River Indie vs Ather 450X:భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. బ్యాటరీ విషయంలో ఉన్న అపోహలు తొలగిపోతున్న వేళ వినియోగదారులు ఈవీలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కార్లతోపాటు సాధారణ స్కూటర్లు కూడా కొనేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. అందుకే ఫేమస్ కంపెనీలు చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. అలాంటి వాటిలో ప్రస్తుతం ఉన్న టాప్ జాబితాలో రివర్ ఇండీ, ఏథర్‌ 450ఎక్స్‌ ప్రజలను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ రెండు స్కూటర్ల మధ్య ధరతోపాటు ఇతర ఫీచర్ల విషయంలో ఉన్న తేడాలు ఏంటీ, ఎవరు ఏ స్కూటర్ తీసుకోవాలో చూద్దాం. 

ఎలక్ట్రిక్‌ వాహనాలు వినియోగం పెరగడంతో కంపెనీలు, కేవలం మైలేజీకి పరిమితం కాకుండా యూజర్ల అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు. అందుకే కొత్త కొత్త అప్‌డేట్స్‌తో స్కూటర్లను రిలీజ్ చేస్తున్నారు. అలా అప్‌డేట్ అవుతున్న వాటిలో ఏథర్‌ తన 450క్స్ మొదటి స్తానంలో ఉంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మారుస్తూ ఉంది. మరోవైపు రిర్ కంపెనీ తన ఇండీ మోడల్‌ను ఏథర్‌కు పోటీగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 

వాహనం కొనేటప్పుడు వినియోగదారుడు మొదట గమనించేది ధర. అందుకే వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. రివర్ ఇండీ సగటు ఎక్స్‌షోరూమ్‌ ధర 1,45,124 రూపాయులుగా ఉంది. ఇది ప్రస్తుతం ఒకే ఒక వేరియంట్‌లో, ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. ఏథ్‌ 45ఎక్స్‌ ధర వేరియంట్‌ బట్టి మారుతుంది. ఇది సుమారు 1.55 లక్షల నుంచి 1.57 లక్షల వరకు ఉంటోంది. ఏథర్‌ మొత్తం నాలుగు వేరియంట్లలో, ఎనిమిది విభిన్న రంగుల్లో లభిస్తోంది. అంటే ఇక్కడ ధర పరంగా చూస్తే ఏథర్ కంటే రివర్ ఇండీ సుమారు 9వేల వరకు తక్కువ ధరకు లభిస్తుంది. 

పనితీరు, రైడింగ్‌ రేంజ్‌

ఎలక్ట్రిక్ స్కూటర్లలో మైలేజీ అత్యంత కీలకమై అంశం. ధర తర్వాత ఎక్కువ మంది ప్రజలు దీన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో రివర్ ఇండీ గరిష్టంగా 161 కిలోమీటర్ల రేంజ్‌ను క్లెయిమ్‌ చేస్తోంది. ఆన్‌రోడ్‌పై చూస్తే ఇది 135 నుంచి 146 కిలోమీటర్ల వరకు వస్తుందని చెబుతున్నారు. ఏథర్‌ 450ఎక్స్‌ కూడా 161 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని చెబుతున్నారు. కానీ  వాస్తవంగా ఇది 112 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని రివ్యూలు చూస్తే అర్థమవుతుంది. ఈ ఏథర్‌ 450ఎక్స్‌లో 2.9 KWh వెర్షన్‌ మాత్రమే 126 కిలోమీటర్ల రేంజ్‌  అందిస్తోంది. 

రెండు స్కూటర్లు కూడా గరిష్టంగా గంటలకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. అయితే ఏథర్‌ 450ఎక్స్‌ కేవలం 3.3 సెకన్‌లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుటుంది. రివర్‌ ఇండీ ఇదే వేగాన్ని అందుకోవడానికి మూడు నుంచి ఏడు సెకన్లు పడుతుంది. రెండు స్కూటర్లు కూడా 26Nm గరిష్ట టార్క్‌ను అందిస్తాయి. పవర్‌ ప రంగా చూస్తే రివర్ ఇండీ గరిష్ట పవర్‌ 6.7kW అయితే ఏథర్‌ 450 ఎక్స్‌ వాహనం 6.4 kW పవర్‌ ఇస్తోంది. 

బ్యాటరీ- ఛార్జింగ్ టైం

వినియోగదారులు చూసే మరో కీలకమైన అంశం ఛార్జింగ్‌, బ్యాటరీ కెపాసిటీ. ఈ విషయంలోనే చాలా అనుమానాలు ఉన్నాయి. అందుకే వీటిపై కూడా ఈ రెండు సంస్థలు చాలా క్లారిటీ ఇచ్చాయి. రివర్‌ ఇండీ 4kWh లిథియం- అయాన్ బ్యాటరీ ఇస్తుంది. దీన్‌ని పూర్తిగా ఛార్జ్‌ చేయడానికి ఆరు గంటల సమయం పడుతుంది. 80 శాతం ఛార్జ్ అవ్వడానికి 5 గంటలు పడుతుంది. ఏథర్‌ 450 ఎక్స్‌లో 2.9kWh  అండ్‌ 3.7kWh  అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు అందిస్తోంది.  మొదటి రకం బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 4.3 గంటలు, రెండో వెర్షన్ ఛార్జ్ చేయడానికి 5.45 గంటల సమయం పడుతుంది. 

స్టోరేజీ సామర్థ్యం 

రివర్‌ ఇండీలో అండర్‌ సీట్ స్టోరేజ్‌ అకంగా 43 లీటర్లు ఉంది. దీనికి అదనంగా ముందు భాగంలో స్టోరేజీ బాక్స్ కూడా ఉంది. ఏథర్‌ 450ెక్స్‌లో కేవలం 22 లీటర్ల స్టోరేజ్‌ మాత్రమే ఉంది. రివర్ ఇండీ 293 కిలోల బరువును మోయగలదు. ఏథర్‌ కేవలం 175 కిలోలను మాత్రమే తీసుకెళ్లగలదు. రివర్ ఇండీ 14 ఇంచ్‌ల అల్లాయ్‌వీల్స్‌ను ఉపయోగిస్తుండగా, ఏథర్‌ 12 అంగుళాల చక్రాలను కలిగి ఉంది. పెద్ద చక్లా వల్ల ఇండీ గతుకల రోడ్లపై స్థిరంగా ఉంటుంది. 

టెక్నాలజీ ఫీచర్లలో ఎవరు టాప్ 

రివర్ ఇండీలో 6 అంగుళాల ఎస్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఏథర్‌ 450ఎక్స్‌లో ఏడు అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ ఉంది. రెండింటిలో కూడా బ్లూటూత్, జీపీఎస్‌ నావిగేషన్ ఉన్నాయి. ఏథర్‌లో ఓటీఏ అప్‌డేట్‌, కాల్‌, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌ వంటి ఫీచర్లు ఎక్కువగా ఉన్నాయి. రివర్ ఇండీ బ్యాటరీ, మోటరుపై 3ఏళ్ల లేదా, 30వేల కిలోమీటర్ల వారంటీ ఇస్తుంది. ఏథర్‌ 450ఎక్స్‌ కూడా బ్యాటరీపై 3 ఏళ్లు 30వేల కిలోమీటర్ల వారంటీ ఇస్తుంది. కానీ ఏథర్‌ స్టాక్‌ ప్రో ప్యాకేజీతో దీనిని ఐదేళ్లకు లేదా 60 కిలోమీటర్లకు పెంచుకోవచ్చు. 

ఎవరికి ఏ వాహనం సరిపోతుంది?

మీరు కుటుంబ అవసరాలకు అంటే సరకుల రవాణాకు, లేదా ఎక్కువ సామాగ్రిని రవాణా చేయడానికి ప్రాధాన్య ఇస్తామంటే ఇండీ చాలా మంచిది. ఈ విషయంలో ఈ వాహనానికి మంచి రేటింగ్ ఉంది. మీకు స్పీడ్, టెక్నాలజీ, తేలికపాటి వాహనం కావాలంటే మాత్రం ఏథర్‌ మంచి ఆప్షన్ అవుతుంది.