Best Affordable Premium Look 7 Seater Car: మనం 7 సీటర్ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేసినప్పుడల్లా, ఈ కారు ఖరీదు ఎక్కువ ఉంటుందనే ప్రశ్న మనలో మెదులుతుంది. కానీ భారతీయ మార్కెట్లో కొన్ని 7 సీటర్ కార్లు ఉన్నాయి. ఇవి ప్రీమియం లుక్‌తో, తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఉత్తమ 7 సీటర్ కార్లలో ఒకటి రెనో ట్రైబర్. ఇది లుక్స్, ఫీచర్లలో చాలా ప్రీమియం రేంజ్‌లో ఉంటుంది.
రెనో ట్రైబర్ కారు భద్రత పరంగా కూడా చాలా మంచిదని భావిస్తారు. మరో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఏడుగురు ప్రయాణికులు కూర్చున్న తర్వాత కూడా చిన్న పిల్లలను కూడా కూర్చోబెట్టడానికి కారులో తగినంత స్థలం ఉంటుంది.
రెనో ట్రైబర్ 7 సీటర్ ధర ఎంత?
రెనో ట్రైబర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.99 లక్షలుగా ఉంది. ఇది భారత మార్కెట్లో మారుతి ఎర్టిగా, కియా కేరెన్స్‌లకు పోటీగా ఉంది. రెనో ట్రైబర్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. దీని పవర్ అవుట్‌పుట్ 72 బీహెచ్‌పీ కాగా, 96 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
రెనో ట్రైబర్ కారు యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. దీంతోపాటు మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్, పుష్ బటన్ స్టార్ట్/అప్, ఎల్ఈడీ డీఆర్ఎల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మొదలైన అనేక గొప్ప ఫీచర్లతో వస్తుంది.
రెనో ట్రైబర్ వీల్ బేస్ 2,636 మిల్లీమీటర్లు కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 182 మిల్లీమీటర్లుగా ఉంది. ప్రజలకు ఎక్కువ స్థలం లభించే విధంగా దీన్ని రూపొందించారు. రెనో ట్రైబర్ సీటును 100 కంటే ఎక్కువ మార్గాల్లో సర్దుబాటు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. మీరు ఈ కారును లిమిటెడ్ ఎడిషన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు 14 అంగుళాల ఫ్లెక్స్ వీల్స్, పియానో బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన డ్యూయల్ టోన్ డాష్‌బోర్డ్‌ను కూడా పొందుతుంది.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?