Royal Enfield Bullet 650 Launch Date Specifications: మోటార్ సైకిల్ ప్రేమికులందరికీ మంచి వార్త. రాయల్ ఎన్‌ఫీల్డ్, తన లెజెండరీ బుల్లెట్ మోడల్‌ను కొత్త తరహాలో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈ రోజు (మంగళవారం, 4 నవంబర్ 2025) మిలాన్‌లో జరుగుతున్న 'EICMA 2025 షో'లో బుల్లెట్ 650ని గ్లోబల్‌గా ఆవిష్కరించనుంది. ఈ బ్రాండ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసిన టీజర్‌లో, రైడర్ పర్‌స్పెక్టివ్‌లో కనిపించే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు క్లాసిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎగ్జాస్ట్ థంప్ వినిపించింది. “A new chapter in motorcycling’s oldest legacy” అనే ట్యాగ్‌లైన్‌తో, బుల్లెట్ వారసత్వంలో మరో కొత్త అధ్యాయం మొదలవబోతోందని ఇది స్పష్టం చేస్తోంది.
బుల్లెట్ 650 ఇంజిన్ & పెర్ఫార్మెన్స్‌ఈ బుల్లెట్ 650లో కూడా, సుపరిచితమైన 648 cc పారలల్-ట్విన్ ఇంజిన్‌నే కంపెనీ ఉపయోగిస్తోంది. ఇది 47 హార్స్‌పవర్, 52.3 Nm టార్క్ ఇచ్చే పవర్‌ఫుల్ ఇంజిన్. 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్-అసిస్ట్ క్లచ్‌తో వస్తుందని అంచనా. అయితే, బుల్లెట్ స్పూర్తికి తగ్గట్టు కొంచెం రిలాక్స్‌డ్ ట్యూనింగ్ ఉండొచ్చని సమాచారం.
బుల్లెట్ 650 ప్రత్యేకతలుడిజైన్ పరంగా ఈ బైక్ ఒక క్లాసిక్ ఆర్ట్ వర్క్‌లా కనిపిస్తోంది. హెడ్‌ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ హుడ్, ఫ్యూయల్ ట్యాంక్ మీద హ్యాండ్ పెయింటెడ్ పిన్‌స్ట్రైప్స్, మెటల్ ట్యాంక్ బ్యాడ్జెస్ - ఇవన్నీ పాత బుల్లెట్ స్టైల్‌కి సరిగ్గా సరిపోతాయి. ఈసారి డిజైన్‌లో చిట్టచివరి టచ్‌లలో కూడా మోడర్న్ ఫినిషింగ్ ఇచ్చారు.
ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ క్లాసిక్ 650లో వాడిన డిజిటల్-అనలాగ్ యూనిట్‌తో సేమ్‌గా కనిపిస్తోంది. స్పీడోమీటర్ ఆనలాగ్ మోడ్‌లో, ఫ్యూయల్ గేజ్, ఓడామీటర్ చిన్న డిజిటల్ డిస్‌ప్లేలో ఉన్నాయి. అదనంగా.. బ్రేక్, క్లచ్ లీవర్స్ అడ్జస్టబుల్ చేసుకునేందుకు అవకాశం ఉండి, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్‌ను ఐచ్ఛికంగా అందించే అవకాశం ఉంది.
ఇప్పటికే బలమైన లైనప్‌రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పటికే ఇంటర్సెప్టర్ (Interceptor), కాంటినెంటల్ GT (Continental GT), షాట్‌గన్ (Shotgun), క్లాసిక్ 650 (Classic 650) మోడల్స్‌తో 650 సీసీ సెగ్మెంట్‌లో బలమైన స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు బుల్లెట్ 650తో ఆ జాబితా మరింత విస్త్రతమవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత ఉంటుంది?భారతీయ మార్కెట్‌లో ఈ బైక్ ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) సుమారు రూ. 3.30 లక్షల వద్ద ఉండొచ్చని అంచనా. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ఎక్స్-షోరూమ్ రేటు ఉండవచ్చు. హైదరాబాద్, విజయవాడ వంటి తెలుగు నగరాల్లో ఇది 2025 చివరి నాటికి అందుబాటులోకి రావచ్చు.
లెజెండరీ బుల్లెట్ సౌండ్ (థంప్), క్లాసిక్ లుక్, న్యూ జనరేషన్ టచ్ - ఈ మూడింటి మేళవింపుతో వస్తున్న బుల్లెట్ 650, యూత్‌కి “మస్ట్-వాచ్” బైక్‌గా మార్చబోతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలు కానుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.