Odysse Sun Electric Scooter Price, Range, Features Telugu: ఒడిస్సే ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ, తన కొత్త హై-స్పీడ్ ఇ-స్కూటర్ Odysse Sun ను భారతదేశంలో లాంచ్‌ చేసింది. ఈ స్కూటర్ రెండు బ్యాటరీ ఆప్షన్లతో వచ్చింది. మొదటిది 1.95kWh బ్యాటరీ ప్యాక్, దీని ధర రూ. 81,000 (ఎక్స్-షోరూమ్) & రెండోది 2.9kWh బ్యాటరీ ప్యాక్, దీని ధర రూ. 91,000 (ఎక్స్-షోరూమ్). పెద్ద బ్యాటరీ వేరియంట్‌ ఫుల్‌ ఛార్జ్‌తో 130 కి.మీ. వరకు రైడింగ్‌ రేంజ్‌ ఇవ్వగలదు. ఈ రేంజ్‌తో దీనిని లోకల్‌లో తిరగడంతో పాటు ఒక మోస్తరు లాంగ్‌ డ్రైవ్‌లకు కూడా ఉపయోగించుకోవచ్చు. Odysse Sun ఎలక్ట్రిక్‌ స్కూటర్ గంటకు 70 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు. 

సిటీ రైడర్ల కోసం ప్రత్యేకంగా డిజైనింగ్‌ఒడిస్సే ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ, Odysse Sun ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను నగరాల్లో ప్రయాణాలు & రోజువారీ అప్‌-డౌన్స్‌కు ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ప్రదర్శిస్తోంది. పనితీరు, సౌకర్యం & సౌలభ్యంలో మెరుగైన సమతుల్యతను ఈ టూవీలర్‌ అందిస్తుందని వెల్లడించింది. 

Odysse Sun ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డిజైన్ ప్లస్-సైజ్ ఎర్గోనామిక్, సీటింగ్ సౌకర్యం & లుక్‌లో స్పోర్టీ అపీల్‌ ఇస్తుంది. ఒడిస్సే సన్ నాలుగు రంగుల్లో (పాటినా గ్రీన్, గన్‌మెంటల్ గ్రే, ఫాంటమ్ బ్లాక్ & ఐస్ బ్లూ) అందుబాటులో ఉంది.

ప్రత్యేకంగా నిలబెట్టే లక్షణాలుఒడిస్సే సన్‌లో LED లైటింగ్ & ఏవియేషన్-గ్రేడ్ సీట్లు ఉన్నాయి, ఇవి దూర ప్రయాణాల్లో రైడర్‌కు సౌకర్యాన్ని ఇస్తాయి. బండి సీటు కింద 32 లీటర్ల నిల్వ స్థలం ఉంది, ఇది ఓలా S1 ఎయిర్ (34L) కంటే కొంచెం తక్కువ & ఏథర్ రిజ్టా (22L) కంటే ఎక్కువ.

ఈ స్కూటర్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ & హైడ్రాలిక్ మల్టీ-లెవల్ అడ్జస్టబుల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి, ఇవి కఠినమైన రోడ్లపై కూడా రైడింగ్‌ సజావుగా ప్రయాణించేలా చేస్తాయి. మెరుగైన బ్రేకింగ్ కోసం, ముందు చక్రం & వెనుక చక్రంలోనూ డిస్క్ బ్రేక్‌లు అమర్చారు. కీలెస్ స్టార్ట్-స్టాప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డబుల్ ఫ్లాష్ రివర్స్ లైట్ & మూడు రైడింగ్ మోడ్స్‌ (డ్రైవ్, పార్కింగ్, రివర్స్) వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఛార్జింగ్ & పరిధిఒడిస్సే సన్ పెద్ద బ్యాటరీ వేరియంట్ (2.9kWh) 130 కి.మీ. వరకు రేంజ్‌ అందించగలదు కాబట్టి, రోజువారీ ప్రయాణాలకు, ముఖ్యంగా రానుపోను కలిపి గరిష్టంగా 100 కి.మీ. వరకు ప్రయాణించేవాళ్లకు ఇది అనుకూలమైన ఆప్షన్‌ అవుతుంది. గంటకు 70 కి.మీ. గరిష్ట వేగంతో వెళ్లగలదు కాబట్టి, అవసరమైనప్పుడు గమ్యాన్ని చేరేందుకు బండిని వేగంగా నడిపి సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. పార్కింగ్, రివర్స్ మోడ్స్‌ కారణంగా మహిళలు కూడా సులభంగా నడపవచ్చు.

ఓలా & ఏథర్ లతో పోటీఒడిస్సే సన్, Ola & Ather వంటి బ్రాండ్లతో పోటీ పడగలదు. ఈ బ్రాండ్లు మరిన్ని హై-టెక్ ఫీచర్లను అందిస్తున్నప్పటికీ.. ఒడిస్సే సన్ దాని సరళత, ఎక్కువ స్థలం & అందుబాటు ధరతో మంచి పోటీని ఇస్తుంది.