Royal Enfield Scram 440 Review India 2025: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మరోసారి బైక్‌ ప్రేమికుల మనసును గెలుచుకునే ప్రయత్నంలో ఉంది. కొత్తగా తీసుకొచ్చిన స్క్రామ్‌ 440 మోటార్‌ సైకిల్‌.. క్లాసిక్‌ లుక్‌, రఫ్‌ యాటిట్యూడ్‌, మోడర్న్‌ ఫీచర్ల మిక్స్‌గా నిలుస్తోంది. స్క్రామ్‌ 411 మోడల్‌కి అప్‌గ్రేడ్‌గా వచ్చిన ఈ బైక్‌లో కంపెనీ 443cc శక్తిమంతమైన ఇంజిన్‌, 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఇచ్చింది. ఈ బైక్‌ లుక్‌, రైడింగ్‌ స్టైల్‌ & పెర్ఫార్మెన్స్‌ విషయంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ట్రెడిషన్‌ కొనసాగిస్తూ, యువతరానికి కూడా కనెక్ట్‌ అయ్యేలా డిజైన్‌ చేశారు.

Continues below advertisement

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్క్రామ్‌ 440 ప్లస్‌ పాయింట్లు

శక్తిమంతమైన ఇంజిన్‌ - సిటీ రైడింగ్‌కి బాగా సరిపోతుందిఈ కొత్త బైక్‌లో 443cc సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ నుంచి 25.4 Hp పవర్‌, 34Nm టార్క్‌ లభిస్తుంది. ముఖ్యంగా 4,000 rpm వద్దే పీక్‌ టార్క్‌ అందుతుంది. అంటే, సిటీ ట్రాఫిక్‌లో గేర్‌ మార్చకుండా స్మూత్‌గా నడపవచ్చు. క్లచ్‌ కొంచెం హెవీగా ఉన్నా, పాత స్క్రామ్‌ 411తో పోలిస్తే గణనీయంగా మెరుగుపరిచారు. స్టార్ట్‌ చేసిన వెంటనే ఇంజిన్‌ రెస్పాన్స్‌ చాలా లీనియర్‌గా ఉంటుంది, ఇది కొత్త రైడర్లకూ కంఫర్ట్‌ ఫీలింగ్‌ ఇస్తుంది.

Continues below advertisement

కంఫర్ట్‌ రైడ్‌, స్పేసియస్‌ డిజైన్‌స్క్రామ్‌ 440ని రోడ్‌ మీద నడిపితే ఒక అడ్వెంచర్‌ ఫీలింగ్‌ వస్తుంది. 41mm టెలిస్కోపిక్‌ ఫోర్క్‌, 190mm సస్పెన్షన్‌ ట్రావెల్‌, వెనుక మోనోషాక్‌కి 180mm ట్రావెల్‌ ఉండడం వలన రఫ్‌ రోడ్లను సులభంగా హ్యాండిల్‌ చేస్తుంది. 795mm సీట్‌ హైట్‌ ఉన్నప్పటికీ సీటింగ్‌ పొజిషన్‌ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. హ్యాండిల్‌ బార్‌ వెడల్పుగా ఉండటం వలన సిటీ రైడ్‌లోనూ, హైవే మీద కూడా రైడర్‌కి పూర్తి కంట్రోల్‌ ఉంటుంది. సీటు ప్యాడింగ్‌ సాఫ్ట్‌గా ఉండటం వల్ల లాంగ్‌రైడ్స్‌లోనూ అలసట తక్కువగా ఉంటుంది.

క్లాసిక్‌ ఫీల్‌ - మోడర్న్‌ టచ్‌తోరాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బ్రాండ్‌ అంటేనే పాతకాలపు రఫ్‌ అటిట్యూడ్‌, థంప్‌ సౌండ్‌ గుర్తొస్తాయి. స్క్రామ్‌ 440 ఆ ఫీలింగ్‌ని కాపాడుకుంటూనే, మోడర్న్‌ టచ్‌ను కలిపింది. LED హెడ్‌ల్యాంప్స్‌, USB చార్జింగ్‌, సెమీ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌, స్విచ్చబుల్‌ ABS వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, ట్రిప్పర్‌ నావిగేషన్‌ ఆప్షన్‌ కూడా ఇవ్వడం టూరింగ్‌ లవర్స్‌కి మరింత బెనిఫిట్‌.

కొన్ని మైనస్‌ పాయింట్లు కూడా ఉన్నాయి

లాంగ్‌ రైడ్స్‌లో వైబ్రేషన్స్‌ఇంజిన్‌ లో-ఎండ్‌ టార్క్‌ బాగానే ఉన్నా, హై రేవ్స్‌ వద్ద వైబ్రేషన్స్‌ వస్తాయి. అంటే, హైవేపై సుదీర్ఘంగా హైస్పీడ్‌లో నడపాలనుకునే వారికి ఇది అంత సూట్‌ అవదు. 

బండి బరువుస్క్రామ్‌ 440 బరువు వెయిట్‌ 196 కిలోలు. ట్రాఫిక్‌లో ఆగినప్పుడు, పార్కింగ్‌లో లేదా సెంటర్‌ స్టాండ్‌ వేసేటప్పుడు బరువు బాగా ఫీలవుతారు. ఇది స్క్రాంబ్లర్‌ తరహా బైక్‌ అయినప్పటికీ, ఆఫ్‌రోడ్‌లో మాత్రం హ్యాండ్లింగ్‌ కొంచెం కష్టమవుతుంది.

మొత్తానికి, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్క్రామ్‌ 440 క్లాసిక్‌ థంప్‌ని మోడర్న్‌ టచ్‌తో కోరుకునే బైక్‌ లవర్స్‌కి సరిగ్గా సరిపోతుంది. హైవే మీద వెళ్లేటప్పుడు స్పీడ్‌ కంటే స్టైల్‌, కంఫర్ట్‌ & రాయల్‌ ఫీలింగ్‌కు మీరు ప్రాధాన్యం ఇస్తే... ఈ బైక్‌ మీకోసమే.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.