Royal Enfield Himalayan 450 Launched: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎట్టకేలకు గోవాలో జరిగిన మోటోవర్స్ ఈవెంట్‌లో దేశీయ మార్కెట్‌లో సరికొత్త హిమాలయన్ అంటే హిమాలయన్ 450/452ని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 2.69 లక్షలు కాగా, దీని టాప్ మోడల్‌కు రూ. 2.84 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. అయితే ఈ ధర 2023 డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ధర పెరగనుంది.


రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ఇంజన్
ఇందులో అందించిన ఇంజన్ గురించి చెప్పాలంటే అప్‌డేట్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌లో సరికొత్త 452 సీసీ లిక్విడ్ కూల్డ్ డీఓహెచ్‌సీ సింగిల్ సిలిండర్ ఇంజన్ అందించారు. ఇది 8,000 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 39.5 హెచ్‌పీ శక్తిని, 5,500 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 40 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో పెయిర్ అయింది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ అందించే అత్యుత్తమ ఇంజిన్‌గా నిలిచింది.


సస్పెన్షన్ విషయానికొస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ముందు భాగంలో 43 ఎంఎం యూఎస్‌డీ ఫోర్క్‌లను కలిగి ఉంది. వెనుక వైపున ప్రీ లోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అందించారు. బ్రేకింగ్ గురించి చెప్పాలంటే ముందువైపు 320 ఎంఎం సింగిల్ డిస్క్, వెనుకవైపు 270 ఎంఎం డిస్క్ అందించారు. ఈ అడ్వెంచర్ టూరింగ్ బైక్ బరువు 196 కిలోలుగా ఉంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 17 లీటర్లు.


రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ఫీచర్లు
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌లో ఇంటిగ్రేటెడ్ గూగుల్ మ్యాప్స్, స్విచ్ చేయగల వెనుక ఏబీఎస్, రైడింగ్ మోడ్స్, చుట్టూ ఎల్ఈడీ లైటింగ్, డ్యూయల్ పర్పస్ రియర్ టెయిల్ లైట్లు, 4 అంగుళాల వృత్తాకార టీఎఫ్‌టీ ఇస్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్లు ఉన్నాయి. ఇది టర్న్ ఇండికేటర్‌గా కూడా పనిచేస్తుంది.


దేశీయ మార్కెట్‌లో ఈ బైక్ కేటీయం 390 అడ్వెంచర్‌తో నేరుగా పోటీపడుతుంది. ఇది కాకుండా యెజ్డీ అడ్వెంచర్, బీఎండబ్ల్యూ జీ 310 జీఎస్, కొత్త ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400ఎక్స్ కూడా దీంతో పోటీ పడతాయి.


మరోవైపు నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సక్సెస్ తర్వాత భారతదేశంలో టాటా మోటార్స్ నుంచి అత్యధికంగా అమ్ముడైన రెండో ఎస్‌యూవీగా టాటా పంచ్ నిలిచింది. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఫ్రంట్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లకు పోటీగా, టాటా ఇప్పుడు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పంచ్‌కు సంబంధించి అన్ని వేరియంట్‌ల్లో మార్పులు చేసింది. పంచ్ లో ఎండ్ వేరియంట్‌లను పరిశీలిస్తే ట్రిప్ మీటర్, ఓడోమీటర్, స్పీడ్ టైమ్, వార్నింగ్ లైట్ వంటి సమాచారాన్ని ప్రదర్శించే నాలుగు అంగుళాల డిజిటల్ స్క్రీన్‌తో కనిపిస్తుంది. టాప్ వేరియంట్ అయిన క్రియేటివ్ ఆఫ్ పంచ్ 7.0 అంగుళాల పార్ట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!


Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!