Royal Enfield Guerrilla 450 Specifications: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బ్రాండ్‌ నుంచి వచ్చిన Guerrilla 450 ఇప్పుడు యూత్‌లో మంచి హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. హిమాలయన్‌ 450 మ్యాప్‌ను ఫాలో అవుతూ వచ్చిన ఈ రోడ్‌స్టర్‌ డిజైన్‌, పవర్‌, సౌండ్‌, స్టాన్స్‌ అన్నీ బలమైన ఫస్ట్‌ ఇంప్రెషన్ ఇస్తాయి. అయితే, కొనడానికి ముందు కొన్ని కీలక విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అందుకే ఈ ఆర్టికల్‌లో 6 మస్ట్-నో పాయింట్లను చాలా క్లియర్‌గా, యూత్‌ఫుల్ టోన్‌లో మీ కోసం రాశాం.

Continues below advertisement

1. Guerrilla 450 పవర్‌ ఎలా ఉంది?ఈ బైక్‌లో 452cc, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు, ఇది హిమాలయన్‌ 450లో ఉన్నదే. 40hp పవర్‌, 40Nm టార్క్‌తో ఇది సిటీ & హైవే రెండింటిలోనూ మంచి పంచ్ ఇస్తుంది. గంటకు 0 నుంచి 60 km వేగాన్ని కేవలం 2.96 సెకన్లలో, గంటకు 0 నుంచి 100 km స్పీడ్‌ను కేవలం 6.59 సెకన్లలో అందుకుంటుంది. అంటే, ఈ బైక్‌ రెస్పాన్స్ టాప్ క్లాస్ అని అర్థం. హైదరాబాద్‌ ORR పై లేదా విజయవాడ హైవేపై ఈ పికప్‌ని నిజంగా ఎంజాయ్ చేయొచ్చు.

2. సీట్ హైట్ & వెయిట్‌ - తక్కువ హైట్ ఉన్న వాళ్లకు సూట్ అవుతుందా?Royal Enfield Guerrilla 450 సీట్ హైట్ 780mm మాత్రమే. ఇది తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకూ సూట్ అవుతుంది. 184kg కర్బ్ వెయిట్ ఉన్నా, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగా ఉన్నందువల్ల సిటీ రైడింగ్‌లో హెవీగా అనిపించదు. ట్రాఫిక్‌లోనూ హ్యాండిల్ చేయడానికి కంఫర్ట్‌గా అనిపిస్తుంది.

Continues below advertisement

3. TFT డాష్ ఉందా?ఉంది, కానీ అన్ని వేరియంట్లలో కాదు. టాప్‌ 2 వేరియంట్లు అయిన Dash & Flash లో మాత్రమే ట్రిప్పర్‌ టీఎఫ్‌టీ (Tripper TFT) డాష్ ఉంటుంది. బేస్‌ వేరియంట్‌లో మాత్రం Meteor లేదా Hunterలాగే అనలాగ్ క్లస్టర్ ఇచ్చారు. టెక్-లవర్స్‌కు TFT ఉన్న వేరియంట్స్ బెస్ట్.

4. వీల్స్ ఎలా ఉన్నాయి?Royal Enfield Guerrilla 450లో 17-inch అలాయ్ వీల్స్ ఇచ్చారు.

టైర్ సెటప్:ముందు టైర్‌ - 120 సెక్షన్వెనుక టైర్‌  - 160 సెక్షన్

ఈ సెటప్ స్ట్రీట్ రైడింగ్‌కు, కార్నరింగ్‌కు చాలా బాగా సూట్ అవుతుంది. సిటీ ట్రాఫిక్‌లో కూడా రియర్ (వెనుక) టైర్ మంచి గ్రిప్ ఇస్తుంది.

5. ఏ కలర్లు అందుబాటులో ఉన్నాయి?Royal Enfield Guerrilla 450 మొత్తం 7 కలర్స్‌లో అందుబాటులో ఉంది, అవి:

  • Gold Dip (red+gold)
  • Playa Black
  • Smoke Silver
  • Peix Bronze
  • Shadow Ash (green+black)
  • Yellow Ribbon
  • Bravo Blue

Royal Enfield మరోసారి యువతని మాత్రమే టార్గెట్ చేసినట్లు కచ్చితంగా తెలుస్తోంది. ప్రత్యేకంగా Yellow Ribbon & Bravo Blue యువతను బాగా ఆకట్టుకునే కలర్స్.

6. ధర ఎంత? ఎన్ని వేరియంట్లు?Royal Enfield Guerrilla 450లో 3 వేరియంట్లు ఉన్నాయి:

  • అనలాగ్‌ (Analogue)
  • డాష్‌ (Dash)
  • ఫ్లాష్‌ (Flash)

ధర: ₹2.56 లక్షల నుంచి ₹2.72 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్) ఉంది, ఆంధ్రప్రదేశ్‌  & తెలంగాణ నగరాల్లో ఆన్‌-రోడ్ ధర వేరియంట్‌ ఆధారంగా 3 లక్షల రేంజ్‌కు వెళ్తుంది.

Royal Enfield Guerrilla 450 స్టైల్‌, పవర్‌, అటిట్యూడ్‌.. ఈ మూడింటి కలయిక. సిటీ రైడర్స్‌కూ, హైవే రైడర్స్‌కూ బాగా సరిపోతుంది. TFT డాష్ & కలర్ ఆప్షన్స్ యూత్‌ను టార్గెట్ చేస్తాయి. కొనే ముందు మీకు ఏ వేరియంట్ బెస్ట్ అనేది క్లియర్‌గా నిర్ణయించుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.