Prayagraj Smart City E Bikes: త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం కోసం ప్రయాగ్‌రాజ్ వెళ్లే తెలుగు వాళ్లకు గుడ్ న్యూస్. ఎక్కువ దూరం నడవలేక పడే ఇబ్బందులకు కాలం చెల్లింది, ఇప్పుడు సీన్ మారింది. ప్రయాగ్‌రాజ్ (సంగమ్ సిటీ) లో, స్మార్ట్ సిటీ మిషన్ కింద, పబ్లిక్ బైక్ షేరింగ్ సిస్టమ్ (PBS) కొత్త లెవల్‌కి వెళ్లింది. సిటీలోకి ఎలక్ట్రిక్ బైక్‌లు (E-Bikes) ఎంటర్ అయ్యాయి. దీంతో.. తెలుగు రాష్ట్రాల నుంచి త్రివేణీ సంగమానికి (ప్రయాగ్‌రాజ్) వెళ్లే పెద్దలు, మహిళలు, యువత - ఎవరైనా సరే, సిటీలో చిన్న దూరం నుంచి కాస్త ఎక్కువ దూరం వరకు సులభంగా ట్రావెల్ చేయవచ్చు.
కొత్తగా వచ్చిన ఈ-బైక్‌లుప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్న Charted Bike Pvt Ltd ఇప్పటికే 25 ఈ-బైక్‌లను సిటీలోకి తీసుకువచ్చింది. వచ్చే 2, 3 నెలల్లో మరో 40 బైక్‌లు కూడా జోడించనుంది. ప్రారంభ దశలో సివిల్ లైన్స్‌తో పాటు 5 మెజర్ PBS స్టేషన్లలో ఈ-బైక్‌లు అందుబాటులోకి వస్తాయి.
రెంటల్ ఛార్జీలు & రిజిస్ట్రేషన్‌ఈ-బైక్‌లను ఉపయోగించాలంటే యూజర్స్ మొదటగా ₹500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. తర్వాత రెంటల్ ఛార్జీ కట్టాలి. ఈ ఛార్జీలను కూడా చాలా తక్కువగా ఫిక్స్ చేశారు:
మొదటి 30 నిమిషాలకు = ₹10
ప్రతి అదనపు నిమిషానికి = ₹1
ఎప్పుడో ఒకసారి వెళ్లే యాత్రికులకే కాదు, డైలీ ఉపయోగించుకునే వాళ్లకు కూడా ప్రత్యేక ఆఫర్ ఉంది. రెగ్యులర్ యూజర్స్ కోసం వారపు పాస్ ₹400, నెల పాస్ ₹1,500 గా నిర్ణయించారు.
రేంజ్ & టెక్నాలజీఒక్కో ఈ-బైక్ ఖరీదు సుమారు ₹70,000. సింగిల్ చార్జ్‌తో, పెడల్ లేకుండా 40 కి.మీ. దూరం & పెడల్‌తో కలిపి 60 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది. ప్రతి బైక్‌లో GPS సిస్టమ్, ఆటో-లాక్ మెకానిజం ఉంటుంది. అంటే, బైక్ సిటీ జియో-బౌండరీ దాటితే ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. దీంతో దొంగతనం రిస్క్ జీరో! .
మీకు వీలైన ప్రాంతంలో హ్యాండోవర్ చేయొచ్చుఈ ప్రాజెక్ట్ కింద, సంగమ్ సిటీలో ఇప్పటికే 70 బైక్ స్టేషన్లు నిర్మించారు. వీటిని త్వరలోనే ఈ-బైక్‌లతో అప్‌గ్రేడ్ చేయనున్నారు. అద్దెకు తీసుకునే వ్యక్తి, ఒక స్టేషన్‌లో బైక్ తీసుకుని, మరొక స్టేషన్‌లో అప్పగించవచ్చు. దీనివల్ల తెలుగు యాత్రికులకు సమయం ఆదా అవుతుంది. బైక్ అప్పగించడానికి మొదటి స్టేషన్‌కు తిరిగి రావలసిన అవసరం లేదు కాబట్టి ఆ దూరానికి చెల్లించాల్సిన డబ్బు కూడా ఆదా అవుతుంది.
డిజిటల్ పేమెంట్స్‌అన్ని లావాదేవీలు డిజిటల్‌గా జరుగుతాయి. మీ చేతిలో డబ్బు లేకపోయినా, స్మార్ట్ ఫోన్ లేదా కార్డ్ ఉంటే చాలు. అన్ని లావాదేవీలు క్యాష్‌లెస్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా జరుగుతాయి.
సంగమ్ సిటీలో కొత్తగా ప్రారంభమైన ఈ-బైక్‌లు అర్బన్ మొబిలిటీకి కొత్త దారి చూపిస్తున్నాయి. అంతేకాదు, తక్కువ ఖర్చు, ఈజీ రైడ్, గ్రీన్ ట్రావెల్ వల్ల యాత్రికులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.