Rizta 3.7 Vs Yamaha Indie Twin: రోజూ 50 కి.మీ. వరకు ప్రయాణం చేసే రైడర్లకు, మంచి సౌకర్యం & వేగం అందించే స్కూటర్‌ ఎంత ముఖ్యమో చెప్పక్కర్లేదు. ఇలాంటి సందర్భంలో చాలా మంది రైడర్లు రిజ్టా 3.7 వైపు మొగ్గుతుంటే, యమహా తీసుకొస్తున్న కొత్త ఇండీ ట్విన్ మోడల్‌పై సైతం ఆసక్తి పెరుగుతోంది. మరి… రిజ్టా 3.7 కొనాలా? లేక యమహా కొత్త ఇండీ ట్విన్ కోసం ఎదురు చూడాలా? ఏ స్కూటర్‌ మీరోజువారీ వాడుకకు నిజంగా మంచి ఎంపిక అవుతుంది?.

Continues below advertisement

రోజువారీ 50 కి.మీ. ప్రయాణానికి ఏ స్కూటర్‌ సూట్ అవుతుంది?డైలీ 50 km జర్నీ చేయడం అంటే చిన్న విషయం కాదు. ట్రాఫిక్‌, సిగ్నళ్ల దగ్గ ఆగడం, రోడ్డు పరిస్థితులు.. అన్నీ స్కూటర్‌ నాణ్యతను పరీక్షించే అంశాలే. రిజ్టా 3.7 ఈ విషయంలో ఇప్పటికే నిరూపించుకున్న స్కూటర్‌. ప్రయాణ సౌకర్యం, బలమైన నిర్మాణం, విస్తృతమైన సర్వీస్‌ సెంటర్లు కలిసి ఈ స్కూటర్‌ను మంచి ఆప్షన్‌గా నిలబెట్టాయి.

యమహా ఇండీ ట్విన్ మాత్రం కొత్తగా మార్కెట్లోకి అడుగుపెడుతోంది. నడపడంలో సౌకర్యం, పవర్‌, ప్రయాణ స్థిరత్వం అన్నీ చక్కగా ఉండేలా యమహా రూపొందిస్తుందనే అంచనాలు ఉన్నాయి. కానీ ఇది కొత్త మోడల్ కావడంతో దీని అసలు పనితీరు ఎలా ఉంటుందో మార్కెట్లోకి వచ్చాకే తెలుస్తుంది.

Continues below advertisement

యమహా ఇండీ ట్విన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?ఇంతవరకూ ఉన్న సమాచారం ప్రకారం, యమహా ఇండీ ట్విన్ త్వరలోనే మార్కెట్లోకి వస్తుంది. కానీ ఖచ్చితమైన తేదీ గురించి కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. రైడర్లలో ఆసక్తి పెరిగినప్పటికీ, “నిజంగా ఇది ఎప్పుడు వస్తుంది? ఎలాంటి పవర్‌ ఉంటుంది? ప్రయాణ సౌకర్యం ఎలా ఉంటుంది?” అనే ప్రశ్నలకు సమాధానాలు లాంచ్ అయ్యేదాకా తెలియవు.

EC–06 గురించి ఏమంటున్నారు?యమహా మరో పెద్ద ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా భావిస్తున్న EC–06 కూడా మార్కెట్లోకి రానుంది. ప్రాక్టికల్‌గా, కంఫర్ట్‌ పరంగా కూడా మంచి స్కూటర్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ భారత మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలను అమ్మడానికి, సర్వీస్‌ సెంటర్ల నెట్‌వర్క్‌ చాలా కీలకం. యమహా ఈ నెట్‌వర్క్‌ను ఎలా విస్తరిస్తుందో చూడాలి. రైడర్లకు అందుబాటులో ఉండేలా సర్వీస్‌ లేకపోతే, మంచి స్కూటర్‌ మన దగ్గర ఉన్నా అది పెద్ద ప్రయోజనం ఇవ్వదు.

ఇప్పుడు ఏది కొనాలి?మీరు కొత్త స్కూటర్‌ ఇప్పుడే కొనాలనుకుంటే, నిపుణుల సూచన ఇదే:

ప్రస్తుతం మార్కెట్లో నిరూపించుకున్న, నమ్మదగ్గ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు: 

Ather Rizta 

Bajaj Chetak 

TVS iQube

ఈ మూడు స్కూటర్లు ఇప్పటికే ప్రయాణ సౌకర్యం, సేవల్లో నాణ్యత, నిర్వహణ ఖర్చులు వంటి అన్ని విషయాల్లో రైడర్ల నమ్మకాన్ని గెలుచుకున్నాయి. యమహా ఇండీ ట్విన్, EC–06 మంచి స్కూటర్లు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అవి మార్కెట్లోకి వచ్చాక, మొదటి రైడర్ల అనుభవాలు తెలిసిన తర్వాతే క్లారిటీ వస్తుంది.

కాబట్టి, మీకు వెంటనే స్కూటర్‌ అవసరం ఉంటే రిజ్టా 3.7, చేతక్‌, ఐక్యూబ్‌ తీసుకోవచ్చు. కొంచెం సమయం వెయిట్‌ చేయగలిగితే, యమహా ఇండీ ట్విన్ ఎలా ఉందో చూసి తర్వాత నిర్ణయించుకోండి. 

కొత్తగా మార్కెట్లోకి వచ్చే మోడళ్లపై ఆసక్తి ఉండటం సహజమే. కానీ రోజూ 50 కి.మీ. దూరం ప్రయాణించే రైడర్‌కు “నమ్మకమైన వాహనం” చాలా ముఖ్యం. ఈ దృష్టితో చూస్తే, ప్రస్తుతానికి, రిజ్టా 3.7 మీకు సరైన ఎంపిక.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.