2025 Renault Triber Facelift Triber Vs Maruti Ertiga Features: మీ కుటుంబానికి బడ్జెట్-ఫ్రెండ్లీ & పర్ఫెక్ట్ 7-సీటర్ MPV ని గిఫ్ట్‌గా ఇవ్వాలని చూస్తున్నట్లయితే, 2025 రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌ గురించి మీరు తెలుసుకోవాలి. కేవలం రూ. 6.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే వచ్చే ఈ MPV, ఖరీదైన మారుతి ఎర్టిగాలో కూడా అందుబాటులో లేని అనేక ఫీచర్లను అందిస్తోంది. ఎర్టిగాతో పోలిస్తే, ట్రైబర్‌లో డబ్బుకు తగిన విలువను అందించే 7 స్మార్ట్ ఫీచర్లు ఇవీ:

1. LED ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్స్‌కొత్త రెనాల్ట్‌ ట్రైబర్ ఇప్పుడు LED ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్‌లతో లాంచ్‌ అయింది, ఇవి రాత్రి పూట మెరుగైన లైటింగ్ & విజన్‌ను అందిస్తాయి. అదే సమయంలో, మారుతి ఎర్టిగాలో ఇప్పటికీ హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్‌లను ఉపయోగిస్తున్నారు.

2. 8-అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్రెనాల్ట్ ట్రైబర్‌లో 8-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌ స్క్రీన్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. అయితే, మారుతి ఎర్టిగాలో 7-అంగుళాల స్క్రీన్‌ మాత్రమే ఉంది & అది కూడా వైర్డు కనెక్షన్‌పై ఆధారపడి ఉంటుంది.

3. 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేరెనాల్ట్ ట్రైబర్, 7-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లేతో వచ్చింది, ఇది ఫుల్లీ డిజిటల్. ఈ డిస్‌ప్లే పూర్తి ఆధునికంగా కనిపిస్తుంది & పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. మరోవైపు, మారుతి ఎర్టిగా ఇప్పటికీ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌పై ఆధారపడుతోంది.

4. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్రెనాల్ట్ ట్రైబర్ టాప్ వేరియంట్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది, ఇది ఫోన్‌ను ఛార్జ్ చేయడాన్ని మరింత సులభంగా మారుస్తుంది. ఈ ఫీచర్‌ను ఇప్పటివరకు మారుతి ఎర్టిగాలో యాడ్‌ చేయలేదు.

5. రెయిన్ సెన్సింగ్ వైపర్లురెనాల్ట్ ట్రైబర్, ఇప్పుడు, వర్షం పడే సమయంలో ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయ్యే రెయిన్ సెన్సింగ్ వైపర్‌లతో వచ్చింది. మారుతి ఎర్టిగా ఇప్పటికీ మాన్యువల్ వైపర్‌లను కలిగి ఉంది.

6. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్రెండు కార్లకు రియర్‌ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ట్రైబర్‌లో, కొత్తగా, ఫ్రంట్‌ పార్కింగ్ సెన్సార్లను కూడా ఇచ్చారు. ఇది, ఇరుకైన ప్రదేశాలలో కారును పార్కింగ్ చేయడం & హ్యాండిల్‌ చేయడం వంటి పనులను సులభం చేస్తుంది.

7. 3వ వరుస సీట్లు పూర్తిగా తొలగించే వెసులుబాటురెనాల్ట్ ట్రైబర్ అతి పెద్ద ఫీచర్‌, పూర్తిగా తొలగించగల మూడో వరుస సీట్లు. మూడో వరుసను తీసేసి, ఈ కారును 5-సీటర్‌ లేదా 6-సీటర్‌గా మార్చవచ్చు & 625 లీటర్ల బూట్ స్పేస్‌ అందుబాటులోకి వస్తుంది. ఎర్టిగాలో సీట్లను మడత పెట్టే అవకాశం మాత్రమే ఉంది, పూర్తిగా తొలగించలేము.

ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ రాష్ట్రాల్లో, మారుతి ఎర్టిగా ధర (ఎక్స్-షోరూమ్) రూ. 9.12 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. రెనాల్ట్‌ ట్రైబర్‌ ధర (ఎక్స్-షోరూమ్) కేవలం రూ. 6.29 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.