Renault Duster Real World Mileage: ఇటీవల కొత్త మిడ్‌సైజ్ SUV డస్టర్‌ను తీసుకొచ్చిన రెనాల్ట్, ఈ మోడల్‌లో 1.0 లీటర్ & 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలను అందిస్తోంది. అయితే ఎక్కువ పవర్ ఇచ్చే ఇంజిన్ అంటే మైలేజ్ తప్పనిసరిగా తగ్గిపోతుందా? లేక తక్కువ పవర్ ఇంజిన్ ఎక్కువ ఇంధన పొదుపు చేస్తుందా? అనే ప్రశ్నకు రియల్ వరల్డ్ టెస్టింగ్ ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.
రెనాల్ట్ డస్టర్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 100 hp పవర్ & 166 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్ రెనాల్ట్ కైగర్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. మరోవైపు 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఏకంగా 163 hp పవర్ & 280 Nm టార్క్‌ను అందిస్తోంది. ఈ ఇంజిన్ ప్రస్తుతం ఈ విభాగంలోనే అత్యంత శక్తివంతమైన టర్బో పెట్రోల్ యూనిట్‌గా నిలుస్తోంది.
రెండు ఇంజిన్‌లకూ 6 స్పీడ్ MT గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. 1.3 లీటర్ ఇంజిన్‌కు అదనంగా 6 స్పీడ్ DCT ఎంపిక కూడా ఉంది. 1.0 లీటర్ వేరియంట్ బరువు 1,316 కిలోలు కాగా, 1.3 లీటర్ వేరియంట్ 1,372 కిలోల బరువుతో వస్తుంది. రెండు మోడళ్లలోనూ 50 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కంపెనీ అందించింది.
రియల్ వరల్డ్ మైలేజ్ పరీక్షల్లో ఎక్స్‌పర్ట్‌లు ఈ రెండు ఇంజిన్‌లనూ Eco మోడ్ & ఆటో స్టార్ట్/స్టాప్ ఫీచర్‌తో పరీక్షించారు. నగరంలో 1.3 లీటర్ ఇంజిన్ స్వల్ప ఆధిక్యాన్ని నమోదు చేసింది. 1.0 లీటర్ ఇంజిన్‌తో పోలిస్తే ఇది కేవలం 0.06 kmpl ఎక్కువ మైలేజ్ ఇచ్చింది. లాంగ్ గేర్ రేషియో కారణంగా తరచుగా గేర్ మార్చాల్సిన అవసరం లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా తేలింది.
ఇది కూడా చదవండి: ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?
అయితే 1.0 లీటర్ ఇంజిన్ పరీక్ష సమయంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా AC ఎక్కువ సేపు పనిచేయడం & ఆటో స్టార్ట్/స్టాప్ ఫీచర్ పరిమితంగా పని చేయడం వల్ల సిటీ మైలేజ్‌పై ప్రభావం పడింది.
హైవేపై మాత్రం పరిస్థితి పూర్తిగా మారింది. అక్కడ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 1.3 లీటర్ ఇంజిన్ కంటే 0.74 kmpl ఎక్కువ మైలేజ్‌ను అందించింది. మొత్తం సగటు మైలేజ్‌లో కూడా 1.0 లీటర్ వేరియంట్ స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. 1.0 లీటర్ వేరియంట్ సగటున 10.98 kmpl ఇవ్వగా, 1.3 లీటర్ వేరియంట్ 10.64 kmpl మైలేజ్‌ను నమోదు చేసింది. అంటే రెండు మోడళ్ల మధ్య వాస్తవ వినియోగంలో కేవలం 0.34 kmpl మాత్రమే తేడా కనిపించింది. ARAI ప్రకటించిన గణాంకాల్లో ఉన్న 1.66 kmpl తేడాతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో టాటా సియెర్రా EV ఫైనల్‌గా ఎంతకు వస్తుంది? ఆన్‌రోడ్ ధరలు, EMI వివరాలు ఇవిగో
ధరల విషయానికి వస్తే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ డస్టర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.10.49 లక్షల నుంచి రూ.13.49 లక్షల వరకు ఉంది. 1.3 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ ధర రూ.12.99 లక్షల నుంచి రూ.16.99 లక్షల వరకు నిర్ణయించారు. ఒకే వేరియంట్‌లో 1.3 లీటర్ ఇంజిన్‌ను ఎంచుకుంటే గరిష్ఠంగా రూ.1.30 లక్షల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అందుబాటు ధరలో మంచి మైలేజ్ కోరుకునే వారికి 1.0 లీటర్ డస్టర్ ఆకర్షణీయమైన ఎంపికగా కనిపిస్తోంది. అయితే, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, వేగవంతమైన డ్రైవింగ్ అనుభవం కోరుకునే వారికి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ సరైన ఎంపిక అవుతుంది. మైలేజ్ పరంగా చూస్తే రెండు మోడళ్ల మధ్య పెద్దగా తేడా లేదు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
