Renault Triber Facelift EMI And Down payment: ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న 7-సీటర్ కంపాక్ట్ ఎంపీవీ సెగ్మెంట్‌లో రీనో ట్రైబర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు తాజాగా ఫేస్‌లిఫ్ట్ రావడంతో అది మరింత బలపడింది. కొత్త రూపుతో లేటెస్ట్ టెక్నాలజీ సహా దాదాపు 21 సురక్షిత ఫీచర్లను ఈ మోడల్‌లో అప్‌డేట్ చేసింది. ఇంత మోడ్రన్‌గా తీర్చిదిద్దిన ఫేస్‌లిఫ్ట్ హైదరాబాద్‌లో ధర, ఈఎంఐ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
కొత్త 2D రీనో డైమండ్ లోగోతో బోల్డ్ గ్రిల్, స్లీమర్ హెడ్‌లాంప్స్ కలిగి ఉంది రీనో ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్. 21 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కలిగి ఉంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, TPMS, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు ఉన్నాయి. 1.0L NA పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ MT/AMT ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. ఇది నాలుగు వేరియంట్లో లభిస్తోంది. అథంటిక్ ధర ఆరున్నర లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎవల్యూషన్ వేరియెంట్ ధ ఏడున్నర లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టెక్నో మోడల్ ఎనిమిది లక్షల నుంచి, ఎమోషన్ తొమ్మిదన్నర లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎక్స్‌షోరూమ్‌ధరలే.
ఈ కారును ఒకేసారి నగదు చెల్లించి తీసుకోవచ్చు. లేదా బ్యాంకు లోన్ తీసుకొని ఈఎంఐ ద్వారా అయినా చెల్లించే వచ్చు. హైదరాబాద్‌లో ఈ కారు ఆన్‌రోడ్ ప్రైస్ ఎంత ఉంటుంది. డౌన్‌పేమెంట్ ఎంత చెల్లించాలి, ఈఎంఐ ఎంత చెల్లించాలో చూద్దాం.
అథంటిక్ వేరియెంట్
రినోకు చెందిన బేసిక్ మోడల్ అయిన అథంటిక్ హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర 7.48 లక్షల రూపాయలు. మీరు ఈ కారు కొనాలి అనుకుంటే 50వేలు ఉంటే డౌన్‌పేమెంట్ చెల్లించి కారు కొనుక్కోవచ్చు. మిగతా డబ్బులను లోన్ ద్వారా తీసుకోవచ్చు. అంటే 6,98,172ను పది శాతం వడ్డీతో నాలుగేళ్లకు లోన్ తీసుకుంటే నెలకు 17,707 చెల్లించాలి. అదే మూడేళ్లకు అయితే 22,528 కిస్తీ కట్టాలి.రెండేళ్లకు తీసుకుంటే నెలకు 32,217 కట్టాలి.
ఎవల్యూషన్ వేరియెంట్
రినోకు చెందిన ఎవల్యూషన్ వేరియెంట్ హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర 8.60 లక్షలకు వస్తుంది. మీరు ఈ కారు కొనాలి అనుకుంటే లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించాలి. మిగతా డబ్బులను లోన్ ద్వారా తీసుకోవచ్చు. అంటే 7,73,802ను పది శాతం వడ్డీతో నాలుగేళ్లకు లోన్ తీసుకుంటే నెలకు 19,271 చెల్లించాలి. అదే మూడేళ్లకు అయితే 24,517 కిస్తీ కట్టాలి.రెండేళ్లకు తీసుకుంటే నెలకు 35,061 కట్టాలి.
టెక్నో వేరియెంట్
రినోకు చెందిన టెక్నో వేరియెంట్ హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర 9.48లక్షలకు వస్తుంది. మీరు ఈ కారు కొనాలి అనుకుంటే లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించాలి. మిగతా డబ్బులను లోన్ ద్వారా తీసుకోవచ్చు. అంటే 8,47,931ను పది శాతం వడ్డీతో నాలుగేళ్లకు లోన్ తీసుకుంటే నెలకు 21,506 చెల్లించాలి. అదే మూడేళ్లకు అయితే 27,360 కిస్తీ కట్టాలి.రెండేళ్లకు తీసుకుంటే నెలకు 39,128 కట్టాలి.
ఎమోషన్ వేరియెంట్
రినోకు చెందిన ఎమోషన్ వేరియెంట్ హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర 10.24 లక్షలకు వస్తుంది. మీరు ఈ కారు కొనాలి అనుకుంటే లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించాలి. మిగతా డబ్బులను లోన్ ద్వారా తీసుకోవచ్చు. అంటే 9,24,310ను పది శాతం వడ్డీతో నాలుగేళ్లకు లోన్ తీసుకుంటే నెలకు 23,354 చెల్లించాలి. అదే మూడేళ్లకు అయితే 29,738 కిస్తీ కట్టాలి.రెండేళ్లకు తీసుకుంటే నెలకు 42,567 కట్టాలి.