Royal Enfield Bullet 650 Accessories Price :రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఐకానిక్ బులెట్ బ్రాండ్‌ను ఆధునిక 650సిసి ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో సరికొత్తగా ఆవిష్కరించింది. క్లాసిక్ స్టైలింగ్‌ను ఇష్టపడే వారితోపాటు ఆధునిక ఫఈచర్లను కోరుకునే రైడర్ల కోసం ఈ మోటార్ సైకిల్ ఒక వేదికగా మారింది. అయితే బైక్ కొనడమే కాకుండా దానిని మనకు నచ్చినట్టు మార్చుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. దీనిని దష్టిలో పెట్టుకొని కంపెనీ అధికారికంగా యాక్సెసరీల ధర జాబితాను విడుదల చేసింది.
మీ బుల్లెట్ 650ని రోడ్డుపై అందరికంటే ప్రత్యేకంగా చూపించాలనుకుంటే విజువల్ అప్‌గ్రేడ్ ఎంతగానో యూజ్ అవుతుంది ఇందులో ప్రధానంగా బార్ ఎండ్ ఫినిషర్స్ ధర 1120 రూపాయులుకాగా, బ్లాక్ టేపర్డ్ మిర్రర్స్ 4650గా నిర్ణయించారు. క్లాసిక్ లుక్ కోసం రౌండ్ మిర్రర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధర 4500 రూపాయల వరకు ఉంటుంది.
ఇంజిన్ అందాన్ని పెంచే ఆయిల్ ఫిల్లర్ క్యాప్స్(బ్లాక్, సిల్వర్)1070 రూపాయలకే లభిస్తుంది. ఈ చిన్న మార్పులు బైక్‌కు ప్రీమియం ఫినిషింగ్‌ను ఇస్తాయి.
భద్రత కోసం ప్రొటెక్టివ్ గార్డ్స్
బుల్లెట్ 65 వంటి బరువైన మోటార్ సైకిళ్లకు ఇంజిన్ గార్డ్స్ చాలా కీలకం. రోడ్లపై ప్రయాణించేటప్పుడు చిన్న చిన్న రాళ్లు లేదా ప్రమాదాల నుంచి ఇంజిన్‌ను రక్షించేందుకు వి అవసం. కంపెనీ కాంపాక్ట్ ఇంజిన్ గార్డ్స్‌ను 4400కు, ఎయర్‌ప్లై ఏవో గార్డ్స్‌ను 5450కు విక్రయిస్తోంది. హైవే రైడింగ్ చేసే వారికి ఎయిర్‌ఫ్లై ఏవో మోడల్ మెరుగైన కవరేజీని అందిస్తుంది. వీటితోపాటు 1950 నుంచి 1980 రూపాయల ధరలో ఆయిల్ కూలర్ గార్డ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. బైక్‌ను ఎండ, వాన నుంచి రక్షించుకోవడానికి వాటర్ రెసిస్టెంట్ బైక్ కవర్లు 1130 రూపాయలకే లభిస్తున్నాయి.
పర్యాటక ప్రియులకు ప్రత్యేక కిట్
లాగ్ డ్రైవ్‌కు వెళ్లే అలవాటు ఉంటే టూరింగ్ యాక్సెసరీల ప్రాముఖ్యత తెలిసి ఉంటుంది. వీటి ధర ఒక్కొక్కటి 12700 రూపాయలు కాగా, వీటిని అమర్చడానికి పానియర్ రైల్స్ 3450 రూపాయలు లభిస్తాయి. రాత్రివేళల్లో లేదా పొగమంచులో ప్రయాణించే వారికి ఎల్‌ఈడీ ఫాగ్ లైట్లు 6900 రూపాయలకే అందుబాటులో ఉన్నాయి. లాంగ్ రైడ్స్‌లో కాళ్లకు గ్రిప్ ఇచ్చేలా డీలక్స్ రైడర్ ఫుట్ పెగ్స్ 3200 రూపాయలు విక్రయిస్తున్నారు. పిలియన్ రైడర్ కోసం కూడా డీలక్స్ ఫుట్‌పెగ్స్ 2610 రూపాయల ధరల లభిస్తాయి.
యూజర్ ఇంటెంట్
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 కేవలం ఒక మోటార్ సైకిల్ మాత్రమే కాదు, అది ఒక లెగసీ. వినియోగదారుల అభిప్రాయాల ప్రకారం, ఈ బైక్ శక్తిమంతమైన ఇంజిన్, సౌకర్యవంతమైన రైడింగ్‌ను అందిస్తుంది. అయితే అధికారిక యాక్సెసరీలను వాడటం వల్ల బైక్ వారంటీకి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు సిటీలో తిరిగై వారైనా, లేదా లాంగ్ టూరలకు వెళ్లే వారైనా, ఈ జాబితాలో మీ అవసరానికి తగ్గ యాక్సెసరీ ఉంటుంది.
