ఓలా ఇటీవలే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కారు లాంచ్ చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ దీనికి సంబంధించిన ఇమేజ్‌ను ట్వీట్ చేశారు. అయితే ఆ ఇమేజ్‌లో కారును బ్లర్ చేశారు. తక్కువ ధరలో హ్యాచ్‌బ్యాక్ లాంచ్ చేసి, తర్వాత సెడాన్ కారును లాంచ్ చేసే ఆలోచనలో ఓలా ఉన్నట్లు తెలుస్తోంది.
ఓలా సెడాన్ లుక్ చూడటానికి ప్రీమియం సెడాన్ తరహాలో ఉంది. పెద్ద బ్యాటరీని ఇందులో అందించనున్నారు. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ తరహాలో పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్ ఉండే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన వివరాలు ఇంకా కచ్చితంగా తెలియరాలేదు. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో తక్కువ ధరతో లాంచ్ చేస్తే ఈ కార్లు వినియోగదారుల్లో మంచి క్రేజ్ సంపాదించుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం నెక్సాన్ ఈవీ మ్యాక్స్, ఎంజీ జెడ్ఎస్ ఈవీలు మాత్రమే పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉన్న చవకైన ఆప్షన్లు. వీటి ధర రూ.25 లక్షలలోపే ఉంది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించడం ఒక విషయం అయితే ఎలక్ట్రిక్ కారును తయారు చేయడం చాలా కష్టమైన అంశం. ఓలా ఎలక్ట్రిక్ కారు వచ్చే సంవత్సరం మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఇక స్కూటర్ల విభాగంలో ఓలా ఎస్1కు చాలా హైప్ వచ్చింది. సేల్స్‌లో కూడా పోటీ స్కూటర్లను దాటి ముందుకు దూసుకుపోయింది. అయితే కార్లలో ఇప్పటికే పోటీ విపరీతంగా ఉంది. ఎంతో పేరున్న ప్రముఖ బ్రాండ్లు కూడా ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తున్నాయి. కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ కారు వీటికి పోటీ ఇచ్చే స్థాయిలో ఉంటుందేమో చూడాలి.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?