 కొత్త టూవీలర్ మోడళ్లు

మార్కెట్లోకి వచ్చిన తర్వాత సింపుల్ అరైవ్ నేరుగా అథర్ రిజ్టా, TVS iQube & బజాజ్ చేతక్ వంటి ప్రముఖ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడనుంది. కుటుంబ వినియోగదారులకు అవసరమైన సౌకర్యాలు, ఆధునిక ఫీచర్లు & కొత్త టెక్నాలజీతో ఈ స్కూటర్‌ను కంపెనీ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం, స్కూటర్‌ ఆవిష్కరణ తేదీని మాత్రమే సింపుల్‌ ఎనర్జీ ప్రకటించింది. బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, మోటార్ పవర్, ధర & పూర్తి ఫీచర్ల వివరాలను ఇంకా వెల్లడించలేదు. సెప్టెంబర్ 2న జరిగే అధికారిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ కీలక వివరాలన్నీ వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతో భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో మరో కొత్త పోటీకి తెరలేవనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.