Nissan Magnite vs Renault Kiger Comparison: పండుగ సీజన్‌లో కొత్త SUV కొనాలని ఆలోచిస్తున్న వాళ్లకు ఈ వార్త కచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం, కాంపాక్ట్ SUVలను భారతీయులు ఎక్కువగా కొంటున్నారు, ఇది ట్రెండింగ్‌గా మారింది.  ఈ విభాగంలో రెండు వాహనాలు కస్టమర్ల ప్రశంసలు పొందుతున్నాయి, అవి - కొత్తగా లాంచ్‌ అయిన రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ & ఇప్పటికే జనం ఇష్టపడిన నిస్సాన్ మాగ్నైట్. ఈ రెండు SUVలు ఒకే ప్లాట్‌ఫామ్‌పై (CMF-A +) తయారయ్యాయి. కానీ.. వాటి డిజైన్, స్పేస్‌ & లక్షణాలలో కొన్ని ప్రత్యేక తేడాలు ఉన్నాయి, ఇదే వాటిని విభిన్నంగా & ప్రత్యేకంగా నిలబెట్టాయి.

ఆంధ్ర, తెలంగాణలో ధర ఎంత?

  • హైదరాబాద్‌లో, రెనాల్ట్ కిగర్ ధర దాదాపు రూ. 6.30 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది & దాని టాప్ మోడల్ రేటు రూ. 11.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. 
  • నిస్సాన్ మాగ్నైట్ ధర కిగర్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లో, నిస్సాన్ మాగ్నైట్ బేస్ మోడల్ రేటు రూ. 6.14 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది, టాప్ వేరియంట్ రూ. 11.92 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. 
  • బేస్ మోడల్‌ను చూస్తే, మాగ్నైట్ మరింత సరసమైనది & టాప్ వేరియంట్‌లో కిగర్ కొంచెం చౌకగా ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ విభాగంలో ఈ రెండూ బలమైన పోటీ కార్లు.

డిజైన్ ఎలా ఉంది?

  • రెనాల్ట్ కిగర్ డిజైన్ స్టైలిష్ & స్పోర్టీగా ఉంది. ఇందులో స్లీక్‌ లైన్లు, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త 2D లోగోతో కూడిన గ్రిల్ & 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. 
  • నిస్సాన్ మాగ్నైట్ మరింత ఆకర్షణీయమైన & శక్తిమంతమైన SUV లాంటి లుక్‌ అందిస్తుంది. విశాలమైన క్రోమ్ గ్రిల్, బూమరాంగ్ ఆకారపు DRLs & డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను ఇది కలిగి ఉంది. 
  • కిగర్, సిటీలో తిరగడానికి స్మార్ట్ & మోడ్రన్‌ అప్పీల్‌ ఇస్తుంది. 
  • మాగ్నైట్ డిజైన్ మరింత మస్క్యులర్‌గా & బోల్డ్‌గా ఉంటుంది.

ఇంటీరియర్ & ఫీచర్లలో తేడాలు

  • కిగర్ ఇంటీరియర్ డ్యూయల్-టోన్ వైట్-బ్లాక్ థీమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు & 8-అంగుళాల టచ్‌స్క్రీన్‌తో ప్రీమియంగా కనిపిస్తుంది. క్యాబిన్‌లో 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 
  • నిస్సాన్ మాగ్నైట్‌లో టాన్-బ్లాక్ ఇంటీరియర్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ & లెథరెట్ సీట్లతో వస్తుంది. దీని 360-డిగ్రీ కెమెరా వల్ల కిగర్ కంటే భిన్నంగా ఉంటుంది. 
  • ఈ రెండు SUVలు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తున్నాయి. 
  • అయితే, కిగర్ బూట్ స్పేస్ పరంగా ముందుంది. దీనికి 405 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది, మాగ్నైట్ 336 లీటర్ల స్పేస్‌ను కలిగి ఉంది.

ఇంజిన్ & పెర్ఫార్మెన్స్‌ఈ రెండు కార్లు ఒకే CMF-A+ ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యాయి & 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తాయి. ఈ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ ఇంజిన్ 72 PS శక్తిని & 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, అయితే టర్బో-పెట్రోల్ ఇంజిన్ 100 PS శక్తిని & 160 Nm టార్క్‌ను ఇస్తుంది. గేర్‌బాక్స్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్, AMT (నేచురల్లీ ఆస్పిరేటెడ్‌) & CVT (టర్బో వేరియంట్‌లకు) ఉన్నాయి. 

ధర & బేస్ వేరియంట్‌ను పరిశీలిస్తే, నిస్సాన్ మాగ్నైట్ చవకగా ఉంటుంది. మీకు పెద్ద బూట్ స్పేస్ & ప్రీమియం ఇంటీరియర్ కావాలంటే, రెనాల్ట్ కిగర్ మెరుగ్గా ఉంటుంది. ఈ రెండు SUVలు లక్షణాలు & పనితీరులో దాదాపు సమానంగా ఉంటాయి.