Royal Enfield Hunter 350 Price, Mileage And Features In Telugu: డైలీ అప్-డౌన్ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, హంటర్ 350 బైక్ మీకు బెస్ట్‌గా సూట్‌ కావచ్చు. సాధారణంగా, ఖరీదైన బైక్‌లు అమ్మే ఈ బ్రాండ్‌ నుంచి వచ్చిన చౌవకైన & అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ హంటర్ 350. ముఖ్యంగా.. సరదాగా టూర్స్‌ వేసే యువ రైడర్లతో పాటు డైలీ అప్‌&డౌన్‌ చేసే కాలేజీ కుర్రాళ్లు, స్టైల్‌గా కనిపించాలనుకునే ఉద్యోగులు ఈ బండిని ఇష్టంగా కొంటున్నారు. అందరి ఫోకస్‌ను మీ మీదకు మళ్లించే ఈ టూవీలర్‌ను కొనడానికి మీ దగ్గర పూర్తి మొత్తం లేకపోతే, EMI ఆప్షన్‌లోనూ ఈ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. 

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 ధర ఎంత?రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 బేస్ వేరియంట్ ఎక్స్‌-షోరూమ్‌ ధర (Royal Enfield Hunter 350 ex-showroom price) రూ.1.50 లక్షలు. తెలుగు రాష్ట్రాల్లో ఈ బండిని దాదాపు రూ. 1.91 లక్షల ఆన్‌-రోడ్‌ ధరకు (Royal Enfield Hunter 350 on-road price) కొనవచ్చు. ఆన్‌-రోడ్‌ ధరలో ఎక్స్‌-షోరూమ్‌ రేటు, RTO ఛార్జీలు, బండికి బీమా & ఇతర ఖర్చులు వంటివి కలిసి ఉంటాయి. 

మీకు బైక్ ఎంత EMI కి లభిస్తుంది? మీ దగ్గర ఫుల్‌ పేమెంట్‌ లేకపోయినా పర్లేదు, కేవలం 20,000 డౌన్ పేమెంట్ చేస్తే చాలా. మిగిలిన మొత్తానికి, అంటే 1.71 లక్షల రూపాయలకు బ్యాంక్‌ నుంచి రుణం తీసుకోవచ్చు. బ్యాంక్ మీకు 9% వార్షిక వడ్డీ రేటుతో ఈ రుణాన్ని మంజూరు చేసిందనుకుందాం. ఇప్పుడు మీ ఎంత అవుతుందో చూద్దాం... 

** 4 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలా లోన్‌ తీసుకుంటే, మీ నెలవారీ EMI రూ. 4,255 అవుతుంది. 

** 3 సంవత్సరాల కాల పరిమితితో అప్పు తీసుకుంటే, మీరు నెలకు రూ. 5,438 EMI చెల్లించాలి.  

** 2 సంవత్సరాల లోన్ టెన్యూర్‌ పెట్టుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 7,812 EMI బ్యాంక్‌లో జమ చేయాలి.  బ్యాంక్‌ ఇచ్చే లోన్‌ మొత్తం, వసూలు చేసే వడ్డీ రేటు విషయాలు మీ క్రెడిట్ స్కోర్ & బ్యాంక్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కువ డౌన్‌ పేమెంట్‌ చేయగలిగితే, బ్యాంక్‌కు కట్టే వడ్డీ మొత్తం తగ్గుతుంది.

ఇంజిన్ & పనితీరురాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350లో 349cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ & ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 20.4 PS పవర్ & 27 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 5-స్పీడ్ గేర్‌ బాక్స్‌తో పరుగులు తీస్తుంది. ఈ మోడల్ సిటీ ట్రాఫిక్‌లో & హైవే మీద కూడా స్మూత్‌గా, అదే సమయంలో స్ట్రాంగ్‌గా పెర్ఫార్మ్‌ చేయగలదు.

మైలేజ్ & ఇంధన ట్యాంక్రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 మైలేజ్ లీటరుకు 36 కిలోమీటర్లుగా ARAI ధృవీకరించింది. దీనికి 13 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. ఈ లెక్క ప్రకారం, ట్యాంక్‌ను ఫుల్‌ చేస్తే ఈ బైక్ 468 కిలోమీటర్ల దూరం ఆగకుండా ప్రయాణించగలదు. ఒక వ్యక్తి రోజుకు 30 నుంచి 35 కిలోమీటర్ల దూరం బైక్ నడుపుతుంటే, అతను మళ్ళీ 13 నుంచి 15 రోజుల వరకు పెట్రోల్ నింపాల్సిన అవసరం ఉండదు.