రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్‌ను ఈ నెల 5వ తేదీన ప్రదర్శించనుంది. ఏడో తేదీన లాంచ్ చేయనున్నారు. క్లాసిక్ 350, మీటియోర్ 350ల్లో అందించిన ఇంజిన్‌నే హంటర్ 350లో కూడా అందించనున్నారు. దీని డిజైన్‌లో పలు మార్పులు చేశారు. 20.2 హెచ్‌పీ పవర్, 27 ఎన్ఎం టార్క్‌ను ఈ బైక్ అందించనుంది.
అయితే క్లాసిక్ 350, మీటియోర్ 350ల కంటే 15 కేజీలు తక్కువగానే దీని బరువు ఉండనుంది. దీని వీల్ బేస్ 1,370 మిల్లీమీటర్లు కాగా, పొడవు 2,055 మిల్లీమీటర్లుగా ఉంది. కాబట్టి దీని పెర్పార్మెన్స్ కూడా మెరుగ్గా ఉండనుంది.
ఇక రంగుల విషయానికి వస్తే... డ్యూయల్ టోన్, సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. వేరియంట్‌ను బట్టి 8 వరకు కలర్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఇక టియర్ డ్రాప్ ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, తక్కువ సీట్ హైట్ ఉన్న సింగిల్ పీస్ సీట్ కూడా ఈ బైక్‌లో ఉండనుంది.
ఇక ధర విషయానికి వస్తే... మీటియోర్ 350, క్లాసిక్ 350ల కంటే తక్కువ ధరలో విక్రయించేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇందులో కొన్ని ఫీచర్లు తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి దీని ఎక్స్-షోరూం ధర రూ.1.5 లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. ధర తక్కువగానే ఉండనుంది కాబట్టి రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ కోరుకునే మిడిల్ క్లాస్ వినియోగదారులను ఇది ఆకర్షించనుంది. హోండా సీబీ350 ఆర్ఎస్, ఎజ్డీ స్క్రాంబ్లర్ బైకులతో ఇది పోటీ పడనుంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?