Royal Enfield Bullet 350 Price, Down Payment, Loan and EMI Details: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్ సైకిల్‌కు భారతదేశంలో డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా యువతకు ఈ బండి అంటే పిచ్చ క్రేజ్. ఒక్క చూపులోనే ఆకట్టుకునే రెట్రో లుక్ & రోడ్డుపై భూకంపం తెప్పించే పవర్‌ఫుల్ ఇంజిన్ కారణంగా బుల్లెట్ 350 బాగా పాపులర్ అయింది. మీరు నెలకు 30 వేల రూపాయలు సంపాదిస్తుంటే & ఈ బైక్ కొనాలనే కోరిక మీకు ఉంటే... ఆ జీతంతో బుల్లెట్ 350 ని కొనగలరా, లేదా అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం. దీనికోసం, మీరు ఈ మోటార్ సైకిల్ బైక్ ధర, డౌన్ పేమెంట్ & EMI వివరాలు తెలుసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో బుల్లెట్ బైక్ ధరహైదరాబాద్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బెటాలియన్ బ్లాక్ మోడల్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 2,11 లక్షలు. దీనిలో, RTO పన్నులు దాదాపు రూ. 23,000, బీమా దాదాపు రూ. 12,000, ఇతర అవసరమైన ఖర్చులు కలిసి ఉంటాయి. విజయవాడలోనూ బుల్లెట్ బైక్ ఇదే వేరియంట్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 2,11 లక్షలు. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర నగరాల్లో ఈ ధరలో స్వల్ప వ్యత్యాసం ఉండవచ్చు.
మీ క్రెడిట్ స్కోర్ సంతృప్తికరంగా ఉంటే, మీరు బ్యాంకు నుంచి లోన్ తీసుకుని రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కొనవచ్చు. దీనికోసం, ఆన్-రోడ్ ధరలో కనీసం 20% మొత్తాన్ని, అంటే రూ. 21,000 డౌన్‌పేమెంట్ చేయాలి. మిగిలిన రూ. 1.90 లక్షలను బ్యాంక్ మీకు లోన్‌గా ఇస్తుంది, ఈ రుణంపై వడ్డీ వసూలు చేస్తుంది. బ్యాంక్ మీకు 9 శాతం వడ్డీ రేటుతో ఈ లోన్ మంజూరు చేసిందని అనుకుందాం.
లోన్ తీసుకున్నాక ప్రతి నెలా ఎంత EMI కట్టాలి?
ప్రతి నెలా రూ. 5,381 EMI చెల్లిస్తే, మీ బైక్ లోన్ 4 సంవత్సరాల్లో పూర్తిగా తీరిపోతుంది. ఈ 48 నెలల్లో, వడ్డీ రూపంలో మొత్తం రూ. 68,368 బ్యాంక్‌కు మీరు చెల్లించాలి.
నెలకు రూ. 6,700 EMI చొప్పున కడితే, మీ రుణం తీరడానికి 3 సంవత్సరాలు చాలు. ఈ 36 నెలల కాలంలో, బ్యాంక్‌కు వడ్డీ రూపంలో మొత్తం రూ. 51,280 మీరు చెల్లిస్తారు.
నెలనెలా రూ. 9,338 EMI ని ఆటో-డెబిట్ పెట్టుకుంటే, మీ అప్పు 2 సంవత్సరాల్లో క్లియర్ అవుతుంది. ఈ 24 నెలల్లో, బ్యాంకుకు వడ్డీ రూపంలో మొత్తం రూ. 34,192 చెల్లిస్తారు.
మంత్లీ రూ. 17,251 EMI కట్టగలిగితే, మీ బైక్ లోన్‌ను కేవలం 1 సంవత్సరంలో పూర్తిగా తీర్చేయవచ్చు. ఈ 12 నెలల కాలంలో, బ్యాంక్‌కు వడ్డీ రూపంలో మొత్తం రూ. 17,092 మీరు చెల్లిస్తారు.
బ్యాంక్ ఇచ్చే రుణం, వసూలు చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్, బ్యాంక్ విధానంపై ఆధారపడి ఉంటాయి.
మీకు ఇతర రుణ బాధ్యతలు ఏవీ లేకుంటే, ఆర్థిక నిపుణల సలహా ప్రకారం, రూ. 30,000 జీతంతోనూ 4 సంవత్సరాల (48 నెలలు) EMI ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. బైక్ కొనే ముందు మీ ఇతర ఖర్చులను గురించి కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.