Royal Enfield Bear 650 After Sales Experience: కొత్త బైక్ అంటే ఎంతో కిక్‌. ఓ మోటార్‌ సైకిల్‌ లవర్‌, ముచ్చటపడి కొత్త Royal Enfield Bear 650 బుక్ చేశాడు, ఆ హ్యాపీనెస్‌ మరువలేనిది. కానీ ఆ ఆనందం రెండే రోజుల్లో తుడిచిపోయింది. “నాకు ఈ బైక్‌ జ్ఞాపకాలు నచ్చలేదు” అంటాడు బెంగళూరులోని ఓ యువ మోటార్‌ సైకిలిస్ట్‌.

Continues below advertisement

బెంగళూరుకు చెందిన యువకుడు, Royal Enfield Bear 650 తో తన చేదు అనుభవాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అతను చెప్పిన ప్రకారం: అతను ఆరేళ్లు Pulsar180 తో సంతోషంగా నడిపాడు. ఆ తర్వాత, 20216లో, Royal Enfield Bullet Std500 తీసుకున్నాడు. మొదట్లో అది కూడా చాలా పర్ఫెక్ట్‌ బైక్‌. కొన్నాళ్ల తర్వాత ఇంజిను వేడెక్కడం, వైబ్రేషన్స్‌, మెకానికల్ ఇష్యూస్‌ వల్ల ఇబ్బంది పడ్డాడు, ఇక జీవితంలో Royal Enfield బండి కొనకూడదు అనుకున్నాడు. ఈసారి వేరే బ్రాండ్‌నే ఎంచుకోవాలనే ఉద్దేశంతో ట్రయంఫ్‌, హోండా, KTM వంటి ప్రతీ బైక్‌ను పరిశీలించాడు. కానీ, ఖర్మ బూమరాంగ్‌ అయింది. RE Bear 650 డిజైన్‌ చూశాక ఆగలేకపోయాడు. కుటుంబ సభ్యులంతా కూడా ఓకే అనేశారు. దీంతో ఆ యువకుడు బెంగళూరు బిజీ రోడ్లపై రెండు టెస్టు ఫైట్లు చేసి, Petrol Green వేరియంట్‌ను ఫిక్స్ చేసుకున్నాడు.

డెలివెరీ నెక్ట్స్‌ డే కష్టాలు స్టార్ట్‌RE Bear 650 డెలివరీ రోజున చూడాలి హడావిడి... కొత్త బైక్‌ ముందు సెల్ఫీలు, ఫ్యామిలీతో ఫోటోలు, సోషల్ మీడియాలో పోస్ట్‌లు... ప్రతీ యువ బైక్ లవర్‌ ఆనందంగా ఉండే టైమ్‌ అది. ఆ పక్కనే ఉన్న ఫ్యామిలీ కూడా సంతోషంగా చూస్తోంది. కానీ ఆ ఆనందం రాత్రికి రాత్రే ఆవిరవుతుందని ఎవరూ ఊహించలేదు. తర్వాతి రోజు నుంచి మొదలయ్యాయి కష్టాలు. ఫస్ట్.. ఫ్యూయల్‌ పైప్‌లో ఇబ్బంది, బైక్‌ స్టార్ట్ చేయగానే స్క్రీన్‌ బ్లాంక్‌, ఇండికేటర్లు ఆఫ్‌, హెడ్‌లైట్‌ స్విచ్ఛాఫ్. ఒక్కసారే వంతెన పై నుంచి కింద పడినట్టైంది. “డ్రీమ్ బైక్‌కి ఇలా జరుగుతుందని ఎవ్వరైనా ఊహిస్తారా?”.

Continues below advertisement

RE కూడా చేతులెత్తేసిందట!వెంటనే డీలర్‌కు కాల్ చేశాడు సార్. ఇక్కడి నుంచి స్టార్టయింది మెయిన్‌ స్టోరీ. సర్వీస్‌ సెంటర్‌లో గంటల పాటు గడిపాడు, ఇదేం ఖర్మరా బాబూ అంటూ ఫీలయ్యాడు. RE టెక్నిషియన్‌ అన్నీ చూసి ఓకే అన్నాడు. కానీ స్టోరీ మలుపు తిరగలేదు. మళ్లీ అదే స్క్రిప్ట్‌ రిపీట్‌. వెంటవెంటనే సమస్యలు బెల్లం చుట్టూ ఈగల్లా ముసురుతూనే ఉన్నాయి. దగ్గరుండి అన్నింటినీ చెక్ చేయించినా, బైక్ ఒక్కసారి కూడా ప్రాపర్‌గా నడిచిన పాపానపోలేదు. సర్వీస్ సెంటర్‌ మీద నమ్మకం పోయింది. Royal Enfield కస్టమర్ కేర్‌కు ఫోన్‌ చేసి, తన ఫీలింగ్స్‌ను ఫీలవుతూ చెప్పాడు. అన్నీ వెరిఫై చేసుకుని కాల్‌ బ్యాక్‌ చేస్తాం అన్నారు, రెండు రోజుల వరకు నో కాల్ బ్యాక్‌. అసలు తనను సంప్రదించకుండానే, మేం ఫోన్‌ చేశాం మీ ఫోనే బిజీ వచ్చిదని చెప్పారు అంటాడతను. “ఇలా కాదని ఇమెయిల్‌ పంపినా Royal Enfield టీమ్‌ నుంచి నో రిప్లై!” అంటూ ముక్కు చీదాడు.

ప్రతి యువ బైక్‌ లవర్‌కి బైక్‌ అంటే ఒక ఎమోషన్‌ & తన బాడీలో అదొక భాగం. కొత్త బైక్ డెలివరీ తర్వాత ఎదురయ్యే ఇలాంటి ఎమోషనల్ షాక్‌ను తనలాగా ఇంకెవరూ ఫేస్ చేయకూడదంటూ, సోషల్ మీడియాలో అతను పంచుకున్న ఆవేదన ఇప్పుడు వైరల్. “రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై ఇక నమ్మకం మిగల్లేదు” అంటున్నాడు అతను. 

కొత్త Royal Enfield Bear 650 గొప్ప స్టైల్, పవర్ ఇచ్చినా... ఓ బైక్‌ లవర్‌ హృదయాన్ని గెలవడంలో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యింది. “మళ్ళీ మేం ఇద్దరం కలిసే రోజు ఎప్పుడొస్తుందో?” అంటూ తన పోస్ట్‌ చివర్లో బాధను వెళ్లగక్కాడు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - ABP దేశం ఆటో సెక్షన్‌ని ఫాలో అవ్వండి.