Renault Kwid EMI For Rs 30000 Salary: చౌకైన & ఎక్కువ మైలేజీని ఇచ్చే కార్లకు భారత మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. చాలా మంది, బడ్జెట్ లేకపోవడం వల్ల కారు కలను నిజం చేసుకోలేకపోతున్నారు. కానీ, రూ. 30,000 జీతం ఉన్న వాళ్లు కూడా సులభంగా కొనుగోలు చేయగల కారు ఒకటి ఉందని మీకు తెలుసా?. ఆ కారు కోసం కేవలం రూ. లక్ష డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన డబ్బు కార్ లోన్ (Car Loan For Renault Kwid) గా బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు. EMI కూడా సులభంగా చెల్లించవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధరరూ. 30,000 జీతం ఉన్న వాళ్లు కూడా సులభంగా కొనుగోలు చేయగల కారు - "రెనాల్ట్ క్విడ్" (Renault Kwid). తెలుగు రాష్ట్రాల్లో దీని బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షలు. హైదరాబాద్‌లో, రిజిస్ట్రేషన్ (RTO) కోసం దాదాపు రూ. 65,000 వేలు, ఇన్సూరెన్స్ కోసం దాదాపు రూ. 26,000, ఇతర అవసరమైన ఖర్చులు చెల్లించిన తర్వాత, ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 5.61 లక్షలు అవుతుంది. విజయవాడలోనూ స్వల్ప తేడాతో దాదాపు ఇదే ఆన్-రోడ్ ప్రైస్ ఉంది.
మీరు, రెనాల్ట్ క్విడ్ కారును కొనడానికి రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చెల్లించిన తర్వాత, మీకు బ్యాంకు నుంచి రూ. 4.61 లక్షల రుణం లభిస్తుంది. బ్యాంక్ మీకు 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో కార్ లోన్ మంజూరు చేసిందని అనుకుందాం. ఇప్పుడు, నెలవారీ EMI ప్లాన్ ఇదీ...
7 సంవత్సరాల కోసం రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 7,402 EMI చెల్లించాలి. ఈ విధంగా, 84 వాయిదాలలో రూ. 1,61,652 వడ్డీ చెల్లించాలి.
6 సంవత్సరాల లోన్ టెన్యూర్ ఎంచుకుంటే, మీరు నెలకు రూ. 8,293 EMI చెల్లించాలి. మొత్తం 72 వాయిదాలలో రూ. 1,36,980 లక్షల వడ్డీ చెల్లించాలి.
5 సంవత్సరాల కాల పరిమితి పెట్టుకుంటే, నెలనెలా రూ. 9,551 EMI చెల్లించాలి. మొత్తం 60 వాయిదాలలో రూ. 1,12,944 లక్షల వడ్డీ చెల్లించాలి.
4 సంవత్సరాల్లో లోన్ పూర్తి చేయాలనుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 11,450 EMI చెల్లించాలి. ఈ విధంగా, 48 వాయిదాలలో రూ. 1.25 లక్షల వడ్డీ చెల్లించాలి.
రూ. 30,000 వేల జీతం ఉన్న వ్యక్తి, ఇతర రుణ చెల్లింపులు ఏమీ లేకపోతే, 6 లేదా 7 సంవత్సరాల EMI ఆప్షన్ ఎంచుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
రెనాల్ట్ క్విడ్ స్పెసిఫికేషన్లురెనాల్ట్ క్విడ్ 1.0 RXE వేరియంట్‌లో కంపెనీ 999cc ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజిన్ గరిష్టంగా 67 bhp పవర్‌ను & 9 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఎంపిక ఉంది. కంపెనీ ప్రకారం, ఈ కారు లీటరుకు దాదాపు 21 km మైలేజీని ఇస్తుంది. దీనికి 28 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది.
ఫీచర్ల విషయానికొస్తే, కంపెనీ రెనాల్ట్ క్విడ్‌లో పవర్ స్టీరింగ్, లేన్ చేంజ్ ఇండికేటర్, టాకోమీటర్, రియర్ స్పాయిలర్, LED DRL, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, చైల్డ్ సేఫ్టీ లాక్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి చాలా ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో, ఈ కారు మారుతి సుజుకి ఆల్టో K10 (Maruti Suzuki Alto K10) కు ప్రత్యక్ష పోటీని ఇస్తుంది.