Next Gen Kia Sonet Spotted Testing for the First Time : ఇండియన్ మార్కెట్లో కియా సోనెట్ కు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ కారును మరింత అప్‌గ్రేడ్ చేస్తూ సెకండ్ జనరేషన్ మోడల్ ను కంపెనీ రెడీ చేస్తోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన టెస్టింగ్ పనులు మొదలయ్యాయి. ఇటీవల స్పై ఇమేజెస్ లో కనిపించిన వివరాల ప్రకారం ఈ కారులో భారీ మార్పులే ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.
డిజైన్ హైలైట్స్..కొత్త సోనెట్ డిజైన్ కియా లేటెస్ట్ సేల్టోస్ ను పోలి ఉంటుంది. ముఖ్యంగా ఫ్రంట్ గ్రిల్ డిజైన్ సెల్టోస్ కారును గుర్తుకు తెస్తుంది. హెడ్ లైట్ల పైన ఐబ్రో షేప్ లో ఉన్న ఎల్ఈడీ డిఆర్ఎల్స్ కారుకు అగ్రెసివ్ లుక్ ఇస్తున్నాయి. కారు బంపర్ కూడా ఇప్పుడు చాలా క్లీన్ గా, స్టైలిష్ గా కనిపిస్తోంది. కొత్త డిజైన్ తో వచ్చిన అలాయ్ వీల్స్ కారు అందాన్ని మరింత పెంచుతున్నాయి. ఇక సన్‌రూఫ్ విషయానికి వస్తే, ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ ఇస్తారా లేదా సింగిల్ పేన్ తోనే సరిపెడతారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
క్యాబిన్ , సేఫ్టీ..నెక్స్ట్ జనరేషన్ సోనెట్ ఇప్పుడున్న K2 ప్లాట్‌ఫారమ్ నుంచి సరికొత్త K1 ప్లాట్‌ఫారమ్ కు మారబోతోంది. దీనివల్ల కారు లోపల లెగ్ స్పేస్, హెడ్ స్పేస్ పెరిగే అవకాశం ఉంది. హ్యుందాయ్ వెన్యూ, కియా సైరోస్ వంటి కార్లను కూడా ఇదే ప్లాట్‌ఫారమ్ పై తయారు చేస్తున్నారు. లోపల ఇంటీరియర్ చూస్తే.. పూర్తిగా కొత్త డిజైన్ తో కూడిన డ్యాష్ బోర్డ్ ఉండబోతోంది. 12.3 ఇంచుల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అదే సైజులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చే అవకాశం ఉంది. సేఫ్టీ పరంగా భారత్ ఎన్‌క్యాప్ (Bharat NCAP) లో 5 స్టార్ రేటింగ్ సంపాదించడమే కియా లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందులో లెవల్-2 అడాస్ (ADAS) ఫీచర్లు ఉండే అవకాశం కూడా ఉంది.
ఇంజిన్ ఆప్షన్లు..మెకానికల్ గా చూస్తే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లనే కియా కొనసాగించే అవకాశం ఉంది. వీటిలో మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు కూడా ఉంటాయి. అయితే ఒక కీలకమైన అప్‌డేట్ ఏంటంటే.. కియా ఇప్పుడు స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ పై కూడా పని చేస్తోంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో కూడిన హైబ్రిడ్ మోడల్ 2028 లేదా 2029 నాటికి మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీనివల్ల మైలేజీ పరంగా సోనెట్ తన సెగ్మెంట్ లోనే టాప్ లో నిలుస్తుంది.
పోటీ కంపెనీలు..మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లకు ఈ కొత్త సోనెట్ గట్టి పోటీ ఇవ్వబోతోంది. కియా తన క్వాలిటీ, ఫీచర్ల లోడ్ తో మరోసారి మార్కెట్ ను శాసించాలని ప్లాన్ చేస్తోంది. 2027 లో లాంచ్ అయ్యే నాటికి ఈ కారులో మరిన్ని కొత్త హంగులు చేర్చే అవకాశం ఉంది. ఎస్‌యూవీ లవర్స్ ఈ కొత్త సోనెట్ కోసం కచ్చితంగా వెయిట్ చేయాల్సిందే.
