భారత్‌లో ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీ Royal Enfield మార్పులకు శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో అడుగు పెట్టబోతోంది. రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ Flying Flea C6ను త్వరలో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్టైలిష్, మోడ్రన్, ఎకో-ఫ్రెండ్లీ బైక్‌ను కోరుకునే వారి కోసం ఈ బుల్లెట్ ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందిస్తున్నారు. దీని డిజైన్ పాత రెట్రో బైక్ లాగా కనిపిస్తుంది. అయితే ఇందులో కొత్త టెక్నాలజీని ఉపయోగించడంతో పాత వాటి కంటే ఇది ప్రత్యేకం కానుంది. మార్కెట్లో ఇదివరకే దీనిగురించి టాక్ నడుస్తోంది.

Continues below advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ ప్రత్యేకత దాని పనితీరు, రేంజ్. నివేదికల ప్రకారం, ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 154 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీంతో పాటు, ఈ బైక్ చాలా వేగంగా ఉంటుంది. కేవలం 3.7 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని తేలికగా అందుకుంటుంది. ముఖ్యంగా సిటీలో జాబ్ చేసేవారు, లేక బిజినెస్ చేసేవారు రోజువారీ వినియోగానికి ఈ బైక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లైయింగ్ ఫ్లీ సీ6 (Royal Enfield Flying Flea C6) బైక్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో చాలా మోడ్రన్  ఫీచర్లు ఇచ్చారు. లేటెస్ట్ టెక్నాలజీతో ఈ బైక్ దూసుకెళ్తుంది. ఇందులో TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, కాల్,  మెసేజ్ అలర్ట్‌లు వంటి ఫీచర్లు ఉంటాయని అంతా భావిస్తున్నారు. వీటితో పాటు కీలెస్‌ స్టార్ట్, కొత్త తరహా స్విచ్‌లు,  అడ్వాన్స్‌డ్ డిజిటల్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. ఈ ఫీచర్లు ఇతర Royal Enfield బైక్‌ల కంటే ఈ వేరియంట్‌ను ప్రత్యేకం చేయనున్నాయి. ఈ ఫ్లైయింగ్ ఫ్లీ సీ6 బైక్ కేవలం ఎలక్ట్రిక్ మాత్రమే కాకుండా, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, యూనిక్ లుక్‌తో లాంచ్ చేయనున్నారు.

Continues below advertisement

బైక్ డిజైన్ ఎలా ఉంది?డిజైన్ విషయానికి వస్తే ఈ బైక్ రెగ్యూలర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు చాలా విభిన్నంగా ఉంటుంది. ఇందులో తేలికపాటి అల్యూమినియం ఫ్రేమ్‌ను వాడారు. దీనివల్ల బైక్ స్ట్రాంగ్‌గా ఉండటంతో పాటు తేలికగానూ ఉంటుంది. దీంతో పాటు ఇందులో ప్రత్యేకమైన బ్యాటరీ కేస్, మోడ్రన్ సస్పెన్షన్ సిస్టమ్ ఇచ్చారు. ఇది రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది. బైక్‌లో 4 రైడింగ్ మోడ్స్‌తో పాటు 1 కస్టమ్ మోడ్ కూడా ఇచ్చారు. ఈ బైకును మీరు వేర్వేరు రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా సెట్ చేసుకోవచ్చు. బైక్ సీటు ఎత్తు 823 మి.మీ, గ్రౌండ్ క్లియరెన్స్ 207 మి.మీగా ఉండనుంది. 

ఫ్లైయింగ్ ఫ్లీ సీ6 బైక్ లాంచ్ ఎప్పుడు ?ఈ ఎలక్ట్రిక్ బైక్ ఏప్రిల్ 10 భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ ధర సుమారు రూ. 2.5 లక్షల నుండి రూ. 4.5 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఈ బైక్ ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టడంతో పాటు ఇతర కంపెనీలకు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది.