రెనాల్ట్ కంపెనీ ఫేమస్ SUV డస్టర్ 2012లో తొలిసారిగా భారతదేశంలో ప్రారంభించారు. ఇప్పుడు అప్‌గ్రేడ్, అప్‌డేట్ మోడల్‌గా కొత్త అవతారంలో తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. 2022లో నిలిచిపోయిన తర్వాత, కంపెనీ దాని థర్డ్ జనరేషన్ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టాలని చూస్తోంది. కొత్త డస్టర్ అధికారికంగా జనవరి 26, 2026న ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఇది భారత మార్కెట్‌లో విడుదల కానుంది. ఈసారి రెనాల్డ్ డస్టర్ SUV డిజైన్, ఫీచర్లు, ఇంజిన్.. మూడింటిలోనూ భారీ మార్పులు చూడవచ్చు. ఆ వివరాలపై ఓ లుక్కేయండి. 

Continues below advertisement

మరింత స్టైలిష్, పవర్‌ఫుల్ డిజైన్

 రెనాల్ట్ డస్టర్ 2026 మునుపటి కంటే మరింత స్పోర్టీ లుక్‌తో వస్తుంది. రెనాల్డ్ డస్టర్ కొత్త CMF-B మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేశారు. ఇది SUV స్థిరత్వాన్ని పెంచడమే కాకుండా, కొత్త టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. కొత్త డస్టర్‌లో పెద్ద ఫ్రంట్ గ్రిల్, కొత్త రెనాల్ట్ లోగో, శక్తివంతమైన LED హెడ్‌లైట్‌లు, లావైన బాడీ క్లాడింగ్, వెడల్పాటి ఎయిర్ డ్యామ్ SUVకి దృఢమైన ఆఫ్-రోడర్ లుక్ ఇస్తున్నాయి. వీటికి అదనంగా, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, పెద్ద ఫెండర్‌లు, వీల్ ఆర్చ్ క్లాడింగ్, C-ఆకారపు LED టెయిల్ లాంప్స్ దీనిని మరింత మెరుగ్గా చేస్తాయి. కొత్త రెనాల్డ్ డస్టర్ దాని బోల్డ్ డిజైన్ కారణంగా రోడ్డుపై గతంలో కంటే మరింత ప్రీమియం, శక్తివంతంగా కనిపిస్తుంది.

ప్రీమియం, హై-టెక్ ఇంటీరియర్

కొత్త తరం డస్టర్‌లో, రెనాల్ట్ ఇంటీరియర్‌ను పూర్తిగా అప్‌డేట్ చేసింది. తద్వారా రెనాల్డ్ డస్టర్ ఇప్పుడు కేవలం ఒక రగ్డ్ SUVగా కాకుండా ఫీచర్-ప్యాక్డ్, ఆధునిక SUVగా మారుతుంది. ఇందులో కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్, ఆల్-బ్లాక్ లేదా డ్యూయల్-టోన్ క్యాబిన్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ Android Auto సహా Apple CarPlay, వైర్‌లెస్ ఛార్జింగ్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటాయి. బెస్ట్ సౌండ్ ఫీచర్లో భాగంగా అర్కామిస్ 3D సౌండ్ సిస్టమ్ ఇచ్చారు.  భద్రత విషయానికి వస్తే ఇందులో 360 డిగ్రీల కెమెరా, ADAS వంటి ఆధునిక ఫీచర్‌లు చేర్చారు. ప్రీమియం మెటీరియల్స్ కారణంగా, క్యాబిన్ ఇప్పుడు గతంలో కంటే మరింత సౌకర్యవంతంగా, లగ్జరీగా ఉంటుంది.

Continues below advertisement

పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే

2026 రెనాల్ట్ డస్టర్ భారతదేశంలో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ మాత్రమే వస్తుంది. ఇందులో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 156 BHP శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు 6 స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు రెండూ ఉంటాయి. ఈ ఇంజిన్ పనితీరు, సాఫీగా డ్రైవ్ చేసేందుకు ఫేమస్ అయింది. 

Hyndai Cretaతో పాటు కియా Seltos లకు గట్టి పోటీ

కొత్త డస్టర్ మార్కెట్లోకి వచ్చాక Hyundai Creta, కియా సెల్టోస్ (Kia Seltos), టాటా కర్వ్ (Tata Curvv), మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara), Toyota Hyryder వంటి SUVలకు పోటీ ఇస్తుంది. రెనాల్ట్ డస్టర్ డిజైన్, ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్‌ను చూస్తే, ఈసారి రెనాల్ట్ మార్కెట్‌లో గ్రాండ్ కం బ్యాక్ ఇవ్వబానికి సిద్ధంగా ఉందని స్పష్టమవుతోంది.