Upcoming Royal Enfield Himalayan 750 Powerful Look: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కొత్త జనరేషన్‌కు తగ్గట్టుగా లైనప్‌ను ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటోంది. ఈ ఎపిసోడ్‌లో, ఈ కంపెనీ తదుపరి పెద్ద లాంచ్ హిమాలయన్ 750. సాధారణంగా, ఏ కార్ లేదా బైక్‌ను అయినా లాంచ్‌కు ముందు రోడ్లపై నడిపి పరీక్షిస్తారు & స్థానికి పరిస్థితులకు అనుగుణంగా అవసమైన మార్పులతో లాంచ్ చేస్తారు. అదే తరహాలో, హిమాలయన్ 750 కూడా ఇటీవల భారతదేశ రోడ్లపై పరీక్షిస్తున్నప్పుడు కనిపించింది. ఇది ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్, కొత్త డిజైన్‌తో కనిపించింది & లాంగ్ టూరింగ్ రైడ్స్‌కు మరింత మెరుగ్గా పనికొస్తుంది.
ఇంజిన్ & పనితీరు
హిమాలయన్ 750 కొత్త 750cc ప్యార్లల్-ట్విన్ ఇంజిన్‌తో రాబోతోంది. ఈ ఇంజిన్, ఇప్పటికే ఉన్న 650cc మోటారుకు అప్‌గ్రేడ్ వెర్షన్. ఇది 50 bhp కంటే ఎక్కువ శక్తిని & 60 Nm టార్క్‌ను జనరేట్ చేయగలదని భావిస్తున్నారు. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది, ఎంత వేగంలోనైనా మృదువైన & హైవే-ఫ్రెండ్లీ రైడింగ్‌ను అందిస్తుంది. మానసిక ధైర్యం, చురుకుదనం ఉన్న వ్యక్తులు ఇంత పవర్‌ఫుల్ ఇంజిన్ ఉన్న బండిని బాగా ఎంజాయ్ చేస్తారు.
టూరింగ్-ఫ్రెండ్లీ సెటప్
ఇది పవర్‌ఫుల్ బైక్ మాత్రమే కాదు, దూర ప్రయాణాల కోసం ప్రత్యేకమైన డిజైన్‌తో వస్తోంది. కొత్త ఫ్రేమ్ & సబ్-ఫ్రేమ్‌ను దీనిలో కనిపించాయి. రైడింగ్ సమయంలో USD ఫ్రంట్ ఫోర్కులు & వెనుక మోనోషాక్ సస్పెన్షన్ మద్దతు ఇస్తాయి. ఈ బైక్‌లో 19-అంగుళాల ముందు & 17-అంగుళాల వెనుక అల్లాయ్ వీల్స్ ఉన్నాయి, ఇవి రోడ్-స్పెక్ ట్యూబ్‌లెస్ టైర్లకు సరిపోతాయి. ఈ సెటప్ హైవే రైడింగ్ & టూరింగ్‌లకు సరిగ్గా సరిపోతుంది.
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ
కొత్త హిమాలయన్ 750 మెకానికల్‌గానే కాకుండా సాంకేతికత పరంగా కూడా అప్‌గ్రేడ్ వెర్షన్. దీనికి కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ జత చేశారు, ఇది Google Maps నావిగేషన్ & స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుంది. దీని అర్థం రైడర్లు టూరింగ్ సమయంలో బండి డిస్‌ప్లేలో అవసరమైన అన్ని సమాచారాలను పొందగలరు.
లాంచింగ్ టైమ్‌లైన్
Royal Enfield Himalayan 750 బైక్‌ను మొదటగా మిలాన్ (ఇటలీ)లోని EICMA 2025లో ప్రదర్శించవచ్చు. దీని తర్వాత, దాని అధికారిక లాంచ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటోవర్స్ 2025లో జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
హిమాలయన్ 450 Vs హిమాలయన్ 750 - ఏంటి తేడా?
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ, తన హిమాలయన్ 450 ప్రధానంగా ఆఫ్-రోడింగ్ కోసం రూపొందించినప్పటికీ, హిమాలయన్ 750 ని ప్రత్యేకంగా టూరింగ్ & లాంగ్-డిస్టెన్స్ క్రూజింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి చేసింది. దీని శక్తిమంతమైన ఇంజిన్, సౌకర్యవంతమైన రైడింగ్ సెటప్, హైవే-ఫ్రెండ్లీ ఫీచర్లు దీనిని సుదూర ప్రయాణాలకు సరైన స్టైలిష్ ఆప్షన్‌గా చేస్తాయి.