Royal Enfield Hunter 350 New Price, Down Payment, Loan EMI: జీఎస్‌టీ తగ్గింపు (New GST 2025) తర్వాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కొనుగోలు గతంలో కంటే చవకగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో, ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 1.38 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఈ దీపావళి కల్లా కొత్త హంటర్ 350 ని తెచ్చి మీ ఇంటి ముందు పార్క్‌ చేయాలని చూస్తుంటే... ఈ బైక్ కొత్త ఆన్-రోడ్ ధర, లోన్‌పై తీసుకోవాలనుకున్నప్పుడు డౌన్ పేమెంట్ & EMI లెక్కల గురించి ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం.

Continues below advertisement

తెలుగు నగరాల్లో, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కొత్త ఆన్‌-రోడ్ ధర సుమారు రూ. 1,71,000. ఈ ధరలో... RTO ఫీజు దాదాపు రూ. 22,200, బీమా దాదాపు రూ. 11,000 & ఇతర ఛార్జీలు కలిసి ఉన్నాయి. ఈ ఆన్-రోడ్ ధర, నగరం & వేరియంట్‌ ఆధారంగా మారవచ్చు.​​​​​​​

లోన్‌పై తీసుకుంటే ఎంత EMI చెల్లించాలి?మీ దగ్గర పూర్తి స్థాయిలో డబ్బు లేకపోయినా సరే, ధగధగలాడే కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్‌ 350 కొనవచ్చు. దీనికి బ్యాంక్‌ లేదా ఫైనాన్స్‌ కంపెనీ నుంచి లోన్‌ తీసుకోవాలి. మొదట, మీరు కనీసం రూ. 10,000 డౌన్ పేమెంట్ చేయాలి. ఆ తర్వాత, మీరు బ్యాంక్‌ లేదా ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రూ. 1.61 లక్షలు లోన్‌ తీసుకోవాలి. మీకు మంచి క్రెడిట్ స్కోరు ఉంటే లోన్‌ మంజూరవుతుంది & తక్కువ వడ్డీతో ఈ రుణం వస్తుంది. ఉదాహరణకు, 9% వార్షిక వడ్డీ రేటుతో మీరు ఈ రుణాన్ని పొందారని భావిద్దాం. ఇప్పుడు మంత్లీ EMI లెక్కలు చూద్దాం.

Continues below advertisement

మీరు నెలకు రూ.  7,899 EMI చెల్లిస్తే, మీ బైక్‌ లోన్‌ మొత్తం 2 సంవత్సరాల్లో ముగుస్తుంది

మీరు నెలకు రూ. 5,668 EMI చెల్లిస్తే, మీ బండి రుణం 3 సంవత్సరాల్లో క్లియర్‌ అవుతుంది

మీరు నెలకు రూ. 4,552 EMI చెల్లిస్తే, మీ రుణ కాల వ్యవధి 4 సంవత్సరాలు అవుతుంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 పవర్‌ట్రెయిన్ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, హంటర్ 350... 349cc J-సిరీస్ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో దడదడలాడే పెర్ఫార్మెన్స్‌ ఇస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ 20.2 bhp & 27 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ & స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో అనుసంధామై స్మూత్‌ రైడింగ్‌ అనుభవం ఇస్తుంది. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కొత్త కలర్ ఎడిషన్ కోసం బుకింగ్స్‌ రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లు, అధికారిక వెబ్‌సైట్ & యాప్‌ ద్వారా ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఇది ఏ బైక్‌లతో పోటీ పడుతుంది?రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కి ప్రత్యర్థి బైక్‌లు - TVS Ronin, Honda H'ness CB350 / CB350 RS  & Jawa  42 & Royal Enfield Bullet 350 వంటి రెట్రో-స్టైల్ బైక్‌లు. అయితే, Jawa  42 కొంచెం ఖరీదైనది.

మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బండిని ఫైనాన్స్‌లో తీసుకోవాలని ఆలోచిస్తుంటే, అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోండి.