River Indie Electric Scooter Features: బెంగళూరులో స్టార్ట్‌అప్‌గా ప్రారంభమైన River కంపెనీ, తన మొదటి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ River Indie తో మార్కెట్లో మంచి హంగామా సృష్టిస్తోంది. ‘ఫంక్షన్‌ ఓవర్‌ ఫార్మ్‌’ కాన్సెప్ట్‌తో తయారైన ఈ స్కూటర్‌ను కంపెనీ “EVల SUV”గా పిలవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే... ఇందులో ఇచ్చిన స్టోరేజ్, రగ్గ్డ్‌ డిజైన్‌, రోజువారీ ఉపయోగంలో వచ్చే సౌకర్యాలు నిజంగానే SUV స్థాయిలో ఉంటాయి. రివర్ ఇండీ స్కూటర్‌ కొనాలా, వద్దా అని ఆలోచిస్తున్న మీరు, కొనుగోలుకు ముందే తప్పక తెలుసుకోవాల్సిన 7 కీలక విషయాలు ఇవే.

Continues below advertisement

1. రివర్‌ ఇండీ బ్యాటరీ సామర్థ్యం ఎంత?ఇందులో 4kWh బ్యాటరీ ప్యాక్‌ ఇచ్చారు. కంపెనీ చెప్పే IDC రేంజ్‌ కంటే, నిజ జీవితంలోని మిక్స్‌డ్‌ రైడింగ్‌లో సుమారు 90 కి.మీ. రేంజ్ ఇస్తోంది. ట్రాఫిక్‌ రైడింగ్‌, ఓపెన్‌ రోడ్‌ రైడింగ్‌ రెండింటి కలయికలో ఈ రేంజ్‌ చాలా మందికి సరిపోతుంది. రోజూ ఆఫీస్‌ ట్రావెల్‌, షార్ట్‌ రైడ్స్‌ చేసే వారికి ఈ బ్యాటరీ కెపాసిటీ కంఫర్ట్‌ ఇచ్చేలా ఉంటుంది.

2. రివర్‌ ఇండీ శక్తి ఎంత?ఈ స్కూటర్‌ పీక్‌ పవర్‌గా 6.7kW ఔట్‌పుట్‌, 26Nm టార్క్‌ ఇస్తుంది. స్టార్ట్‌ నుంచి పికప్‌ త్వరగా అందడం, తక్కువ సిటీ స్పీడ్‌లలో కూడా శక్తిమంతమైన ఫీలింగ్‌ రావడం ఇండీకి ఉన్న ప్రధాన బలం. రైడింగ్‌లో స్కూటర్‌ హుందాగా, నమ్మకంగా అనిపిస్తుంది.

Continues below advertisement

3. మార్కెట్లో బెస్ట్‌ స్టోరేజ్‌ ఎందుకు అంటారు?ఈ ఇండీని ‘SUV స్కూటర్’ అని పిలిచే ప్రధాన కారణం దీని స్టోరేజ్‌ స్పేస్‌. 

43 లీటర్ల అండర్‌సీట్‌ స్టోరేజ్ – EVల్లో ఏ బండీ అందుకోలేని స్థాయిలో ఇది పెద్ద స్పేస్‌. హెల్మెట్‌, రెయిన్‌కోట్‌, బ్యాగ్‌ వంటివి చాలా సులభంగా సెట్‌ అవుతాయి.

12 లీటర్ల ఫ్రంట్‌ అప్రాన్‌ స్టోరేజ్‌ కూడా ఉంది. లాకబుల్‌ స్పేస్‌ కావడంతో ఫోన్‌, పర్సు, చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు, లాక్‌ చేసుకోవచ్చు.

అంతేకాదు, ఇంకా ఎక్కువ స్టోరేజ్‌ కావాలంటే రివర్‌ నుంచి పన్నియర్లు, టాప్‌బాక్స్ కూడా కొనవచ్చు.

4. రివర్‌ ఇండీ 14-అంగుళాల వీల్స్‌తో వస్తుందా?అవును. ముందు-వెనుకా 14 అంగుళాల వీల్స్ ఉన్నాయి. ఇవి స్కూటర్‌ హ్యాండ్లింగ్‌ని బాగా మెరుగుపరుస్తాయి. గుంతలు, స్పీడ్‌ బ్రేకర్లు, మూలల్లో తిరుగుతూ ఉన్నప్పుడు స్కూటర్‌ స్టేబుల్‌గా ఉంటుంది.

5. రివర్‌‌కు ఎన్ని టచ్‌ పాయింట్లు ఉన్నాయి?దేశవ్యాప్తంగా రివర్‌ ప్రస్తుతం 37 ఆపరేషనల్‌ స్టోర్లు నడుపుతోంది. ఇండీ మీ ప్రాంతంలో డెలివరీ అందుబాటులో ఉందా, లేదా అన్నది మీ నగరంపై ఆధారపడి ఉంటుంది. ప్రధాన మెట్రో నగరాల్లో అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువ.

6. రివర్‌ ఇండీ ఏయే రంగుల్లో దొరుకుతుంది?ఇండీ మొత్తం 5 రంగుల్లో వస్తుంది - ఎరుపు, పసుపు, నీలం, గ్రే, తెలుపు. ఇవన్నీ బ్లాక్‌ ఫ్రంట్‌ ఎండ్‌తో వచ్చి స్కూటర్‌కు షార్ప్‌ స్టైల్‌ను ఇస్తాయి.

7. రివర్‌ ఇండీ ధర ఎంత?రివర్‌ ఇండీ ధర ₹1.46 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌, బెంగళూరు). ఫీచర్లు, స్టోరేజ్‌, పవర్‌, రగ్డ్‌ డిజైన్‌ దృష్టిలో పెడితే ఈ రేటును అందుబాటు ధరగానే భావించాలి.

రైడింగ్‌లో ప్రాక్టికాలిటీని ప్రాధాన్యం ఇచ్చే వారు, పెద్ద స్టోరేజ్‌ కావాలనుకునేవారు, రోజువారీ ప్రయాణాలకు సులభమైన ఈ-స్కూటర్‌ కోరుకునేవారు - అందరికీ రివర్‌ ఇండీ మంచి ఆప్షన్‌. సిటీ రైడింగ్‌లో మినీ-SUV లాంటి ఫీల్‌ ఇస్తూ, ఇంటి నుంచి ఆఫీస్‌ వరకు సులభమైన ప్రయాణం కోరుకునే వారికి ఇది బెస్ట్‌ ఛాయిస్‌ అవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.