Rural Indian Auto Market Trends: ఈ పండుగ సీజన్‌లో, భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లో కొత్త ఊపిరి నింపింది రూరల్‌ ఇండియా. మంచి వర్షాలు, పెరిగిన వ్యవసాయ ఆదాయాలు, అలాగే GST రేట్లు తగ్గడం వల్ల చిన్న కార్లు, బైకులు, స్కూటర్లు మళ్లీ గ్రామీణ కొనుగోలుదారుల ఫస్ట్‌ ఆప్షన్‌గా మారాయి.

Continues below advertisement

సెప్టెంబర్‌లో కొత్త రికార్డులుసొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (SIAM) తాజా డేటా ప్రకారం, సెప్టెంబర్‌లో ప్యాసింజర్‌ వెహికల్స్‌ డిస్పాచీలు 4.4% పెరిగి 3,72,458 యూనిట్లకు చేరాయి. టూ వీలర్లు 6.7% పెరిగి 21,60,889 యూనిట్లు, త్రీ వీలర్లు 5.5% పెరిగి 84,077 యూనిట్లు అయ్యాయి.

“ఈసారి పండుగ సీజన్‌ తొందరగా ప్రారంభమైంది (నవరాత్రులు సెప్టెంబర్‌లోనే ప్రారంభం కావడం), అలాగే GST తగ్గింపుతో ప్రతి విభాగంలోనూ వృద్ధి కనపడింది. ఫ్యాక్టరీల నుంచి షోరూమ్‌లకు వెళ్లిన వాహనాల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది" - SIAM అధ్యక్షుడు షైలేష్‌ చంద్ర

Continues below advertisement

అర్బన్‌ మార్కెట్‌ను మించిన రూరల్‌ కొనుగోళ్లుఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (FADA) CEO సహరాష్‌ దమానీ చెప్పిన వివరాల ప్రకారం, ప్యాసింజర్‌ వాహనాల రిటైల్‌ సేల్స్‌లో రూరల్‌ వాటా 38% నుంచి 40%కి పెరిగింది, అర్బన్‌ వాటా మాత్రం 62% నుంచి 60%కి తగ్గింది. అంటే సెప్టెంబర్‌లో కొనుగోలు చేసిన ప్రతి 10 కార్లలో 4 కార్లు గ్రామీణ ప్రాంతాల్లోనే అమ్ముడయ్యాయి.

“రూరల్‌ ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు 11% YoY పెరిగాయి, అర్బన్‌ మార్కెట్‌లో మాత్రం వృద్ధి కేవలం 2.6% మాత్రమే. ఇది తాత్కాలిక పెరుగుదల కాదు, భారత ఆటో మార్కెట్‌లో రూరల్‌ సెక్టార్‌ ప్రధాన శక్తిగా మారుతున్న సంకేతం” - సహరాష్‌ దమానీ

GST తగ్గింపుతో చిన్న కార్లపై ఆసక్తిS&P గ్లోబల్‌లో ఆటో మార్కెట్‌ డైరెక్టర్‌ పుణీత్‌ గుప్తా మాట్లాడుతూ, “రూరల్‌ బయ్యర్స్‌ ప్రైస్‌ సెన్సిటివ్‌గా ఉంటారు. GST తగ్గింపుతో చిన్న కార్ల సెగ్మెంట్‌ మళ్లీ జోరందుకుంది” అన్నారు. సెప్టెంబర్‌లో అర్బన్‌ మార్కెట్‌లో PV (ప్యాసెంజర్‌ వెహికల్‌) సేల్స్‌ -10.17% తగ్గగా, రూరల్‌లో తగ్గుదల కేవలం -2.86% మాత్రమే తగ్గింది.

రెండో త్రైమాసికం అప్‌డేట్స్‌జూలై-సెప్టెంబర్‌ మధ్య కాలంలో టూ వీలర్‌ డిస్పాచీలు 7.4% పెరిగి 5.56 మిలియన్‌ యూనిట్లు, కమర్షియల్‌ వాహనాలు 8.3% పెరిగి 2.4 లక్షలు అయ్యాయి. ప్యాసింజర్‌ వాహనాలు మాత్రం 1.5% తగ్గాయి. SUV సెగ్మెంట్‌ ఇంకా ఆధిపత్యం కొనసాగించినా, సేల్స్‌ కొంత స్థిరంగా ఉన్నాయని SIAM పేర్కొంది.

రూరల్‌ మార్కెట్‌ - న్యూ ఇంజిన్‌ ఆఫ్‌ గ్రోత్‌ఈ సెప్టెంబర్‌లో కనిపించిన ఈ ఉత్సాహం దీర్ఘకాలం కొనసాగుతుందా అన్నది నవంబర్‌–డిసెంబర్‌లో స్పష్టమవుతుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం - భారత ఆటో మార్కెట్‌లో ఇప్పుడు వేగం తెచ్చేది రూరల్‌ ఇండియానే. పెరిగిన ఆదాయాలు, తక్కువ పన్నులు, పెళ్లి సీజన్‌ కలయికతో ఈ సీజన్‌ ఆటో ఇండస్ట్రీకి “కొత్త శకం” మొదలయింది.