Royal Enfield New Bikes: బ్రిటీష్ వాహన కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ఇండియా, ఇంగ్లండ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ తన రెండు కొత్త మోటార్ సైకిళ్లను మార్కెట్లో లాంచ్ చేయనుంది. కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను నవంబర్ 4వ తేదీన విడుదల చేయనుంది. అదే సమయంలో ఈ బ్రాండ్‌కు చెందిన మరో కొత్త మోడల్ కోసం దాదాపు రెండేళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 నవంబర్ 5వ తేదీన మార్కెట్లోకి రానుంది. ఇలా నవంబర్ మొదటి వారంలోనే రెండు శక్తివంతమైన బైక్‌లను రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేయనుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌తో ఈవీ సెగ్మెంట్‌లోకి ప్రవేశించబోతోంది. ఈ బైక్ గురించిన టీజర్‌ను కూడా కంపెనీ ఇటీవలే షేర్ చేసింది. ఈ టీజర్‌ను బట్టి ఈ బైక్ నవంబర్ 4వ తేదీన మార్కెట్లోకి విడుదల కాబోతోందని అనుకోవచ్చు. మిగతా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ స్లిమ్ బాడీతో రావచ్చు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ రేంజ్ 100 నుంచి 160 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. అంటే సింగిల్ ఛార్జింగ్‌తో ఈ బైక్ 100 నుంచి 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ బైక్ ఎలక్ట్రిక్ వెర్షన్ అయినందున ఈ మోటార్‌సైకిల్ ధర మార్కెట్లో లభించే ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్‌ల కంటే ఎక్కువగా ఉండనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌కు మార్కెట్లో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాల్సి ఉంటుంది.
Also Read: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్!
రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650
రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 కూడా ఇంటర్‌సెప్టర్ బైక్‌లాగా 650 సీసీ ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంటుంది. కానీ ఈ బైక్‌లో ఇంటర్‌సెప్టర్ 650 కంటే భిన్నమైన చక్రాలు ఉండవచ్చు. బైక్‌లో 17 అంగుళాల చక్రాలను ఉపయోగించవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ 184 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. అలాగే యూఎస్‌బీ టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ఇందులో చూడవచ్చు.
ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లో 648 సీసీ ఆయిల్, ఎయిర్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంది. ఇది 7,150 ఆర్‌పీఎమ్ వద్ద 47 బీహెచ్‌పీ పవర్, 5,150 ఆర్‌పీఎమ్ వద్ద 56.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ఇంజన్‌తో పాటు 6 స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంటుంది. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంది.
Also Read: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!