Renault Discounts in November 2026: దీపావళి సందర్భంగా, రెనాల్ట్‌ కార్ల కంపెనీ ఇండియాలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు నవంబర్ 2026కు మాత్రమే పరిమితం. Duster, Kiger, Triber & Kwid మోడళ్లపై నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర ప్రయోజనాలను ఈ కంపెనీ అందిస్తోంది. Renault Dusterపై అత్యధికంగా రూ.2.10 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. Kigerపై రూ.65,000, Triberపై రూ.55,000, Kwidపై రూ.40,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

Continues below advertisement

Renault Dusterపై రూ.2.10 లక్షల వరకు బెనిఫిట్స్

Renault ఇండియా లైనప్‌లో Dusterపై అత్యధిక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టాప్ స్పెక్ Techno+ & Iconic వేరియంట్లను కొనేవాళ్లకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. రూ.50,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లేదా 4.99 శాతం తక్కువ వడ్డీ రేటుతో EMI పథకాన్ని ఎంచుకోవచ్చు.

Continues below advertisement

ఈ రెండు వేరియంట్లపై రూ.1.50 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. తక్కువ స్పెక్ వేరియంట్లను కొనుగోలు చేసేవారికి రూ.1 లక్ష వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనం అందిస్తున్నారు.

పాత కారును ఎక్స్ఛేంజ్ చేయడానికి బదులుగా స్క్రాప్ చేయాలనుకునేవారికి రూ.25,000 వరకు స్క్రాపేజ్ బోనస్ లభిస్తుంది. అయితే ఈ బోనస్‌ను ఎక్స్ఛేంజ్ బెనిఫిట్‌తో కలిపి పొందలేరు. అదనంగా రూ.10,000 వరకు లాయల్టీ బోనస్ కూడా అందుబాటులో ఉంది.

Renault Duster ధర రూ.10.49 లక్షల నుంచి రూ.19.49 లక్షల వరకు ఉంది.

ఇది కూడా చదవండి: మారుతి కార్లపై నవంబర్ ఆఫర్లు.. Wagon R, Alto K10 సహా చాలా మోడళ్లపై రూ.1.51 లక్షల వరకు డిస్కౌంట్లు!

Renault Kigerపై రూ.65,000 వరకు ఆఫర్లు

Renault Kigerపై ఈ నెలలో మొత్తం రూ.65,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. Evolution+, Techno & Emotion వేరియంట్లపై రూ.25,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నారు. అలాగే ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్ రూపంలో మరో రూ.25,000 వరకు పొందవచ్చు.

అవసరమైన పత్రాలు సమర్పించే అర్హులైన కస్టమర్లకు రూ.10,000 వరకు లాయల్టీ బోనస్ కూడా అందుబాటులో ఉంది. దీనికి అదనంగా రూ.5,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్ లేదా రూ.4,000 వరకు రూరల్ బెనిఫిట్‌ను పొందవచ్చు.

Kiger ధర రూ.5.81 లక్షల నుంచి రూ.10.40 లక్షల వరకు ఉంది.

Renault Triberపై రూ.55,000 వరకు తగ్గింపు

Renault Triber MPVపై నవంబర్‌లో రూ.55,000 వరకు బెనిఫిట్స్ అందిస్తున్నారు. ఇందులో రూ.25,000 వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. దీనికి అదనంగా రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్‌లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు.

Triberపై లాయల్టీ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే దీనిపై గరిష్ఠంగా ఎంత మొత్తం లభిస్తుందో Renault ఇంకా వెల్లడించలేదు. అర్హులైన కస్టమర్లకు రూ.5,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్ లేదా రూ.4,000 వరకు రూరల్ బెనిఫిట్ కూడా లభిస్తుంది.

Renault Triber ధర రూ.5.81 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉంది.

ఇది కూడా చదవండి: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?

Renault Kwidపై రూ.40,000 వరకు బెనిఫిట్స్

Renault Kwid హ్యాచ్‌బ్యాక్‌పై రూ.15,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీనికి అదనంగా రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లో ఒకదానిని ఎంచుకోవచ్చు.

ఈ రెండు ప్రయోజనాలు మినహా Kwidపై ఇతర అదనపు ఆఫర్లు లేవు. Renault Kwid ధర రూ.4.53 లక్షల నుంచి రూ.5.61 లక్షల వరకు ఉంది.

రెనాల్ట్‌ ప్రకటించిన ఆఫర్లు నవంబర్ 30, 2026 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. నగరం, డీలర్‌షిప్ & స్టాక్ లభ్యతను బట్టి ప్రయోజనాలు మారవచ్చు. కాబట్టి కొనుగోలు చేసే ముందు సమీప Renault డీలర్‌షిప్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి.

గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.