Renault Car Discounts August 2026: కొత్త కారు కొనబోతున్నవాళ్లకు రెనాల్ట్‌ ఒక శుభవార్త చెప్పింది. ఈ నెలలోనే (ఆగస్టు 2026) కారు కొనేవాళ్లకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. కొత్తగా విడుదలైన Duster మినహా మిగతా అన్ని మోడళ్లపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను ఈ కంపెనీ అందిస్తోంది. ఈ ఆఫర్లు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు చేసిన బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తాయి.

Continues below advertisement

ఈ నెలలో Renault Kigerపై అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. Kwidపై తక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. Kiger & Triber కొనుగోలుదారులకు లాయల్టీ బెనిఫిట్స్, కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 

రెనాల్ట్‌ కైగర్‌ఈ నెలలో Renault Kiger కొనేవాళ్లకు గరిష్ఠంగా రూ.68,000 వరకు ప్రయోజనాలు అందుతాయి. కేరళ & గుజరాత్ మినహా మిగతా అన్ని రాష్ట్రాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇందులో రూ.20 వేల వరకు నగదు డిస్కౌంట్ ఉంది. పాత వాహనాన్ని ఎక్స్‌ఛేంజ్ చేయడం లేదా స్క్రాపేజ్ కింద ఇచ్చేవాళ్లకు రూ.25 వేల వరకు అదనపు ప్రయోజనం లభిస్తుంది. ఇప్పటికే Renault వాహనం ఉన్న వారికి రూ.18 వేల వరకు లాయల్టీ బెనిఫిట్ కూడా ఉంది. అదనంగా రూ.5 వేల కార్పొరేట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు.

Continues below advertisement

కేరళ & గుజరాత్ రాష్ట్రాల్లో మాత్రం Kigerపై ఆఫర్లు కొంత భిన్నంగా ఉన్నాయి. అక్కడ క్యాష్‌ డిస్కౌంట్ గరిష్ఠంగా రూ.50 వేల వరకు ఉంది. ఎక్స్‌ఛేంజ్ ప్రయోజనం కూడా రూ.50 వేల వరకు లభిస్తుంది. లాయల్టీ బెనిఫిట్ & కార్పొరేట్ డిస్కౌంట్ మాత్రం మిగతా రాష్ట్రాల మాదిరిగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం Renault Kiger ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.81 లక్షల నుంచి రూ.10.40 లక్షల వరకు ఉంది.

ఇది కూడా చదవండి: రేస్‌ బైక్‌ తరహాలో Yamaha R15 V4, MT-15 MotoGP ఎడిషన్లు లాంచ్‌ - FZ-S సిరీస్‌కు కొత్త రంగులు

రెనాల్ట్‌ ట్రైబర్‌Renault Triberపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. కేరళ & గుజరాత్ మినహా ఇతర రాష్ట్రాల్లో ఈ MPVపై గరిష్ఠంగా రూ.60,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.15 వేల నగదు డిస్కౌంట్ ఉంది. స్క్రాపేజ్ కింద రూ.25 వేల వరకు లేదా ఎక్స్‌ఛేంజ్ కింద రూ.15 వేల వరకు బెనిఫిట్‌ పొందొచ్చు. అదనంగా రూ.5 వేల కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు.

కేరళ & గుజరాత్ రాష్ట్రాల్లో Triberపై నగదు డిస్కౌంట్ రూ.30 వేల వరకు ఉంది. ఎక్స్‌ఛేంజ్ ప్రయోజనం కూడా రూ.30 వేల వరకు లభిస్తోంది. స్క్రాపేజ్ & కార్పొరేట్ బెనిఫిట్స్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. Triber ఎక్స్‌షోరూమ్ ధర ప్రస్తుతం రూ.5.81 లక్షల నుంచి రూ.8.53 లక్షల మధ్య ఉంది.

ఇది కూడా చదవండి: TVS స్కూటర్ల ధరలు పెంపు.. పాపులర్‌ మోడళ్ల రేట్లు ఏకంగా రూ.11,000 వరకు హైక్‌, ఇదిగో లిస్ట్‌

రెనాల్ట్‌ క్విడ్‌ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ Renault Kwidపై కూడా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో రూ.15,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్ & రూ.25,000 వరకు స్క్రాపేజ్ బెనిఫిట్ లభిస్తోంది. మొత్తంగా, రూ.40 వేల వరకు ప్రయోజనం పొందొచ్చు.

అయితే Kwid కోసం ప్రకటించిన ఈ ఆఫర్ అన్ని రాష్ట్రాలకు ఒకేలా వర్తించదు. కేరళ, అస్సాం, కర్ణాటక, ఒడిశా, ఉత్తరాఖండ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్ & ఆంధ్రప్రదేశ్‌లో నగదు డిస్కౌంట్ రూ.30 వేల వరకు ఉంది. స్క్రాపేజ్ బెనిఫిట్ మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. Kwid ఎక్స్ షోరూమ్ ధర రూ.4.53 లక్షల నుంచి రూ.5.61 లక్షల వరకు ఉంది.

నగరాన్ని బట్టి, డీలర్‌ను బట్టి, స్టాక్ లభ్యతను బట్టి ఈ ఆఫర్లలో స్వల్ప మార్పులు ఉండొచ్చని రెనాల్ట్‌ తెలిపింది. అందువల్ల, కొత్త కారు బుక్‌ చేసే ముందే మీ దగ్గరలోని Renault డీలర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.