Royal Enfield Scram 440 price performance: రాయల్ ఎన్‌ఫీల్డ్, రోడ్డుపై తనకున్న ప్రత్యేక ఇమేజ్‌కి మరో పంచ్ జోడించింది - అదే Scram 440. ఇది Scram 411 కి నెక్ట్స్ లెవెల్‌గా వచ్చింది - శక్తి, వేగం, సౌకర్యం మూడింటినీ మరింత మెరుగుదలను చూపిస్తోంది. కొత్త ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ & రిఫైన్డ్ రోల్-ఆన్ పర్ఫార్మెన్స్‌తో యువ రైడర్ల కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బండిని సీరియస్‌గా తీసుకొచ్చింది.
ఇంజిన్ & పవర్Scram 440 లో ఉన్న 443cc బోర్డ్-అవుట్ ఇంజిన్, పాత Himalayan 411 కంటే 3mm ఎక్కువ బోర్ కలిగి ఉంది. ఇది 6,250 rpm వద్ద 25.4 hp పవర్, 4,000 rpm వద్ద 34 Nm టార్క్ ఇస్తుంది. పాత Scram 411 లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉన్నా, 440 లో 6-స్పీడ్ గేర్‌బాక్స్ చేరడం వల్ల హైవే క్రూజింగ్ అనుభవం సాఫీగా మారింది.
యాక్సిలరేషన్ టెస్ట్ ఫలితాలుటెస్టింగ్ సమయంలో రోడ్లు ఎక్కువగా పొడిగా ఉన్నప్పటికీ, ఇటీవలి వర్షాల నేపథ్యంలో అక్కడక్కడ తేమ ఉన్న ప్యాచెస్ ఎదురయ్యాయి. Scram 411 తో పోలిస్తే... 0 నుంచి గంటకు 80 km వేగాన్ని అందుకునే వరకు పెద్ద తేడా లేకపోయినా, 100 km/h స్పీడ్‌కి 11 సెకన్లలో చేరడం Scram 440 కి గట్టి ప్లస్ పాయింట్. ఇది Scram 411 కంటే దాదాపు ఒక సెకన్ త్వరగా చేరింది. పైగా, గేర్‌బాక్స్ చాలా స్మూత్‌గా పని చేస్తుంది, కానీ క్లచ్ కాస్త హెవీగా అనిపిస్తుంది.
రోల్-ఆన్ టెస్ట్ వివరాలు
ఇంజిన్ రెస్పాన్స్ మెరుగైందని చాలా స్పష్టంగా చెప్పవచ్చు.
2వ గియర్ రన్: 2.56 సెకన్లు
3వ గియర్ రన్: 4.63 సెకన్లు
4వ గియర్ రన్: 4.46 సెకన్లు
పాత Scram 411 తో పోలిస్తే, 50-80 km రేంజ్‌లో సుమారుగా 1.5 సెకన్ల వేగవంతమైన తేడాను Scram 440 టెస్టింగ్ టైమ్‌లో గమనించాం. అంటే, Scram 411 కంటే దాదాపు ఒకన్నర సెకన్ల ముందే Scram 440 ఈ స్పీడ్‌ను అందుకుంటోంది.
బ్రేకింగ్ సామర్థ్యంScram 440 ముందు, వెనుక రెండింటిలోనూ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. డ్యూయల్ చానల్ ABS తో రైడర్‌కు మరింత ఎక్కువ నియంత్రణ లభిస్తుంది. పాత మోడల్ కంటే బ్రేకింగ్‌లో కొంచెం బెటర్‌నెస్ కనిపించింది. ప్రత్యేకంగా హార్డ్ బ్రేకింగ్ సమయంలో ABS చాలా బాగా పని చేసింది. కావాలనుకుంటే, వెనుక ABS ను డిసేబుల్ చేసే ఆప్షన్ కూడా ఉంది, అనుభవం గల రైడర్లకు ఇది అదనపు ఫీచర్.
లుక్ & వేరియంట్లుScram 440 బైక్ మామూలు కంఫర్ట్‌తో కాకుండా అడ్వెంచర్ స్పిరిట్‌తో రూపుదిద్దుకుంది. కలర్స్ ఆధారంగా వేరియంట్ల ధరలు మారతాయి. “Force Blue” కలర్ వేరియంట్‌ది అత్యధిక ధర, “Trail Green” కలర్ బైక్ తక్కువ ధరతో ఉన్నాయి. రెండింట్లోనూ LED హెడ్‌ల్యాంప్స్ & స్విచ్‌ఎబుల్ ABS స్టాండర్డ్‌గా వస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో ధరఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో Scram 440 ఎక్స్-షోరూమ్ ధర రూ. 2,23,131. అన్ని పన్నులు కలుపుకుని, ఇది దాదాపు రూ. 2,92,000 ఆన్-రోడ్ రేటుకు వస్తుంది. నగరం & డీలర్‌షిప్‌ను బట్టి రేటు కాస్త మారవచ్చు.
ఒకే బైక్‌తో అన్ని రకాల ప్రయాణాలు చేయాలనుకునే రైడర్లకు Royal Enfield Scram 440 ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. శక్తిమంతమైన ఇంజిన్, స్మూత్ గేర్‌బాక్స్, కంఫర్ట్ రైడ్ - ఇవన్నీ కలిసి ఈ బండిని “అడ్వెంచర్ రైడింగ్”కి సరైన పార్ట్‌నర్‌గా నిలబెట్టాయి.